SEARCH

Sunday 11 December 2016

వామ్మో! పుట్టినరోజు





నాన్న,  తమ్ముడి బర్త్ డే  పార్టీ కి,  మా ప్రెండ్స్ కూడా వస్తున్నారు.
ఇంటిలో అడుగు పెడుతోంటే మా పెద్దాడు,  పదేళ్లవాడు నాకు చెప్పిన సంగతి అది.
సరే,  అని  తల ఊపి , లోపలికి నడిచాను
చిన్నాడికి డ్రెస్ కొనాలి గుర్తు చేసింది నా అర్ధభాగం.
వాడి పుట్టినరోజు ఇంకా వారం రోజులు తరవాత కదా, అప్పుడు చూసుకోవచ్చు అని ఊరుకున్నాను.

ఆవారంలో  ఎదురొచ్చిన ఆదివారం, నా బ్రతుకు  షాపింగ్ మాల్ పాలిట పడేసింది.
***
మిగతా భాగం ఇక్కడ చదివి ,మీ అభిప్రయాలు చెపుతారు కదూ !


http://magazine.maalika.org/2016/12/10/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/#comment-4636

thanks

Wednesday 6 July 2016

సర్వాత్మ భావం

సర్వాత్మ భావం
అందరిలో భగవంతుడిని చూడటమే సర్వాత్మ భావం అయితే ఎంతమంది దేముళ్ళు కనపడాలో ?
లేదా అందరిలోను వున్న ఆత్మ జ్యోతి దర్శనం మనకు కావాలి !
నిజంగా అంతేనా ?
అబ్బ ! ఎన్ని ఎక్సరేలు కనపడతాయో !?
ఒక వ్యక్తిని చుస్తూనే  -  నాకు తెలిసినవాడు , నమ్మకస్తుడు లేదా శత్రువు, దుర్మార్గుడు  అని కాక
వాడు పంచి కట్టుకున్నవాడు, మంచి బట్టలు వేసుకున్నవాడు ,
బాగా డబ్బు ఉన్నవాడు , లేనివాడు ఇలాంటి భావాలు మనకు కలగ కుండా ఇప్పుడు ఏమిటి
వాడు చేసినది  ఏమిటి
అంటే ముందటి పరిచయం, బావాలు లేకుండా

 ఆ వ్యక్తిని లేక సంఘటనను ,వున్నది ఉన్నట్లుగా ,పరిస్థితులను అంగీకరించడం.
ఎవరూ తక్కువ లేక ఎక్కువ కాదు అని తెలుసుకోవడం , మారవలసింది ఎదుటివారు కాదు
మనం మారాలి, అని తెలుసుకోవడమే !

Tuesday 21 June 2016

అజ్ఞానపు లోతులు



పుస్తకం చదవడం , అనుభవం లో తెలుసుకోవడం , ఇవే జ్ఞానానికి దారులు
అయితే మనలో జ్ఞానం పెరిగే కొలదీ, వెలిగే దీపం
మనలో వున్న అజ్ఞానపు లోతులను మనకు పరిచయం చేస్తుంది.
అపుడే మనకు తెలుస్తుంది, తెలుసుకున్నది కొంచెం తెలుసుకోవలసినది అనంతం అని !

అందుకే మనం విజ్ఞులు అనుకునే వారు అణుకువగా ఉంటారు.
చేరుకోవలసిన జ్ఞాన సాగరపు దరిఎక్కడో వారికి తెలుసును కనుక !
  

Monday 6 June 2016

అ. ఆ .......

అ ఆ
పక్క పక్కనే వున్నా ఒకర్ని ఒకరు చూసుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది ! మరి ఒకర్ని ఒకరు తెలుసుకోవడానికి 10 రోజులు సరిపోతాయా ?

పక్కవాళ్ళు  గెలవడానికి మనం, మనింట్లో వాళ్ళు వీధిన పడిపోవడం మంచిది కాదు !

