SEARCH

Thursday, 15 October 2015

ఉగాది 17వ సంచిక



దసరా శుభాకాంక్షలు
ఉగాది 17వ సంచిక
ఈ సంచికలో
1.దసరా
2.కోతి ఉపాయం
3. విజయదశమి
4. ఇల్లు కట్టి చూడు !!
5. బతుకమ్మ



https://www.youtube.com/watch?v=jcNyOzDfpYI

Thursday, 1 October 2015

అన్నం , సర్వ దోష నివారణ కారకం !

 


అన్నం పర బ్రహ్మ స్వరూపం  :-ధన కారకం :  తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతే   ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే  శ్రీమంతులు అవుతారు.


రోగ నాశనం : తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తే  వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.చర్మ రోగ నాశనం : తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతే  వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.శాంతికి , ధైర్యం కొరకు :తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.శని దోష నివారణం :తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.ఇచ్చిన ధనం  చేతికి చేరడానికి : అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తుంటే : వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది

Wednesday, 16 September 2015

వినాయక చవితి శుభాకాంక్షలతో !! ఉగాది 16వ సంచిక

వినాయక చవితి శుభాకాంక్షలతో
ఉగాది 16వ సంచిక
ఈ సంచికలో
1. ఇలా జరుపుకుందాం !
2. వ్రతకధ
3. ఇరవై ఒక్క రకాలు
4. ఇల్లు కట్టి చూడు !!
5. ఇదేమి వంట !


Sunday, 16 August 2015

ఉగాది 15వ సంచిక

ఉగాది 15వ  సంచిక 
ఈ  సంచికలో  
1. భారతీయులు !
2. కలాం కలకాలం మీకు సలాం    
3. తెలుగు  పద్యం
4. మనమేనా
5. మహాత్మా నీకు వందనం

6. ఇల్లు కట్టి చూడు !!    

