SEARCH

Thursday, 8 June 2017

ది అల్కెమిస్ట్ ! - పరశువేది

పావులో కోహిలో (Paulo Coelho)అనగానే గుర్తుకు వచ్చే ఒక మాట, "ది అల్కెమిస్ట్ !" 1988 లో వెలువడిన ఈ పుస్తకం ఇప్పటికీ ఎంతోమందితో చదివింప చేసేదే,
ఈ రచయిత ఒక  బ్రెజిల్ దేశస్థుడు.  పోర్చుగల్ భాషలో ఇతను వ్రాసే ప్రతీ కధ ప్రపంచం లోని ఎక్కువ భాషలలోకి అనువాదం చేయబడుతున్నాయి.
  దీని తెలుగు అనువాదం పరశువేది పేరుతొ వెలువడింది. 
ఈ పుస్తకం చదివిన చాలామంది తమ సంపాదనా మార్గాలలో ఎదో ఒక మార్పు చేసాం అని చెప్పారు.
నిజంగా అంత మార్పు తెచ్చే విషయాలు ఏమిటి  అంటే....


ఒక కుర్రవాడు గొర్రెల మందను మేపుతూ  జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒక పెద్ద మందను తయారుచేసి ఒక మంచి జీవనం సాగించే స్థితికి దగ్గరలోనే ఉంటాడు.
రాత్రుళ్లు  ఒక పాత చర్చిలో నిద్రిస్తూ ఉంటాడు.
ఆ రాత్రి అతనికి,  ఎక్కడో దూరంలో ఎడారులలో పిరమిడ్ల వద్ద బంగారం దొరికినట్లు కల వస్తుంది.
ఆ కల రావడం అనేది  అదే మొదటిసారి కాదు, అంతకుముందు కూడా అనేకమార్లు అదే కల అతనికి వచ్చింది అని చెపుతాడు రచయిత.
పదే పదే, అదే కల !
ఇక ఆ కల సంగతి ఏమిటో తెలుసుకోవాలని ఆతను  బయలుదేరుతాడు.
తన గొర్రెల మంద అమ్మేసి వచ్చిన డబ్బుతో ఒక కొత్త పట్టణము చేరతాడు.
అక్కడినుంచి ఎడారిలోకి తన ప్రయాణం మొదలు పెట్టాలని అతని ఆలోచన.
అయితే అక్కడ పరిచయం అయిన ఒక వ్యక్తి చేతిలో మోసపోతాడు. తన వద్ద వున్న మొత్తం సొమ్ము పోగొట్టుకుంటాడు.
అక్కడ భాష రాదు, అక్కడ ఎవరూ తనకు తెలియదు, ఒక కొత్త ప్రదేశం చేతిలో చిల్లిగవ్వ లేదు!
తనకు వచ్చిన కలకోసం ముందుకు సాగడం దేవుడెరుగు, తిందామంటే తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టు బట్టలతో మిగిలాడు. . . .
అప్పుడు ఏమి చేయాలి ?  
ఇది అతని ముందు వున్న పెద్ద ప్రశ్న ?!
                                                                      ***
ఇతని పుస్తకంలో ఉండే కొటేషన్లు నిజమే అనిపిస్తాయి, జేవితంపైన సానుకూల దృక్పధం ఏర్పడేలా చేస్తాయి.
మచ్చుకి ఒకటి
"When you want something, all the universe conspires in helping you to achieve it."

నీ కోరిక నిజం అవ్వాలని విశ్వము కూడా కోరుకుని నీవు చేసే ప్రయత్నాలలో తన సహాయం అందిస్తుంది.
     

  

Monday, 29 May 2017

ద్వాదశ రాశులు - అనారోగ్యాలు - జాగ్రత్తలు

ద్వాదశ రాశులు - అనారోగ్యాలు - జాగ్రత్తలు

సాధరణంగా అనారోగ్యాలు పన్నెండు రాశుల వారికి వేరు వేరు విధంగా వుంటాయి. అవి రాకముందే కొన్ని రకాలైన జాగ్రత్తలు పాటించి ప్రయోజనం పొంవచ్చు. అసలు ఏయే రాశుల వారికి ఎలాంటి అనారోగ్యాలు సూచింపబడుతున్నాయి. జోతిష్యశాస్త్ర రీత్యా! అలాగే వారు ఎలాంటి ఆహరం తీసుకొని, ఎలాంటి మందులు వాడి చక్కని ఫలితాలు పొందవచ్చు అన్నది చూద్దామా ?

