SEARCH

Thursday 30 October 2014

పోస్ట్ చేసిన రోజే డెలివరీ?!

ఇంటర్నెట్ సేవల రంగ ప్రవేశంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తపాలా శాఖ బుధవారం సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ‘సేమ్ డే డెలివరీ’ పేరిట పోస్ట్ చేసిన రోజే ఉత్తరాలను బట్వాడా చేసే పథకాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. చిక్కడపల్లి పీఎన్ టీ కాలనీలోని తపాలా కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సేవల కోసం ఉద్దేశించిన మూడు వ్యాన్ లను తపాలా శాఖాధికారులు జెండా ఊపి ప్రారంభించారు.

ప్రస్తుతం జంట నగరాలకే పరిమితం కానున్న ఈ తరహా సేవలను రానున్న రోజుల్లో ఏపీ సర్కిల్ లోని అన్ని పట్టణాలకు విస్తరించనున్నట్లు ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. స్పీడ్ పోస్ట్ ఉత్తరాలను కూడా ఇకపై పోస్ట్ చేసిన రోజే బట్వాడా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

Wednesday 29 October 2014

లైఫ్ లో సమతూకం

నేటికాలంలో వ్యక్తులు ఎన్నో ఒత్తిళ్ళ కారణంగా సతమతమవుతుంటారు. దీర్ఘకాలంలో ఈ ఒత్తిళ్ళ కారణంగా జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది. అయితే, లైఫ్ బ్యాలెన్స్ తప్పకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యం మనిషి ఎదుగదలకు కీలకం. మీ వ్యక్తిగత స్థితిగతులు కుటుంబంపైనా ప్రభావం చూపిస్తాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. 

లైఫ్ లో సమతూకం మిమ్మల్ని సంతోషం దిశగా నడిపిస్తుంది. మెరుగైన భవిష్యత్ దిశగా తీసుకెళుతుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలనన్న నమ్మకం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ లాభిస్తుంది. ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలి, పెద్ద ఇల్లు, లగ్జరీ కారు వంటి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో మీ మానసిక స్థయిర్యం కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాలెన్స్ డ్ గా ఉండేందుకు పక్కా ప్లానింగ్ అవసరం. కెరీర్లో కానివ్వండి, వ్యక్తిగత సంబంధాల విషయంలో కానివ్వండి... ప్రణాళికా బద్ధంగా నడుచుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వండి.

Tuesday 28 October 2014

మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే అండాశయ క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువ

మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే అండాశయ క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువని ఈస్ట్ యాంగ్లియా విశ్వవిద్యాలయం తెలిపింది. మహిళల్లో క్యాన్సర్ కారకాలపై పరిశోధన చేసిన ఆ యూనివర్సిటీ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ పరిశోధనల కోసం 25-55 ఏళ్ల మధ్య ఉన్న 1,71,940 మంది మహిళలను పరిశీలించారు. సుమారు 30 ఏళ్ల నుంచి రోజూ రెండు కప్పుల టీ తాగుతున్న వారిపై ఈ పరిశోధన నిర్వహించారు. రెండు కప్పుల టీతో పాటు, తాజా పళ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని నిర్థారించారు.

Monday 27 October 2014

అబ్బా! మళ్లీ ఆధార్


ఆధార్ సంఖ్యకు మొబైల్ సిమ్ ను కేంద్రం అనుసంధానించబోతున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఆర్ఎస్ శర్మ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, "యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కు మొబైల్ సిమ్ ను అనుసంధానించమని ప్రధానమంత్రి మాకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం దానిపైనే పని చేస్తున్నాము. కచ్చితంగా మేమీ సమస్యను పరిష్కరించుకోగల సామర్థ్యం ఉంది" అని సదరు సీనియర్ అధికారి వివరించారు. 

ఇలా చేయడం వలన లావాదేవీల సమాచారమంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. అదే గనుక జరిగితే భారతదేశ ప్రజల సాధికారత సాధనకు ఇది ఓ పరికరంగా ఉంటుందని ఢిల్లీలో జరిగిన ఎఫ్ఐసీసీఐ కార్యక్రమం అనంతరం మీడియాకు ఆ అధికారి వెల్లడించారు.

జీవిత భాగస్వాముల మధ్య డబ్బు వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు

డబ్బు మహా చెడ్డదని వేదాంతులు ఎప్పటినుంచో చెబుతున్న మాట. స్నేహితులను విడదీస్తుంది, భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతుంది. డబ్బు వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తలెత్తే పరిణామాలివి. మిత్రులు, జీవిత భాగస్వాముల మధ్య అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు. 