ఇదే ఈ సినిమా

ఈ సినిమాకు హీరో సమంతా,   అంతే ?!
సినిమా మొదట్లో , చివరా  కూడా రావు రమేష్ డైలాగ్ తోనే సిన్మా పూర్తీ
శుభం కార్డ్ పడాలంటే ఫ్యామిలి గ్రూప్ ఫోటో అక్కర్లేదు అని చెప్పిన సినిమా
కధ  లేకపోయినా కధనం బావుంది !
సమంతా at her best ( in all areas!?)
ఆనంద్ విహారీ ( నితిన్ ) గొప్ప సాహసమే ఈ సిన్మా ఒప్పుకోవడం,  చాలా డీసెంట్ గా వున్నాడు
నితిన్ కన్నా నరేష్ ఎక్కువసేపు  స్క్రీన్ ఫై కనిపిస్తాడు .
ఏమైనా త్రివిక్రముడు కొంచెం మాటల గారడీ తగ్గినట్టే ఉంది.
నాకు నచ్చిన సాంగ్  మమ్మీ రిటర్న్స్ !
చాల ఫన్నీ గా ఉంది



Friday 20 May 2016

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

రివ్యూలు అందరూ వ్రాస్తారు
అంటే సినిమా నాకు నచ్చదు అని  చూసేవారు
నాకు నచ్చుతుంది అని చూసేవారు
నేను ఒంటికాయ సొంటికొమ్ములా ఉంటాను, ఫోన్లు, సోషల్ నెట్వర్క్ నా ప్రపంచం అనుకునే వారికి ఈ సినిమా
నచ్చదు

నా కుటుంబం, నా వాళ్ళు అనేవారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతి
మహేష్ అందంగా వున్నాడు, ముగ్గురు హీరోయిన్లు, విలను ఎవరూ, పాటలు బావున్నాయ్ , గొప్ప ఫైటింగ్ లు అని  పెద్ద ఊహతో వెళితే మాత్రం మీరు , సినిమా ఇలా ఉందేమిటి అంటారు!

మీరు ఎలిక్ష్ హెలి వ్రాసిన ది రూట్స్ చదివారా ? ( తెలుగులో ఏడు తరాలు)
ఆ భావం నాకు ఇందులో  కనిపించింది
నేను కోరుకున్నా, కోరుకోకపోయినా, నన్ను బాధపెట్టినా, మోసం చేసినా, ప్రేమించినా , తోడుగా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడయినా,  అది సాటి మనిషే ! వాడు మనవాడే అయితే ఇంకా బాగుంటింది అదే ఈ సినిమా.
నీకు కొన్ని అలవాటులు ఉంటాయి, అవి నీ పూర్వీకుల నుంచి వచ్చినవే !
నీ కష్టంలో, ఆనందంలో తోడుగా ఉన్నవాడికి నీ ఆస్థి ఇస్తావా లేక నీ వారసులకా ?

ఈ సినిమాకు హీరో మహేషు అయితే నిలబెట్టేది  రావు రమేష్ !
సమంతా చెప్పే  తన కధలో , సత్యరాజ్ నమ్మిన ధర్మం, మహేస్ కోరుకునే నా వాళ్ళు నాకు కావాలి అనే ఆశ
అన్నీ కలసిన  ఒక బ్రహ్మోత్సవం.

పండగలు, శుభకార్యాలు వీటికి  మన బంధువులు, ఇష్టులు  ఎందుకు రావాలి ?
చూడండి బ్రహ్మోత్సవం లో
ఆడవారికి, క్లాసు ప్రేక్షకుల సినిమా అంటే  మాసుకు నచ్చదా ?
 





Saturday 14 May 2016

ఇది కంప్యూటర్ సత్యం!

ఇది కంప్యూటర్  సత్యం!

మనం ఏ కమాండ్ ఇస్తామో అదే ఇన్పుట్
మరి, అవుట్ పుట్ ఎలా వస్తుంది ?
మనం ఇచ్చిన  కమాండ్ ప్రకారమే కదా !?