Saturday, 8 August 2015

మృత్యు స్వరూపం


మృత్యు స్వరూపం ఏమిటి? ఆయుష్షు తగ్గడానికి, రోగాలు పెరగడానికి కారణం ఏమిటి?
మృత్యువు స్వరూపం ఇతమిద్దంగా ఇది అని చెప్పడానికి లేదు. కాని కొన్ని విశేషాలు తెలుపుతాను.
కలికాలంలో మానవుడి ఆయుష్షు 128 సంవత్సరాలు. కాని ఎవ్వరూ అన్ని సంవత్సరాలు బ్రతకరు. ఎందువలన?
నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం., వేసవిలో దాహం తీర్చడానికి పెట్టిన చలివేంద్రాలకి పెట్టిన వారి తాతల పేరు నుండి భార్య పేరుతొ సహా చెప్పుకోవడం, ఆలయాలలో ఇచ్చిన గోడగడియారానికి కూడా వంశం లో ఉన్న అందరి పేర్లు పెట్టి ఇది ఫలానా వారు ఇచ్చారని చెప్పుకోవడం ఇలాంటి గోప్పలవలన ఆయుష్షు తగ్గుతుంది.
అత్తమామలని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం, లేదా భర్తతో అత్తమామలపై లేనిపోని చాడీలు చెప్పి తిట్టించడం, గెంటించడం, భర్తని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కయ్యానికి కాలు దువ్వడం, లేనిపోని అనుమానాలతో భర్త లేక భార్య ని హింసపెట్టడం, సంప్రదాయాలని వదిలేయడం.
(అత్తమామలు ఇంట్లో లేకపోతె ఇదే కదా జరిగేది, చెప్పేవారు ఉండరు, తినడం, టివిల ముందు తిష్ట వేసుకుని కూర్చోవడం, వంట చేయడం కూడా మనసు పెట్టె పనిలేదు. వంట చేశాం అంటే చేశాం. ఒక పూజ ఉండదు, గుడికి వెళ్ళడం ఉండదు, చుట్టుపక్కల విషయాలన్నీ చెవిలో వేసుకోవడం. సినిమాలు, షికార్లు అని తిరగం, పిల్లల సంగతి సరేసరి! వీళ్ళని తాయారు చేయడానికి కూడా 100 తిట్టుకుంటూ తయారుచేస్తారు కొందరు తల్లులు. ఎందుకు బ్రతుకుతున్నారో కూడా పాపం పసివాళ్ళకి కూడా తెలియదు.) మొదటి రాత్రి భర్తకి ఈ కలికాలంలో పరీక్ష. విజయం సాధించడా మంచివాడు అవుతాడు. పొరపాటున ఓడిపోయడా వీడి జీవితం నాశనం. గుప్పెట్లో పెట్టి నోక్కేస్తుంది. కొందఱు మహిళా మణులైతే వీడి మీద లేనిపోని చాడీలు చెప్పి ఇంకో వివాహానికి సిద్ధపడతారు.
సంప్రదాయాలు చెప్పెపనిలేదు. వినే అవసరం అంతకంటే లేదు. చెయ్యాలంటే బద్ధకం, చెయ్యాలని ఒకానొకరోజు పూనుకుంటారు. 2రోజులు బాగానే చేస్తారు. 3 రోజు విసుగు వస్తుంది, వారం తిరిగేసరికి మంగళం పడేస్తారు.
ఉదయం 7,8,9 గంటలకి నిద్ర లేవడం, త్రిసంధ్యాకాలాలో నిద్రించడం, తినడం తిరగడం, ఇష్టమైన పని చేయడం తప్పితే సంప్రదాయాలు పట్టించుకోరు. ఉచిత సలహాలు అడగకపోయినా ఇస్తారు. ఇలాంటి కారణముల వలన ఆయుష్షు తగ్గుతుంది.
పాపుల్ని అదేపనిగా తిట్టడం వలన వాడి ఆయుష్షు పెరిగి తిట్టినవారి ఆయుర్దాయం తగ్గుతుంది. అందుకే అన్నారు పాపి చిరాయువు అని.
అనవసరపు అనుమానాలు పెంచుకోవడం వలన, అతిగా ఆవేశపడటం వలన, కోపగించుకోవడం, అరవడం,తిట్టడం, వీటి వలన ఆయుష్షు తగ్గుతుంది.
ప్రమాదంలో మరణించేవారు, ప్రమాదవశాత్తు మరణించేవారు అత్యంత పాపాత్ములు. పుట్టిన వెంటనే మరణించేవారు, చిన్న వయస్సులో మరణించేవారు, తల్లిదండ్రులని భాదించేవారు, గురువులని బ్రాహ్మణులని దూషించేవారు, బ్రాహ్మణ జాతిలో జన్మించి వేదాలు వదిలి ఇష్టం వచ్చినట్టు తిరిగేవారు పరమ పాపాత్ములు. దానం చేయని వారు, చేసేవారిని ఆపేవారు, పురాణములు చెప్పెచోట నిద్రించేవారు, పక్కవారితో పరచాకలు ఆడేవారు, అప్పు ఇచ్చి జలగలా పీడించేవారు, తీసుకున్న అప్పుని ఏదో నెపంతో ఎగ్గోట్టేవారు, ఆహార నియమం పాటించనివారు, బంగారం దొంగతనం చేసేవారు, ఈ కాలంలో ఇవి సాధ్యం కదండీ అని చెప్పేవారు, వీరందరూ రాక్షస అంశాలో జన్మించినవారు. వీరికి ఆయుర్దాయం తక్కువ. బ్రతికినన్నాళ్లు ఏదో ఒక సమస్యతో (ఇంటి రోగమో, వంటి రోగమో, మనస్సులో తీరని ఆవేదనో) బాధపడుతూనే ఉంటారు. చనిపోయిన తరువాత ఘోరమైన రౌరవాది నరకాలలో పడతారు.
ఇంకా ఉన్నాయి కానీ ఎన్నని చెప్తాం. ఎవరికీ వాళ్ళు తెలుసుకోవాల్సిందే. కాకపోతే ప్రస్తుతానికి కొన్ని మాత్రం ఇప్పుడు జరుగుతున్న విషయాలు చెప్పాను. ఇందులో నాపైత్యం ఏమి లేదండి. ఉన్న విషయం చెప్పాను.
ఇప్పటివరకు వీటిలో మీలో ఎవరైనా పైన చెప్పిన పనులు చేస్తే వెంటనే ఆపేయండి, లేదా 1 కి 1000 రెట్లు బాధపడతారు


గురువుగారికి  కృతజ్ఞతలతో 

Friday, 24 July 2015

పిశాచం రూపంలో హనుమంతుడు ????

పిశాచం రూపంలో హనుమంతుడు.....

పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర రణ రంగం లో విజయుడి రధం జెండా పై ”కపి రాజు ”హను మంతుడు కొలువై ఉన్నాడు .యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా ,అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు .కిరీటి రధం దిగి ,రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు .అందరు బంధువులే .కావలసిన వారే .వీళ్ళందర్నీ చంపి ,తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు .కనుక యుద్ధం చేయటం కంటే భిక్షం ఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి .మనసు అంతా వ్యాకులం అయింది .కర్తవ్యమ్ తోచటం లేడు .శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్యమ్ బోధించమని వేడు కొన్నాడు .

బావ మరిది ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడు అర్జునుని మనో భావం గుర్తిన్చాడు శ్రీ కృష్ణ భగవాన్ .వెంటనే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతా సారాన్ని విని పించి యుద్దోన్ముఖుడిని చేశాడు .భగవానుని గీత ను అను సరించి ,విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .

పార్దునికి ,పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రధాపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించు కొన్నాడు .”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తీ తో నమస్కరించాడు .అప్పుడు గోపాల చక్ర వర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హను మంతా !నేను చెప్పిన విషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు .నువ్వు విన్న గీత కు ”భాష్యం ”రచించు .దానితో నీ పిశాచ రూపం అంత రిస్తుంది ”అని శాపాన్ని ,శాప విమోచనాన్ని తెలియ జేశాడు పరమాత్మ .