ఎందరో దంపతుల మధ్య డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒకరు దాచుకుందాం అంటే, మరొకరు ఖర్చు పెడదాం అంటారు. అలాంటప్పుడే తగవు మొదలవుతుంది. అలా కాకుండా, ఇద్దరూ కూర్చుని ఓ బడ్జెట్ రూపొందించుకోవాలి. ఎంత దాచుకోవాలి? ఎంత ఖర్చు చేయాలి? అన్న విషయమై ఓ అవగాహనకు రావాలి. 

భవిష్యత్తుకు సంబంధించి కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎవరికివారు లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా, ఉమ్మడి లక్ష్యం కోసం పాటుపడాలి. అంతేగాకుండా, ఓ ఇల్లు కొంటున్నా, ఓ కారు కొంటున్నా గానీ... భాగస్వామి సలహా ముఖ్యమన్న విషయం విస్మరించకూడదు. ఇలాంటి సమష్టి నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి. 

జీతం రాగానే బడ్జెట్ రూపొందించుకోవడం ఉత్తమం. ఎవరి జీతం దేనికి ఖర్చు చేయాలి? ఎవరి జీతంలో ఎంత దాయాలి? అన్న విషయాల్లో స్పష్టత ఉంటే భవిష్యత్తు ఇక ఆనందదాయకమే!

Thursday 23 October 2014

ఊబకాయులవడానికి ఇదికూడా ఒక మార్గం

రెగ్యులర్ గా తగవులు, ఆర్గ్యుమెంట్లు పెట్టుకునే ఆలుమగలు తొందరగా ఊబకాయులవుతారని అమెరికన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. భార్య లేదా భర్తతో గొడవ పెట్టుకున్న తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు వ్యక్తులు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. అలా, స్ట్రెస్ లో ఆహారం తీసుకున్నప్పుడు, శరీరంలో కేలరీస్ బాగా తక్కువగా ఖర్చవుతాయని... రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ బాగా పెరిగి మెజార్టీ ఆహారపదార్థాలు కొవ్వుగా మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా, ఒత్తిడితో ఆహారం తీసుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంటే ఊబకాయులవడం చాలా తేలికని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Wednesday 22 October 2014

ధ్వని రహిత దీపావళి

రంగుదీపాల హరివిల్లు
మతాబుల చిరునవ్వులు
నింగిని ముద్దాడే తారాజువ్వలు
ముత్యాలు వెదజల్లే చిచ్చుబుడ్లు

రాత్రి అమావాస్య తెస్తుంది  దీపాల పౌర్ణమి మోదం
ఇతర  జీవులకు ప్రమాదం
ఎందుకు కావాలి మన  ప్రమోదం
జరుపుకుందాం ధ్వని రహిత సంబరం 

మీ ఇంట సిరిలు కురవాలనే సుభకామనలు
అందరికి దీపావళి  శుభాకాంక్షలు


ప్రకృతిలో వచ్చే మార్పులు. ఋతు  సంభన్ద  వ్యాధుల నివారణకు పుట్టిన మతాబులు, చిచ్చుబుడ్లు  కాల్చాలనే ఆరోగ్యకరమైన  ఆచారం  హైడ్రోజన్ బాంబుల ధ్వని కాలుష్యంలో అనాచారంగా  మారిపోయింది.
ఈ  బాంబుల ధ్వని వల్ల పాపం పక్షులు, ఇతర జంతువులూ  ఏమి జరుగుతోందో  తెలియక తల్లడిల్లి, ప్రాణాలమీదకు తెచ్చుకున్టాయి  అందుకే  ధ్వని రహిత దీపావళి జరుపుకుందాం 

Tuesday 21 October 2014

మదుపరులకు ఆర్థిక రంగ నిపుణుల సలహాలు - దీపావళి బొనాంజా

మదుపరులకు ఆర్థిక రంగ నిపుణులు దీపావళి బొనాంజా సలహాలు జారీ చేశారు. దేశ వ్యాపార రంగంలో శరవేగంగా వృద్ధి సాధించడమే కాక స్థిరంగా రాబడులను అందిస్తున్న పది కంపెనీల షేర్లను ఈ దీపావళికి కొనుగోలు చేస్తే, వచ్చే దీపావళి నాటికి వాటి ధర దాదాపు 98 శాతం దాకా పెరుగుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ షేర్ల పేర్లు చెప్పండి అంటారా?... ఈ జాబితాలో తొలి స్థానంలో డీసీబీ ఉండగా, రెండో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.