ఒకవేళ తప్పు అవుట్ పుట్ వస్తే
ప్రాసెస్ తప్పు లేదా కమాండు తప్పు !
అంతేకానీ ఔట్పుట్ లో తప్పు ఉండదు.

మరి జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు మనం ఇచ్చే ఇన్పుట్ పైన వచ్చిన అవుట్ పుట్
కాదంటారా?

Friday 29 April 2016

ఏం పేరు ? ఛీ పాడు !!

ఇప్పటివరకూ చంద్రిక, చంద్రకళ , చంద్రముఖి  ఇవన్నీ అమ్మాయి పేర్లు అనే తెలుసు
కానీ ఇవే దెయ్యం సినిమా పేర్లు అని తెలిసింది
ఇప్పుడు శశికళ అనే సినిమా పోస్టర్ చూశాను
అంటే ఇంకా  శశిముఖి , శశంకా  మిగిలాయి

గీతాంజలి ఎంత మంచి పేరు రవీంద్రుని రచన
మణిరత్నం ఆ పేరు తగలేసాడు అన్నారు
మరి దెయ్యం సినిమాకు ఆ పేరు పెడితే  ఏం చేసారో ?
T.V లో సీరియల్ కూడా ఆ దెయ్యం కధే !

సినిమా తీసేవాళ్ళు  ఇడియట్ అనా,  లేక చూసేవాళ్ళు లోఫర్ లా ?!
నాకు గుర్తు వుండి  చిరునవ్వుతో సినిమా సెకండ్ షో  చూసి వస్తున్నపుడు
పోలీస్ వాళ్ళు అడిగితే  పేరు చెప్పాం
కొంచం చిరునవ్వుతో చెప్పండిరా అన్నారు వాళ్ళు
ఇప్పుడు లోపర్ అంటే లోపలే !!!

పోకిరితో బూతులు , బిజినెస్మాను తో స్టైల్ గా రాక్షస ప్రేమ
ఇంక ఇపుడు జన గణ మరణమా ??
సినిమా ఫెయిల్ అయతే బుద్ది  వస్తుంది కదా  అంటే ,
T.V లో నెల తిరగకుండా వస్తుంది
అది ఇంకా బాధ కదా ?

రక్త చరిత్ర  ఒకటి , రెండు అని సినిమాలు తీసిన పెద్దమనిషి
అవి ఆడవాళ్ళు చూసేవి కావు ఇంట్లోనే కూర్చోండి అన్నాడు
కానీ సంక్రాంతి సినిమా స్పెషల్ అని T.V లో వచ్చింది
A  సర్టిఫికేట్ ఉన్న సినిమా T.V లో ఎందుకు వస్తోంది ?
ఫ్రీ గా వస్తే చూసేస్తున్నామే కానీ, దాని పర్యవసానం అర్ధం కావడంలేదు .




Thursday 7 April 2016

ఏమైనది ?

ఏమైనది  ?

ఒకానొకపుడు శుభాకాంక్షలు ఉత్తరాల ద్వారా
తరవాత దూరవాణి లో
ఆ తరవాత చరవాణిలో
ఆ తర్వాత చరవాణి  సంక్షిప్త సందేశాలు
ఇప్పుడు ఫేస్బుక్, వాట్స్ అప్లో
మనం చెపితే ఇతరుల స్పందన తెలిసేది
ఇప్పుడు లైకులు, నీలం గుర్తులు
ఏమైంది ?
మనం  శుభాకాంక్షలు చెపితే సరిపోతుందా !
ఎదుటివారి సుభకామనలు  మనకు వద్దా ! 

ఉగాది 22 వ సంచిక


కొత్త ఉగాది కొత్త ఉషస్సు
కొత్త సంచిక

ఉగాది 22 వ సంచిక
ఈ సంచికలో

పచ్చడి, పంచాంగం
వేసవిలో
పద్యం
రామనవమి

ఇంకా

కప్ప,  కప్ప పక్క కప్ప !