కురు క్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత,హనుమ పిశాచి రూపం పొంది ,గంధ మాదన పర్వతం చేరాడు .అక్కడ అత్యంత భక్తీ ,శ్రద్ధ లతో భగవద్ గీతను మననం చేసు కొంటూ ”,గీతా భాష్యం ”రచించాడు .అదే హనుమద్ భాష్యం ”గా లోకం లో ప్రసిద్ధి చెందింది .అక్కడక్కడ ఈ భాష్య గ్రంధాలు కనీ పిస్తున్నాయట .

ఈ కదా విశేషా లన్నిటిని మైత్రేయాది మహర్షులకు పరాశర మహర్షి చెప్పి” శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని”సంపూర్ణం గా తెలియ జేశాడు .ఆ మర్నాడు మైత్రేయాది మహర్షులు ,పరాశర మహర్షి ఇత్యాది శిష్య బృందం అందరు కలిసి శ్రీ హనుమ పూజ ను నిర్వహించి ,నైవేద్యం పెట్టి అందరికి తీర్ధ ,ప్రసాదాలను అంద జేశారు .ఎక్కడ హనుమ పూజ జరుగు తుందో అక్కడ శ్రీ రాముడు సీతా ఆంజనేయ సమేతం గా లక్ష్మణ భరత శత్రుఘ్నపరి వారంతో ,ఉమా మహేశ్వరు లతో కొలువై ఉండి అందరకు మనో భీష్టా లను నేర వేరుస్తాడు .

”ఆంజనేయ పాహిమాం -ఆంజనేయ రక్షమాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం ”

”సువర్చ లాధిష్టిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్పణం –భాను ప్రభం ,రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం ,శ్రీ హానూ మంత మీడే”.

”హనుమా, నంజనా సూను,వాయుపుత్రో ,మహా బలహ -రామేష్టహ ,ఫల్గున సఖః ,పింగాక్షో ,అమిత విక్రమః

ఉదధి క్రమణశ్చైవ ,సీతా శోక వినాశనః ,లక్ష్మణ ప్రాణ దాతాచ ,సుగ్రీవస్య దర్పహా ,ద్వాదశైతాని నామాని కపీంద్రస్య

మహాత్మనః -స్వాప కాలే పతేన్నిత్యం ,యాత్రా కాలే విశేషతః ,-తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ”.

”అతులిత బలదామం ,స్వర్ణ శైలాభి దేహం- దనుజ వర క్రుశానుం జ్ఞానినా మగ్ర గణ్యం- సకల గుణ నిధానం ,వానరా ణా మధీశం–రఘు పతి ప్రియ భక్తం వాత జాతం నమామి ”
”సుందరే సుందరే రామః సుందరే సుందరీ కధా –సుందరే సుందరీ సీతా ,సుందరే సుందరం వనం

సుందరే ,సుందరం కావ్యం ,సుందరే సుమ్దరః కపిహ్ -సుందరే సుందరం మంత్రం సుందరే కిం నసుందరం ”

”గోష్పదీకృత వారాశిం మశకీ కృత రాక్షసం -రామాయణ మహా మాలా రత్నం వందే అ నిలాత్మజం ”

”ఒక భూతంబున కుద్భ వించి ,మరి ఇంకో దాని పై కేగి -,ఇంకొక దానిన్ దరి ఈడ్చి ,వేరొకట రక్షో దేశమున్ గాల్చి ,-వేరొక

భూతంబు తనూజ గుర్తెరిగి పెరుమ్గాంచి -,భూత ప్రపంచక రూపాత్మకుడైన మారుతి సమస్తా రాధ్య దైవంబగున్ ”

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం...

”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే –పూర్వా భాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూ మతే

కరుణారస పూర్ణాయ,ఫలా పూప ప్రియాయచ -మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూ మతే

సువర్చలా కళత్రాయ,చతుర్భుజ ధరాయచ -ఉష్ట్రా రూధాయ వీరాయ ,మంగళం శ్రీ హానూ మతే

దివ్య మంగళ దేహాయ ,పీతాంబర ధరాయచ -తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హానూ మతే

భక్త రక్షణ శీలాయ ,జానకీ శోక హారిణే-జ్వలత్పావక నేత్రాయ ,మంగళం శ్రీ హానూ మతే

పంపా తీర విహారాయ ,సౌమిత్రి ప్రాణ దాయినే -సృష్టి కారణ భూతాయ ,మంగళం శ్రీ హనూమతే

రంభా వన విహారాయ ,గంధ మాదన వాసినే –సర్వ లోకైక నాధాయ ,మంగళం శ్రీ హనూమతే

‘ పంచానన భీమాయ ,కాలనేమి హరాయచ –కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూ మతే ”’.

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం సర్వం సంపూర్ణం –ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ –

Monday, 13 July 2015

ఉగాది 14 వ సంచిక- పుష్కరాలు ప్రత్యేక సంచిక

ఉగాది 14 వ సంచిక - పుష్కరాలు ప్రత్యేకం
ఈ  సంచికలో  
1. పుష్కర స్నానవిది  
2. తెలుగు  పద్యం    
3. చాతుర్మాసం  
4. పుష్కర విధి 
5. గోదావరి పుష్కరాలు 
6. ఇల్లు కట్టి చూడు !!