ఆసియానా హౌసింగ్, కేపిటల్ ఫస్ట్, మేఘమణి ఆర్గానిక్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత సట్లెజ్ టెక్స్ టైల్స్, అపోలో టైర్స్, మంగళం సిమెంట్స్, సియారామ్ సిల్క్ మిల్స్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. వీటిలో మేఘమణి ఆర్గానిక్స్ అత్యధికంగా 98 శాతం లాభాలను అందిస్తుందట.

*సూచనగానే గమనించ ప్రార్ధన 
*Investments are subject to  market risk, the above info be used at your own discretion.

Monday 20 October 2014

పచ్చి బొప్పాయి - పండిన బొప్పాయి

పండిన బొప్పాయిలను తినడానికే చాలా మంది ఇష్టపడతారు. అయితే, పోషక పదార్ధాల రీత్యా పచ్చి బొప్పాయి ఎంతో మేలంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు, ఎంజైములు జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చుతాయి. ముఖంపై మొటిమలు, మచ్చలు, పలు రకాల చర్మ వ్యాధులను నయం చేసే శక్తి పచ్చి బొప్పాయికి ఉంది. చర్మానికి చెందిన మృత కణాలను తొలగించి, కొత్త కాంతినిస్తుంది. పచ్చి బొప్పాయితో అమీబియాసిస్, నులిపురుగుల బెడద తప్పుతుంది. తద్వారా, అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలు నెమ్మదిస్తాయి. 

రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్టు చూడడం ద్వారా రక్తపోటు స్థాయిని సరైన స్థితిలో ఉంచుతుందీ పచ్చి బొప్పాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో 39 కెలోరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తినడం ద్వారా కొవ్వు చేరే అవకాశమే లేదు. దీన్ని సలాడ్ల రూపంలోనూ, జ్యూస్ గానూ తీసుకోవచ్చు. 

గాఢ నిద్ర మీకూ కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి !

ప్రస్తుత కాలంలో వ్యక్తులు విశ్రాంతి తీసుకునే సమయం తగ్గిపోతోంది. బిజీ లైఫ్, ఒత్తిళ్ళు ఇలా ఎన్నో అంశాలు వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోయేందుకు తగిన సమయం దొరక్క ఇబ్బంది పడుతుంటారు కొందరు. మరికొందరు పడుకున్నా నిద్ర రాక, అటూ ఇటూ దొర్లుతుంటారు. కంటినిండా నిద్రతోనే అందమైనా, ఆరోగ్యమైనా! శిశువులను చూడండి, వారు ఎంతో హాయిగా నిద్రపోతారు. అలాంటి గాఢ నిద్ర మీకూ కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. 

నిద్ర పోయేందుకు ఫిక్స్ డ్ టైం పెట్టుకోవాలి. దీనర్ధం, ప్రతి రోజూ ఒకే సమయంలో పడకపైకి చేరాలని కాదు. నిద్రవేళకు పడుకోవాలంతే. 

తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం సరికాదు. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల విరామం ఉండేట్టు చూసుకోవాలి. పడుకునే ముందు స్నానం చేస్తే మరీ మంచిది. 

నిద్ర లేవడం కూడా ఫిక్స్ డ్ టైం పద్ధతిలోనే అలవాటు చేసుకోవాలి. చక్కగా నిద్ర పోగలిగితే ఇక ప్రతి రోజూ అలారంతో పని లేకుండా అదే సమయంలో మెలకువ వచ్చేస్తుంది. 

సాయంత్రం వేళల్లో కాసింత ఒళ్ళు వంచగలిగితే శరీరం అలసినట్టవుతుంది. వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ మెరుగవుతుంది. నిద్ర చక్కగా వస్తుంది. 

నిద్రకు ముందు పుస్తకాలు చదవడం చాలా మందికి హాబీ. తద్వారా, నిద్ర ఆలస్యం అవుతుంది. వారు పుస్తకాలు చదవాలనుకుంటే ఏ చైర్లోనో కూర్చుని పూర్తి చేసేయాలి. పడక మీదికి పుస్తకం తేకూడదు. 

రాత్రివేళల్లో లైటు ఉంటేనే కొందరు నిద్రపోతారు. అలాంటి వారు రూల్సు బ్రేక్ చేయాలి. లైట్లు ఆర్పేసి పడుకోవడం అలవాటు చేసుకోగలితే సుఖ నిద్ర సొంతం చేసుకుంటారు. 

బెడ్ పై స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్లు వంటి వాటికి స్థానం కల్పించకూడదు. నిద్రవేళ సంగీతం వినడం కూడా మంచి అలవాటు కాదు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. 

బెడ్ పై ఉండాల్సింది దుప్పట్లు, దిండ్లే. ఇతర వస్తువులకు పడక మీద చోటివ్వకూడదు. 