ప్రతి వ్యక్తి, వ్యాధి నిరోధక శక్తి పెంచు కోవడం అత్యవసరం. తనకు గల లోపాలను తన రాశి బట్టి జన్మకుండలిని బట్టీ, గ్రహస్థితిని బట్టీ, గోచార ఫలితాలను బట్టీ... లగ్న, షష్టి, అష్టమ భావాలను బట్టీ సంపూర్ణంగా గ్రహించి వాటిని పరిష్కరించు కునే అవకాశాలు అధికం చేసుకోవాలి. అలా రాబోయే లోపాలను, సమస్యలను, ఇబ్బందు లను... ఆయా సమయాలను గుర్తించి చెప్పెది జోతిశ్యాస్త్రం. చక్కని ఉపాయాలను, పరిష్కా రాలను, పరిహాలను, జాగ్రత్తలను మంచి జ్యో తిష్కుని ద్వారా తెలుసుకొని అవి ఆచరించి సత్పలితాలను సాధించడం శ్రేయస్కరం ఆనందవరం.
మేషాది మీన రాశులతో జన్మించిన వారికి ఈ రకమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం వుంది అనీ చెప్పటం జరిగింది కానీ అన్నిరకా లు అందరికీ వస్తాయి అనీ, వచ్చి తీరుతాయి అనీ చెప్పటం లేదని సూచన. చాలా మంది ఇది చదివి అమ్మో.. మేం ఫలానా రాశి... అంటే మాకు ఈ అనారోగ్యాలు కచ్చితంగా వస్తాయి అని దయచేసి కంగారుపడవద్దు.    ఒక మంచి విద్యను అభ్య సించిన అందరూ ఒకే రకమైన ఉన్నత ఉద్యో గాలు చెయ్యనట్లే... ఒక రాశిలో పుట్టినంత మాత్రాన  అందరికీ ఈ ఇబ్బందులు రావు, రావాలని లేదు. కానీ అవకాశం వుంది, ఎప్పు డంటే జన్మకుండలిలో గ్రహస్థితి సరిగా లేన పుడు. అలాగే వ్యాధి నిరోధకశక్తిని అందరూ పెంచుకోవాలి.

హోమియో ద్వారా సూచించిన మందులు (మీమీ రాశులకి) కూడా వాడమని, వాడి తీరాలని కాదు అర్థం, అయా రాశుల వారి త త్వానికి ఆయా హోమియో మందులు సరిపో తాయని సూచన మాత్రమే.విజ్ఞులు అయిన పాఠకులు ఈ వ్యాసం లోని అంశాలను గ్రహించి వారికి తగిన జాగ్రత్తలు పాటించి అనారోగ్యాలను దూరం చేసుకునే విధంగా జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలరి మా భావన. ఇందులోని అనారోగ్యాలు అన్నీ మాకే వస్తాయని ఖంగారు పడద్దు. కేవలం ఆయో రాశులవారికి  వచ్చే అవకాశం వుంది అన్నదే మా పరిశీలన.

మేషం: సాధారణంగా ఈ శాశి వారికి తల, ఉదరం (కడుపు), పైత్యం, నత్తి మూత్రపిండాలు, అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు (వ్రణాలు), చర్మమునకు సంబంధించిన విచిత్రమైన అనారోగ్యాలు, జ్వరాలు కలిగే అవకాశాలు మెండు. అంతేకాక అండవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫము, రక్త సంబంధ వ్యాధులు హెచ్చు.

జాగ్రత్తలు:
1. ధ్యానం చేస్తూ ఉండాలి
2. చల్లని పువ్వుల వాడకం మంచిది (పూల సువాసన)
3. పసుపు + తేనే పరిగడుపున తీసుకోవాలి
4. ఆహరంలో కందిపప్పు ఎక్కువగా వుండాలి.

వృషభం: కంఠం (గొంతు), హృదయం, స్వరపేటిక, మలసంబంధ వ్యాధులు, అపస్మారక సంబంధ వ్యాధ్యులు, కఫము, టాన్సిల్స్‌, ఢిప్తీరియా, పయోరియా
(పళ్ళకి సంబంధించిప వ్యాధి), గుహ్యవయవాలు, గొంతు, నాభి ప్రదేశాలు కూడా ఆరోగ్యవంతంగా రక్షించుకోవాలి మూత్ర వాధ్యులు, రక్తక్షీణత, ఉబ్బువ్యాధి కలిగే అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు:
1. ధ్యానం (మెడిటేషన్‌)
2. వ్యాయామాలు
3. నేట్రంసల్ఫ్‌ (హోమియోమందు)
వాడటం మంచిది.