Monday 28 March 2016

కొనసాగించడం ఎంతో కష్టం


చిరాకుగా అన్న ఒక చిన్న మాట
వెక్కిరిస్తూ విసిరిన ములుకులాంటి చూపు
మనవారినే ఎంతో బాద పెడుతుంది
కొత్త మనుషుల్ని పరిచయం చేసుకోవడం
మనవారిని దూరం చేసుకోవడం ఎంతో సులభం
కాని ఉన్న బంధాలను జీవితాంతం కొనసాగించడం ఎంతో కష్టం!?

Tuesday 8 March 2016

నేను పరీక్ష వ్రాసాను


అబ్బబ్బ ఒక అధ్యయనం ముగిసింది
అధ్యాయం కాదు అధ్యయనమే !

చాలా రోజుల తరవాత నేను పరీక్ష వ్రాసాను
నిన్న అంతా విరగాదీస్తామని అనుకుంటే
అనారోగ్యం నన్ను మంచంలో పడేసింది
అయినా సరే ఇవాళ పరీక్షా కాలం ముగించాను
80% వచ్చింది
ఇప్పుడు నాకు ఒక సమస్య
మా పిల్లలకు నా గొప్ప చెప్పుకోవచ్చా ?
ఎందుకంటే వాళ్లకు 90% తక్కువ వస్తే నేను క్లాస్ తీసుకుంటూ  ఉంటాను !


Monday 22 February 2016

వీళ్ళా మన శ్రేయోభిలాషులు ?

వీళ్ళా  మన శ్రేయోభిలాషులు ?

నేను ఏమైనా కొని నీకు చూబిస్తే దాని అర్ధం ఏమిటి ?
ఆ వస్తువు బాగుంది అనో, బాగోలేదు అనో అని చెబుతావు అనుకొని  చూబించాను
నువ్వు ఏమి అన్నావు " మా వాడు కొంటాడు "
అది ఈర్ష్యా, కడుపు మంటో  మరి !
నువ్వు అన్న దానికి అర్ధం నాకు తెలియదు
మరి నీ గొప్పతనం మాత్రం నేను ఎప్పుడూ విన్టూ నీ అభిప్రాయాలను గౌరవిస్తూ ఉంటే
నువ్వు నా హృదయం గాయం చేసే మాటలే  అంటావు
ఇంకా నిన్ను నా శ్రేయోభిలాషి అని అనుకోవాలా ?




Friday 19 February 2016

ఇదెందుకు కొన్నావు

ఇదెందుకు కొన్నావు

మనం ఏదైనా ఒక కొత్త వస్తువు కొనాలంటే పెద్దవారితో, అనుభవజ్ఞులతో కూలంకషంగా  చర్చించి విసిగించి
ఆ వస్తువు కొంటాం .  అంటే ఒక మోటార్ సైకిలో, పరుపో  ఏదో ఒకటి .
మోటారు సైకిల్ మీద సవారికీ బయటకు వెల్లకతప్పదు కదా !
సరే కొత్త మోజులో కొంచెం జాగ్రతగా వాడతాం
అదుగో అప్పుడు కనిపిస్తారు కొంతమంది వాళ్ళు మన  ఆనందంలో పాలు పంచుకోరు సరికదా 
మనం తప్పులో కాలేసి కడుక్కోకుండా ఊరంతా తిరుగుతూ ఉన్నట్లు అంటారు

 ఇదెందుకు కొన్నావు ! ఆ పలానాది ఎందుకు కొనలేదు ? అని . 

అంతే  మనకు తల తిరగడం మొదలు 
వాళ్లకు ఆనందం మిగులు 

Tuesday 16 February 2016

అబ్బో ఫ్రీడం 251

అబ్బో ఫ్రీడం 251

స్మార్ట్ ఫోన్ మానవ  జీవితాల్లో భాగం అయిపోయాక తక్కువ ధరలో దొరికే ఫోన్ల గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు
మెక్ ఇన్ ఇండియా పుణ్యమా అని ఇన్నాళ్ళకి వారి కోరిక తీరబోతోంది
ఇంతకీ ఎంత ధరలో మీకు ఫోన్ కావాలి కనీసం 500 రూపాయలు చెల్లించగలరా ?
పోనీ 251 రూపాయలు!
నిజం ! రింగింగ్ బెల్స్ అనే సంస్థ  251 రూపాయలకే  స్మార్ట్ ఫోన్ అందిస్తోందిట
జూన్ 2016 వరకూ ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా తరువాత. బహిరంగ విపణిలో దొరుకుతుందిట !