కాఫీకి దూరంగా ఉండాలి. అందులో ఉండే కెఫీన్ నిద్ర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. 

Saturday 18 October 2014

జలుబు, దగ్గు ? ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ !

వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. అన్ని వయసుల వారూ వీటి బారిన పడక తప్పదు. ముఖ్యంగా వీటి కారణంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి మందులు వాడినా ఉపశమనం లభించదు. అలాంటి సమయాల్లో ఇంట్లో లభించే వస్తువులతోనే వీటికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఆ ఆవిరిని చిన్నారికి పట్టిస్తే దగ్గు చాలావరకు తగ్గిపోతుంది. అంతేగాకుండా, ఛాతీ పట్టేసినట్టుగా అనిపిస్తే ఇది ఎంతో ఉపయోగకరం.

పసుపుకు యాంటీసెప్టిక్ గుణం ఉన్న సంగతి తెలిసిందే. వైరల్ ఇన్ ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు తాగిస్తే ఎంతో రిలీఫ్ గా ఫీలవుతారు. 

జలుబు చేసినప్పుడు గొంతులో నస సాధారణం. అందుకూ ఓ మార్గం ఉంది. గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత పుక్కిట పట్టాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే సరి. 

వేడి నీటి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది. 10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. 

పిల్లలకు తేనె అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. రోజులో రెండు మూడు సార్లు తేనెను వారితో కొద్దికొద్దిగా నాకిస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. ఐదేళ్ళ వయసు పైబడిన పిల్లలకు తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తినిపిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి. 

శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది. 

Thursday 16 October 2014

పిల్లల తగవులు


కొందరు పిల్లలు ప్రతి దానికి మారాం చేస్తుంటారు. అది కావాలి, ఇది కావాలి అంటూ తోబుట్టువులతో గొడవలు పెట్టుకుంటారు. పిల్లల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. అలా కాకుండా, పిల్లల్లో ఆరోగ్యకరమైన అనుబంధం పెంపొందించేందుకు 6 మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

1. రెండో సంతానం గర్భంలో ఉండగానే, తొలి సంతానాన్ని ఈ విషయమై సన్నద్ధం చేయాలి. కుటుంబంలో కొత్తగా రాబోయే వ్యక్తితో మున్ముందు ఎలా మెలగాలో విడమర్చాలి. 

2. ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు? అన్న విషయాన్ని పిల్లలకు స్పష్టంగా తెలియజెప్పాలి. గొడవపడుతున్న పిల్లలను కూర్చోబెట్టి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. బాహాబాహీ తలపడడం, ఒకరి వస్తువులను మరొకరు దొంగిలించడం వంటి పనులను ఉపేక్షించరాదు. 

3. పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చకూడదు. పెద్దబ్బాయి అన్నం తింటూ చొక్కాపై పడేసుకున్నాడనుకోండి, అప్పుడు, నీ చెల్లెలు నీకంటే నయం అంటూ పోలిక పెడితే, అది వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 

4. స్పర్థ ఒక్కోసారి అసూయగా పరిణమిస్తుంది. చిన్నవారిని బాగా చూస్తున్నారని, తమను బాగా చూడడంలేదని కొన్నేసి సార్లు పెద్ద పిల్లలు భావిస్తుంటారు. అలాంటి భావనలు పిల్లల్లో కలగనీయకుండా వారిని సమానంగా చూడాలి. 

5. ఒక్కోసారి టీవీ కోసమో, సైకిల్ తొక్కడం కోసమో పిల్లలు పోటీ పడుతుంటారు. అలాంటప్పుడు వారి వారి గదుల్లోకి వెళ్ళమని సూచించాలి. ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో నిర్దేశించి, ఆ సమయంలో వారా పని చేసేట్టు చూడాలి. చిన్ననాటి నుంచే ఒకరితో ఒకరు వస్తువులను షేర్ చేసుకోవడాన్ని ప్రోత్సహించాలి. 

6. పిల్లలు గొడవ పడుతున్నారు కదా అని ప్రతిసారి జోక్యం చేసుకోవడం సరికాదు. పరిస్థితి చేయి దాటి పోతుందనుకున్న స్థితిలోనే మనం జోక్యం చేసుకోవాలి. 

Wednesday 15 October 2014

ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందట

మిలమిల మెరిసే చర్మ సౌందర్యాన్ని కోరుకోని వారెవరుంటారు? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ రోజుల్లో తాజాగా కనిపించాలని భావిస్తున్నారు. అలా కనిపించాలంటే చర్మానికి తగిన పోషణ అందించాలి. 
ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందట. ఈ విషయంలో క్యారట్, ఆపిల్, ఆరెంజ్, టమేటా, బొప్పాయి జ్యూసులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

*క్యారట్లలో ఉండే విటమిన్ ఏ మొటిమలు, మచ్చలు, మంగు తదితర చర్మ రుగ్మతలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పరిపుష్ఠమైన ఆపిల్ పండ్లు తీసుకుంటే చర్మం ముడతలు పడదు. చర్మ కణజాలం దెబ్బతినదు. 

* ఆరెంజ్ తో చర్మం కొత్త సౌందర్యంతో మెరిసిపోతుందట. బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైము చర్మవ్యాధులను నయం చేయడంలో తోడ్పడుతుంది. 
*అలోవీరా జ్యూస్ కూడా చర్మానికి మేలు చేసేదే.రుచిగా లేకపోయినా  అందులో ఉండే ఖనిజలవణాలు, విటమిన్లు చర్మం యొక్క సాగే గుణాన్ని సరైన స్థితిలో ఉంచుతాయి. 
*టమేటా జ్యూస్ లో ఉండే లైకోపేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మం రంగును మెరుగుపర్చడమే కాకుండా, ముడతలను కూడా మాయం చేస్తుంది.
*బొప్పాయి గురించి అందరికి తెలిసిందే !

జుట్టు రాలటం తగ్గించుకోవడానికి సూచనలు

అపూర్వ షా సూచనలు : జుట్టు రాలటం తగ్గించుకోవడానికి 

జుట్టుకు రంగేయడం, హెయిర్ స్టైలింగ్ జెల్ పూయడం వంటి చర్యలకు స్వస్తి చెప్పాలని, వాటిలోని రసాయనాలు వెంట్రుకల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని అపూర్వ షా చెప్పారు.

జీవనశైలిలో ఎదురయ్యే ఒత్తిళ్ళను అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలని, తద్వారా జుట్టు రాలడానికి కారణమయ్యే అదనపు టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి అడ్డుకట్టవేయవచ్చని తెలిపారు. 

పాలకూర, విరిగిన పాలతో తయారు చేసే జున్ను, ఆక్రోట్లు, అవిసెలను ఆహారంలో తప్పక చేర్చాలని సూచించారు. వీటిలో ఉండే పోషక పదార్థాలు జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తాయని వివరించారు.
 

Monday 13 October 2014

ధ్యానోదయం

ధ్యానం అనగానే అది హిందువులు, సన్యాసులు, వృద్ధులు చేసే పని అంటూ ఎన్నో అపోహలు పేరుకుపోయాయి. ప్రధానంగా పది అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఈ అపోహల వల్ల చాలా మంది సాధన చేయడంలేదు. ఆ అపోహలేంటంటే. మెడిటేషన్ అంటే ఏకాగ్రత అనే అపోహ చాలామందిలో ఉంది. వాస్తవానికి ధ్యానం వల్ల ఏకాగ్రత కుదురుతుందే తప్ప మెడిటేషన్ అంటే ఏకాగ్రతే కాదు. మెడిటేషన్ అంటే మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రశాంతతనివ్వడం. ఇది ఓ క్రమపద్ధతిలో చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. అంతే తప్ప మెడిటేషన్ అంటే ఏకాగ్రతే కాదు. 

అలాగే ధ్యానం హిందూ మతంలో ఓ భాగం అనే అపోహ చాలా మందిలో పేరుకుపోయింది. దీంతో కేవలం హిందూ మత సంబంధీకులే ధ్యానం చేసేవారు. తాజాగా ధ్యానం విలువ తెలుసుకున్న పాశ్చాత్యులు సైతం ధ్యానంపై మక్కువ పెంచుకుని ఆచరిస్తున్నారు. మన దేశంలో మాత్రం ధ్యానం అనేది కేవలం హిందూ సిద్ధాంతం అనే ఆలోచన నుంచి చాలా మంది బయటపడలేకపోతున్నారు. 