ముందుగా ఆన్లైన్ సంస్థల ద్వారా బుక్ చేసుకోవడానికి 17 ఫిబ్రవరి 2016 సాయత్రం 6 గంటల తరువాత వీలు అవుతుంది అని చెపుతున్నారు
మరింకేం  అందరూ రెడీగా ఉన్నారా ?

Friday 12 February 2016

నా ఓటు ఎవరికి?




డాడ్ వాట్ ఫర్ దిస్ ఎలక్షన్స్?  అడిగాడు మా పెద్ద బాబు, 4క్లాసు చదువుతున్నాడు వాడు
మీ క్లాస్ లీడర్ ఎవరు ? అడిగాను నేను.
వాడి ప్రశ్నకు నా ప్రశ్న ఏమిటి అనుకున్నాడేమో ముఖం చిట్లించి, ఫాట్  రమేష్  అన్నాడు

అంటే వాడి ఉద్దేశ్యం,  లావు గా ఉండే రమేష్ అని.

మిగిలిన భాగం ఇక్కడ చదవండి 



Monday 8 February 2016

ఉగాది 21వ సంచిక

ఉగాది 21వ  సంచిక 
ఈ  సంచికలో  
మనసా !
పిల్లలు దైవమిచ్చిన వరం
రధసప్తమి
అమ్మ,నాన్న, గురువు దైవం !

https://www.youtube.com/watch?v=QQDh_stQv2A

Thursday 4 February 2016

అమెరికా ! మా"రాక"!!


అబ్బబ్బ వీళ్ళ లాగులు చూడలేక చస్తున్నాం అంది మా శ్రీమతి లోపలికి వచ్చి తలుపు మూస్తూ.
ఏమైంది? అడిగాను
ఎదుటి ఇంటి పెద్దాయన నిక్కర్లో తిరుగుతూ ఉన్నాడట అదీ విషయం.
మొన్నటిదాకా శుభ్రంగా పంచి, పొడుగు ప్యాంటు లో కనపడేవాడు కదా ! ఆశ్చర్యంగా అడిగాను.
ఏముంది మొన్ననే అమెరికా నించి దిగబడ్డారు. అది సమాధానం
పిల్లలు మారుతున్నారంటే అర్ధం  వుంది. వీళ్ళు ఇలా మారితే ఎలా
పోనీ ఇంట్లో తొడిగి తిరిగితే పరవాలేదు రోడ్డుపైకి వస్తే ఎలా ? శ్రీమతి గొణుగుళ్ళు

నేను ఆలోచనలో పడ్డాను
కట్టు బొట్టు తీరు బాగుండాలి అని ఆడవారిని అంటారు మరి మగవాళ్ళు ఇలా ఎందుకు తయారు అవుతున్నారు
కొంచెం వయసు మళ్లి  అంటే 50 వ పడిలోకి వస్తే  పంచి కట్టకుండా ఉండేవారు కాదు ఇదివరకు పెద్దలు.
మావాడు అమెరికాలో ఉన్నాడు, మేము అమెరికా వెళ్లి వచ్చాం!  అని చెప్పుకోవడం అతిశయంగా ఉన్న రోజులనించి
అక్కడి వేష ధారణలు ఇక్కడా వేసి, వీళ్ళు అమెరికాలో ఉన్న తమ   పిల్లల దగ్గరకు వెళ్లి వచ్చారు అని చూడగానే తెలిసే విధంగా అతిశయ   ప్రవర్తన కొంచెం చిరాకు కలిగించేదే?!
సరి, మరి వాళ్ళ ఇంటి ఆవిడా ఎలా మారిందో ? కనుక్కుందాం అనుకునేలోపు ఆవిడా దర్శనం ఇచ్చారు నైటీలో
ఆహా! అని బోల్డంత ఆశ్చర్యంతో కుర్చీలో కూలబడ్డాను.