ధ్యానం ఓ మతానికి సంబంధించినది కాదని, ప్రజలను, మతాలను, ప్రాంతాలను, దేశాలను ఏకం చేసే ప్రక్రియ అని ధ్యానాన్ని ఆచరించేవారు చెబుతున్నారు. అలాగే ధ్యానం కేవలం వృద్ధులు ఆచరించే కార్యక్రమమని యువతలో ఓ అపోహ బలంగా నాటుకుపోయింది. ధ్యానం ఎనిమిదేళ్ల వయసునుంచే ఆచరించగలిగే ప్రక్రియ. ధ్యానం ఆచరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఆలోచనలు స్వాధీనంలో ఉంటాయని, శరీరంపై అదుపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ధ్యానం చేయడం అంటే హిప్నాటిజం చేసుకోవడమనే అపోహ చాలా మందిలో ఉంది. ధ్యానం ఆచరించగలిగే వారు హిప్నాటిజానికి గురికారని నిపుణులు చెబుతున్నారు. హిప్నాటిజం చేసిన వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదని, యోగాలో ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుస్తుందని, శరీరం, మనసుపై పట్టు వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ధ్యానం అంటే ఆలోచనే అనే భావం చాలమందిలో ఉంది. అది సరికాదని ధ్యానం చేసేవారికి ఆలోచనపై అదుపు వస్తుందని, కేవలం యుక్తాయుక్త విచక్షణ తెలుస్తుందని, దాని వల్ల తాను చేసేది మంచో చెడో తెలుసుకునే స్థాయి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ధ్యానం సమస్యల నుంచి పారిపోవడానికి మంచి ప్రక్రియ అనే భావం చాలా మందిలో కనిపిస్తుందని అది సరికాదని పెద్దలు చెబుతున్నారు. ధ్యానం సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినిస్తుందని, సమస్యకు సరైన స్పందనను తెలియజేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ధ్యానాన్ని గంటల తరబడి చేయాలనే అపోహ బలంగా నాటుకుపోయింది. ధ్యానం సరైన పద్దతిలో చేస్తే, ఏకాగ్రతతో చేయగలిగితే కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని స్పష్టం చేస్తున్నారు. 

ధ్యానం చేస్తే సాధువులు, సన్యాసినులుగా మారుతారనే అపోహ కారణంగా ధ్యానాన్ని చాలా మంది ఆచరించడం లేదు. అయితే ధ్యానం చేసేవారంతా సాధువులు కారని, మంచి జీవనం సాగించడానికి ధ్యానం ఎంతో ఉపకరిస్తుందని వారు తెలిపారు. 

ధ్యానం చేయడానికి ఓ సమయం, సరైన ప్రదేశం ఉండాలనే అపోహ చాలా మందిలో ఉంది.  అయితే ధ్యానం చేయడానికి సరైన ప్రదేశం కంటే సరైన ఏకాగ్రత అవసరం, కాని ప్రతిరోజూ ఒకే నియమిత సమయానికి ధ్యానం చేస్తే సులువుగా ఏకాగ్రత వస్తుంది . అలాగే దిక్కులు కూడా అవసరం లేదు. కావాల్సిందల్లా ఖాళీ కడుపు. అయతే సూర్యోదయాన, సూర్యాస్తమయాన ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తారు తప్ప అది రూల్ కాదు.

రూపాయితో ఏం కొనగలం అనుకుంటున్నారా?

రూపాయితో ఏం కొనగలం అనుకుంటున్నారా? లేక, భారత్ లో రూపాయికి ఏం వస్తాయనుకుంటున్నారా? అయితే, రూపాయితో మనం ఏమేం చేయగలమో ఆ వివరాలు ఇవిగో..! 

రూపాయికి సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి రావచ్చు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో మన బరువు తెలుసుకోవచ్చు. తమిళనాడు వెళితే 'అమ్మ' క్యాంటీన్లో ఇడ్లీ తినొచ్చు. ఓ జిరాక్స్ కాపీని రూపాయితోనే సొంతం చేసుకోవచ్చు. తిన్నది అరిగించుకోవడానికో, కడుపులో మంట తగ్గించుకోవడానికో ఓ జెలూసిల్ టాబ్లెట్, దేన్నైనా అగ్నికి ఆహుతి చేయగల అగ్గిపెట్టె, తలకు పట్టిన మురికిని వదిలించే షాంపూ సాషే, పిల్లలు తినే బిస్కెట్, చాక్లెట్ .  

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అందించే నిరోధ్ బ్రాండ్ 5 డీలక్స్ కండోమ్ ల ప్యాక్ వెల రూ.3. దానర్థం, సింగిల్ కండోమ్ ధర రూపాయి కన్నా తక్కువే. ఇక, పార్లమెంటుకు వెళితే రూపాయితో టీ తాగొచ్చు, రూపాయితో చపాతీ తినొచ్చు. అయితే, రైస్ మాత్రం అక్కడ 2 రూపాయలట.
మన మాజీ ముఖ్యమంత్రి  కిలో బియ్యాన్ని రూపాయికి అందిచే పధకాన్ని ప్రవేశపెట్టేరు కదా !