ఇంకా మా శ్రీమతి గోణుగుతోంది
నేను ఏమి మాట్లాడకుండా కూర్చున్నాను
ఎందుకంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడితే తను నాకోసమే చేస్తున్న స్పెషల్ వంటకం తగలడుతుంది మరి!


Friday 29 January 2016

Be ready



అకస్మాత్ గా  ఎవరికైనా ఎపుడైనా  ఎక్కడైనా  ఏదైనా  జరుగవచ్చు
ఇది  గుర్తు ఉంచుకుంటే  చాలు, మనం మనకు గాని మన వారికి గాని జరుగు
 ఘటనాఘటనలందు వచ్చు మానసిక తామసిక భావనలను అదుపులో ఉంచుకోగలం.
అంతేనా ఎప్పుడూ  అలాంటి భావన మనకు స్థిరంగా అలవడుటకు
అనుక్షణ భగవానుని నామ  స్మరణ ప్రాధమిక సోపానం.
అందరిలోనూ ఆ పరాత్పరుని చూడగలగటం మనకు తరవాతి శిక్షణ. 
అలా స్థిర చిత్తుడవయిన , ఎటువంటి అలజడి లేకుండా చేయవలసిన కార్యములు
నిర్విఘ్నంగా జరిపించగలవు.

ఇదే నేటి రోజున ప్రాచుర్యంలో ఉన్న pro activeness

Wednesday 27 January 2016

కొంచెం సాయం!


ఆలోచిస్తే మంచి ఊహలు వస్తాయి
వ్రాయడం మొదలు పెడితే మంచి కధలు వస్తాయి
నేను ఇలా నువ్వు అలా  అనకుంటే మనుషులు ఎట్టా!
నీకోసం నేను అనుకుంటే దేముడైనట్టా?

స్వంత లాభం కొంతమాని పరులకు కొంత సహాయం  చేయడం మంచిదే
మనకి, మన ఆరోగ్యానికి
అలాగని అన్ని ఉచితంగా ఇవ్వడం మంచిదికాదు
ఉచిత సలహాలు అస్సలు ఇవ్వరాదు

Monday 25 January 2016

ర్యాలి – శ్రీ జగన్మోహిని కేశవస్వామి

మీకు జరూరుగా ఉద్యోగంలో  స్థానం మార్పు అంటే ట్రాన్సఫర్ కావాలా అయితే వెళ్ళిరండి ర్యాలి. 
      ర్యాలి అనేది ఆంధ్రప్రదేశ్లోని  తూర్పు గోదావరి జిల్లా  రావులపాలెం దగ్గరలోని  ఒక గ్రామం
      ఇక్కడే వున్న ఒక భగవత్ రూపం గురించి విశేషాలు అందిచడమే ఈ శీర్షిక ఉద్దేశ్యం
   
క్షీరసాగర మధనంలో శ్రీహరి ధరించిన రూపాలు రెండు.  మొదటిది ఆరంభంలో కూర్మావతారము అయితే రెండోది అమృతం లభించిన వేళ పంచేందుకు వచ్చిన జగన్మోహిని అవతారం
ఇంకో విశేషం ఏమిటి అంటే అర్ధనారీశ్వర రూపం ఆది దంపతులకు ఏకాత్మ స్వరూపం అయితే,
జగన్మోహిని కేశవ స్వామి వారిది ఒకే భగవత్స్వరూపానికి ఉన్న రెండు రూపాలు అన్నమాట
 అందువలన ఈయన అలాగే దర్శనం ఇస్తారు, అంతేకాదు విష్ణు పాదోద్భవ గంగ అని కదా  మనం విన్నాం ఇక్కడ ఆ విశేషం కళ్ళారా చూడవచ్చు, కేశవస్వామి పాదాలనుంచి నిత్యం ఊరుతూ ఉబికి వస్తూ వుంటుంది గంగ . మనం దర్శించే సమయంలో ఆ గంగా జలం  మనపై ప్రోక్షిస్తారు.
ఐదు అడుగుల ఏక సాలగ్రామ  శిలా మూర్తి జగన్మోహిని కేశవ స్వామి వారిది

     ర్యాలి లో మనం దర్శించే రూపం జగన్మోహిని కేశవ స్వామి వారిది. అంటే అర్ధనారీశ్వరుని రూపంలాంటిది.
     కానీ శివుడు, పార్వతీదేవి కలసి ఉన్న రూపం అర్ధనారీశ్వరునిది అయితే ముందు పురుషరూపం వెనుక స్త్రీ రూపం కలగలసిన స్వరూపం జగన్మోహిని కేశవ స్వామి వారిది

ముందు ఉన్న పురుష రూపం కేశవ స్వామి వారు, విష్ణు అలంకార ప్రియుడు కదా  
    ఇక ఇక్కడ గర్భాలయంలోనికి వెళ్ళవచ్చు. అందువలననే వెనుక ఉన్న మోహినీ రూపాన్ని మనం దర్శించగలం.
     వెనుక స్త్రీ  రూపం కొప్పు ముడిచి పువ్వులు ఉన్న రూపం, పద్మినీజాతి స్త్రీలకు ఉండే పుట్టుమచ్చ, చీర వెనుకవైపు భాగం మనకు స్పష్టంగా కనపడుతుంది.

Friday 22 January 2016

ఆఫీసు లో బూచాళ్ళు

ఆఫీసు నిండా  బూచాళ్ళే

అబ్బబ్బ  వీళ్ళకి ఏమి చెప్పినా అర్ధం కాదు ఎవడు రా ఇది  రాసింది  ఆఫీసు లో బూచా !
వాణ్ని లోపలి రమ్మను అన్నాడు సంజయ్ .
  *****

ఏమైందిరా అలా  వున్నావు  అడిగాను సూర్యాన్ని
ఏమి చేయమంటావు గురూ ! ఏదో ఈ మధ్యన బ్లాగాడిస్తున్న ! నీకు తెలుసు కదా , నిన్న మంచి టైటిల్ పెట్టి  ఒక మంచి సీరియల్  ఒకటి ప్లాను చేసాను  కానీ  మన బాసు అది ఆయన గురించి అనుకుని పొద్దునే నాకు సినిమా చూపించేసాడు అన్నాడు.
నిన్న నేను లీవు లో వున్నాను అందుకని  మావాడి బ్లాగ్  చదవలేదు

వెంటనే అతని బ్లాగ్ ఓపెన్ చేశాను
మంచి టైటిల్  ఆఫీసులో బూచి !
నాకు నవ్వు ఆగలేదు  అది చూడగానే,  మా బాసుపైనే  అని నాకు కూడా అనిపించింది.
పూర్తిగా చదివాక,  బాసు నిన్ను చివాట్లు పెట్టేలాగా ఏమి లేదు కదా అన్నాను
ఒక చిన్న నిట్టూర్పుతో మొదలు పెట్టాడు
****
నీకు ఎన్ని సార్లు చెప్పను ? పై వాళ్ళ గురించి మాట్లాడెపుడు , కొంచెం ఆలోచించి రాయాలి కదా !
నువ్వు బ్లాగ్ లో మంచి విషయాలు రాస్తున్నావని ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి రాస్తావా?
ఆఫీసు లో బూచి  ఏమిటి
బాసు అంటే అంత  చులకనా ?
కోపంగా అడిగాడు సంజయ్
నాకు ఒక్కసారిగా ఏమి అర్ధం కాలేదు , నన్ను చూస్తూనే  మండిపడుతున్న బాసుకి  ఏమి సమాధానం  చెప్పాలో అర్ధం కాలేదు
కాని ఆయనికి చెప్పాలి అని మొదలు పెట్టాను