రెడీమేడ్ ఆహారం - క్యాన్సర్ ముప్పు

ప్రస్తుతం స్పీడ్ యుగం నడుస్తోంది. ప్రజల లైఫ్ స్టయిల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. భారత్ వంటి దేశాల్లోనూ పాశ్చాత్య దేశాల తరహాలో ఇంట్లో వంట చేసుకోవడం క్రమేణా తగ్గుతోంది. రెడీమేడ్ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ఇలాంటి ఆహార అలవాట్లు క్యాన్సర్ కు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల్లో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారుచేసిన ఫ్లేవర్లు, కృత్రిమ చక్కెర కలుపుతారని, వాటి ద్వారా జీర్ణకోశ క్యాన్సర్ తలెత్తే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ తరహా ఆహార పదార్ధాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయని, తద్వారా వాటిలో ఏర్పడే రసాయనిక మార్పులు క్యాన్సర్ కు దారితీస్తాయన్నది నిపుణుల మాట.
ప్రోసేస్సుడ్  ఫుడ్    
రెడ్ మీట్ (బీఫ్, మటన్) తినేవారిలో జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పు అధికమట. ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ లో ఉండే సోడియం నైట్రేట్ రూపాంతరం చెంది క్యాన్సర్ కారకంగా మారడమే అందుకు కారణం. ఈ మేరకు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించగా స్పష్టమైంది. ఈ క్రమంలో రోడ్డు మీద కాల్చే మాంసాహార పదార్ధాలు కూడా ప్రమాదకరమే. ఇక చక్కెర కారణంగా క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయట. చక్కెరతో తయారైన పదార్థాలను అధికంగా తీసుకుంటే బరువు పెరిగి, ఫలితంగా రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశముంది.
ఫ్రైడ్ స్నాక్స్ 
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్ ఐటమ్స్ లో ఉండే అక్రిలమైడ్ అనే పదార్థం క్యాన్సర్ ను కలిగించే గుణం కలిగి ఉంటుంది. ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు ఈ అక్రిలమైడ్ తయారవుతుంది. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో అక్రిలమైడ్ కారణంగా కణుతులు ఏర్పడినట్టు తెలుసుకున్నారు. ముఖ్యంగా, మద్యపానం కారణంగా నోరు, గొంతు, కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

Friday 10 October 2014

సంకల్పం చేసుకోండి.

సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. ఆ కధ ఏమంటే - అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు. 
ఒక గబ్బిలం వుండేది. పై కప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలక్రిందులుగా వేలాడబడి వుంటుంది. ఎక్కువగా చీకట్లో, గుహల్లో వున్నట్లుగా వర్ణన వుంటుంది. 
ది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇఖ వారు ఎవరి మాట వినలేదు. 
ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం!
ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.
"ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే -
భగవంతుడంటాడు - "ఓ బుద్దిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు! పదండి ముందుకు!!

గురువుగారికి కృతజ్ఞతలతో !

Thursday 9 October 2014

ఈర్ష్య - ద్వేషభావం


ఈర్ష్య... వ్యక్తుల నడతకు సంబంధించిన లోపాల్లో ముఖ్యమైనది, ప్రమాదకరమైనది కూడా! స్నేహితులు విడిపోతారు, ప్రేమికుల మధ్య అంతరం పెరుగుతుంది, వైవాహిక బంధం విడాకులకు దారితీస్తుంది. కారణం... ఈర్ష్యే. దీన్నే ఆంగ్లంలో జెలసీ అంటారు. జెలసీ అంటే ఆత్మన్యూనత భావం తప్ప మరోటి కాదు. ఎదుటివారి కంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం, తద్వారా, ఎదుటివారిపై ద్వేషభావం పెంచుకోవడం... ఇదే ఈర్ష్య అంటే! ఈ దుర్గుణం వ్యక్తి ఎదుగుదలను నాశనం చేస్తుంది. దీర్ఘకాలంలో పతనం అంచులకు చేర్చుతుంది. ఈ వ్యక్తిత్వ లోపాన్ని అధిగమించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ ముఖర్జీ కొన్ని విలువైన సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.


ఇది కూడదు 
కొందరు తమను ప్రతి ఒక్కరితో పోల్చుకుంటూ ఉంటారు. దానర్థం, వారిని వారు తక్కువ చేసుకోవడమే. మీ భాగస్వామి మీ చెంత ఉందంటే ఆమె/అతడు మీ సొంతమనే. అలాగని అన్ని వేళలా భాగస్వామి మదిలో మీరే ఉండాలనుకోవడం సరికాదు. ఇతరుల గురించి చర్చించే అవకాశం భాగస్వామికి ఇవ్వాలి. మీ విషయాలు కాకుండా, మరెవ్వరి విషయాలను చర్చిస్తున్నా సావధానంగా వినడం అలవర్చుకోవాలి.


ఇలా చేయవచ్చు 
ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచించడం మానుకోవాలి. మీరు ఫోన్ చేసిన సమయంలో మీ భాగస్వామి వారి ఆఫీసు బాస్ తోనో, మరెవరైనా మిత్రులతోనో మాట్లాడుతూ ఉండవచ్చు. ఆమె/అతడు ఎవరితో మాట్లాడుతున్నారన్న విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అలాంటి విషయాలు తెలుసుకోవడం ప్రాక్టికల్ గా కొన్నిసార్లు సాధ్యం కాదు కూడా. వీటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కంటే, కాసేపాగి ట్రై చేయడం మంచిది. ఇలాంటి సమయాల్లో మనసును ఇతర పనులపై లగ్నం చేయడం ఉత్తమం.


ముందుకు సాగాలి 
జీవితమన్నాక ఒంటరితనం కొన్నిసార్లు అనుభవంలోకి రాకతప్పదు. అయితే, ఆ ఒంటరితనాన్ని అధిగమించడమూ ముఖ్యమే. భాగస్వామితో గొడవలు మామూలు విషయం. వాదన ఆధారంగా మీ భాగస్వామిని అంచనా వేయడం పొరపాటు. ఆవేశంలో ఏవో మాట్లాడతారు. వాటిని పట్టించుకోనవసరంలేదు. ఇలాంటి సమయాల్లో ఒంటరిగా కొంచెం దూరం వాకింగ్ కు వెళ్ళడం ఆత్మపరిశీలనకు ఉపకరిస్తుంది. అలాగని ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకోనవసరంలేదు.

భాగస్వాముల మధ్య కొంచెం ఎడబాటు కూడా అవసరం. అనుబంధంలో కాసింత విరామాన్ని కూడా లాభదాయకంగా మలుచుకోవచ్చు. మీరు మీ స్నేహితులను కలుసుకోవచ్చు, మీ భాగస్వామిని కూడా తన శ్రేయోభిలాషులను కలుసుకునేలా ప్రోత్సహించవచ్చు. మీ భాగస్వామి విశ్వసనీయతపై అనుమానం వస్తే, సాధ్యమైనంత సామరస్యపూర్వకంగా నివృత్తి చేసుకునేందుకు యత్నించండి. ఆ సందేహం మీ భ్రాంతి కావచ్చేమో!

అర్థంలేని ఆలోచనలు మనిషిని డిప్రెషన్ లోకి నెడతాయి. జీవితం సాధారణమైనది అనుకుంటే, దాన్ని అనారోగ్యకర ఆలోచనలతో సంక్లిష్టం చేసుకోకండి. మీ పట్ల మీరు నమ్మకం కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు దేవుడి అద్భుత సృష్టి అని భావించుకోండి. తద్వారా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే నైతిక స్థయిర్యం మీ సొంతమవుతుంది.


Wednesday 8 October 2014

స్వచ్చ భారతం పై పై మెరుగు కాదుగదా !

ఒక గాయం తగ్గాలంటే, రెండు రకాల మందుల అవసరం అవుతాయు. ఒకటి పైపూతగా రాసేది అయుతే, ఇంకొకటి లోన పూతగా తీసుకునే మందు. రెండు సమన్వయంతో పనిచేసినపుడే, ఆ గాయం త్వరగా తగ్గుతుంది. అలాగే, స్వఛ్ఛభారత్ పేరుతో, వీదులు, రోడ్డులు, చుట్టుప్రక్కల పరిసరాలు అన్నింటిని శుభ్రంచేస్తున్నారు. ఇది పైన చెప్పినట్టు పైపూత మందులాంటిది, ప్రభావం పరిమితం. దీనావస్థలోవున్న సర్కారీ స్కూళ్లు, వాటిలో వున్నబాతురూములు దీనస్థితి, వాటివల్ల పిల్లలు లింగభేదం లేకుండా, కాలకృత్యాలకి ఆరుబయటికి పోవటం, ఇప్పటికీ పల్లెటూర్లలో చెంబుతో బయటికి పోతున్న జనం. ఇవి మారకుండా, కేవలం పైపైవి మాత్రమే మెరుగుపడితే, లభించే ప్రయోజనం పభ్లిసిటీ తప్ప, ఇంకేమి వుండదు. తెలుగులో వున్న సామెత మేడిపండు చందాన తప్ప ఇంకేమి గుర్తుకురావట్లేదు నాకు.


ముద్రానందం -7