సర్  ఒక్క మాట ఇది మన కధ కాదు ,
 ఒక ఆఫీసులో బాసు, సబార్డినేట్ వీళ్ళమధ్య  సంబంధాలు , ఎవరి ఆలోచనలు ఎలా వుంటాయి, ఎలా ఉండాలి
అవి నేను ఒక సీరియల్ గా కధలో భాగంగా చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పేసరికి కొంచెం తగ్గి
తన ఆలోచనలు చెప్పాడు
బాసు మీకు ఒక బూచి అయితే,  మీరందరూ బాసుకి బూచాళ్ళే !
అంటే ఆఫీసు నిండా  బూచాళ్ళే అన్నమాట, అన్నాడు  సంజయ్
అంటూ ఆయన చెప్పిన విషయాలు నోట్ చేసుకుని బయటకు వచ్చేసాను .
కాని నన్ను అపార్ధం చేసుకున్నాడని కొంచెం బాధ అన్నాడు  సూర్యం




Thursday 21 January 2016

ఆఫీసులో బూచి

అబ్బబ్బ ఇంకా నిద్రలోనే వున్నారా !
లేవండీ ! అంటూ నిద్ర లేపింది మా శ్రీమతి
ఏమయింది మీరు కూడా స్కూలు కి వెళ్లనని మారాం చేసే పిల్లాడిలా తయ్యారు అయ్యారు

పదండి అని
అవును ఈ మద్య ఆఫీసు కి వెళ్ళాలంటే దడుచ్కుంటూ వున్నాను
ఆఫీసులో బూచిని చూసి !?
ఏపని చేసినా తప్పే, చెయ్యక పోయినా తప్పే
అందుకే నాకు ఏమి చెయ్యాలో తెలీటం లేదు. 
పోనీ మానేద్దాం అంటే ఇప్పటికి ఇప్పుడు ఎలా ?
ఉన్న ఉద్యోగం మానేసి ఇంకో పని వెతుక్కోవడం  ఆత్మహత్య సదృశం .
ఇప్పుడు ఎలా
అందుకే ఏ దేముడు కనిపిస్తే ఆ దేముడికి మొక్కులు మొక్కుతున్నాను

అసలు ఇంత  కష్టం ఎందుకు వచ్చిందో  మీకు చెప్పాలి

సాధారణం గా  ఎక్కడైనా,   ఫైనాన్సు డిపార్టుమెంటు కి హెడ్డ్  C.F.O , మొత్తం అడ్మిన్కి C.O.O  వుంటారు.
నేను చేయడానికి   ఫైనాన్సు డిపార్టుమెంటు వున్నా, మాకు  హెడ్డ్అదేమీ విచిత్రమో గానీ C.O.O అయ్యాడు

అదిగో అప్పడి నుంచి మాకు కష్టాలు
వాడికి ఫైనాన్సు  అంటే తెలీదు మమ్మల్ని అదుపులో పెట్టుకోవాలని తాపత్రయం తప్ప !

పోనీ మేము ఏదైనా ప్రాబ్లెమ్  చెపితే  మీరు వున్నది ఎందుకు ?
ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలయ్య ! అంటాడు దుబాయిశీను  సినిమాలో   ఫైర్ స్టార్ సల్మాన్ రాజు లాగ
పోనీ వాడికి వచ్చిన పిడకల స్టెప్ కూడా వెయ్యడు . అదికూడా  మేమే వేసేసి వాడి గొప్ప అని చెప్పలంటాడు
బాబోయి ఈ బూచి నుంచి మాకు విముక్తి ఎప్పుడో ?!





Tuesday 5 January 2016

ఉగాది 20వ సంచిక

Happy new year to all 
Birthday special issue 
ఈ సంచికలో 
పుట్టినరోజు శుభాకాంక్షలు 
జీవితం ఇచ్చే శిక్ష(ణ) 
పద్యం 
ఉపపాండవులు 
ర్యాలి 
సంక్రాంతి పండుగ