మిధునం: విశ్రాంతి లేకపోవుట, ఊపిరి తిత్తులు, మనోవ్యాధి, ప్రాణవాయువు (ఆక్సీ జన్‌ లోపాలు). నరాల వ్యాధి, న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెముడు, తలనొప్పి, ఉన్మాదం మొదలైనవి.

జాగ్రత్తలు:
1. పౌష్ఠికాహారం తీసుకోవడం
2. గాలి వెలుతురు వున్న గృహ నివాసం
3. క్రీడలు, వ్యాయామం తప్పని సరి
4. కాలీమూరు (హోమియో మందు) వాడాలి. అంతేకాకుండా శరీరారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే మొలకలు వచ్చిన పెసలు తినడం చాలా చాల మంచిది.

కర్కాటం: రొమ్ము, జీర్ణకోశం, హృదయ నాళాలు, నీరు పట్టడం, నంజు కేన్సర్‌, హిస్టీరియా, కఫం, కీళ్ళనొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక, శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిజీజం, వచ్చే అవకాశం వుంది.

జాగ్రత్తలు:
1. ఎక్కువ ఆలోచనలు మానాలి.
2. యోగాసనాలు
3. తమను గురించి ఇతరులు ఏమను
కుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది.
4. మెడిటేషన్‌ మంచిది.
5. కార్క్‌ఫ్లోరు ( హోమియో మందు) మంచిది.

సింహం:
వీపు, వెన్నెముక, హృదయం, హృదయ దౌర్బల్యం, గుండెదడ, నడుమునెప్పి, కడుపునెప్పి, పండ్లనెప్పి, ముఖవ్యాధి మొదలైనవి కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. తమ మనుసలోని భావాలు బహిరంగ పరచడం
2. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం
3. తమ పనులు తామే నిర్వహించుకోవడం
4. మేగ్‌ఫాస్‌ (హోమియో మందు మంచిది)


కన్య:
పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెముక క్రిందిభాగం, అజీర్ణం, విరోచనాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం వుంది.
జాగ్రత్తలు:
1. సమాయానికి మితాహారం
2. వ్యాయమం, మొలకలు వచ్చిన పెసలు
3. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గింపు
4. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవటం
5. కాలీసల్ఫ్‌ వాడం మంచిది


తుల:
ఆందోళన, మూత్రపిండములకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్ధకం, రక్తహీణత కలిగే అవకాశాలు వున్నాయి.
జాగ్రత్తలు:
1. బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి
2. యోగా, వ్యాయామం తప్పని సరి
3 అందరూ మీరు చెప్పినట్లే వినాలి అనే ధోరణి వదిలేయండి.
4. నేత్రం షాను వీరి లోపాలను సమరిస్తుంది.


వృశ్చికం:
తొడలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, దురద, సుఖవ్యాధులు, భగందరము, హృదయమునకు సంబంధించి వ్యాధులు, కఫము మొదలైనవి కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. కందిపప్పు, పసుపు ఆహారంలో వాడాలి
2. చల్లని వాతావరణం మంచిది
3. ఇతరులలో తప్పు పట్టడం మాని ప్రేమానురాగాలను పెంచుకుంటూ.. తప్పు చేయని వారు లోకంలో ఉండరని గుర్తించి సర్దుకోవడం అవసరం.
4. కాల్కేసల్ఫ్‌ వాడితే మంచిది ( హోమియో)


ధనుస్సు:
ప్రమాదాలకు గురికావడం, తొడలు, పిరుదులు, నరములు వీటికి సంబంధించిన అనారోగ్యములు, గాయాలు, రక్తదోషము అనారోగ్యము, చర్మవ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం.. మొదలైనవి కలిగే అవకాశం వుంది.
జాగ్రత్తలు:
1. వ్యాయామం, ప్రాణాయామం
2. తగిన మోతాదులో ఆహరం
3. మొలకలొచ్చిన శనిగలు, అపక్వాహారం
4. ఎక్కువ బాధ్యతలు తలపైనే వేసుకోకుండా మానసిక ప్రశాంతి కోసం రెండుసార్లు ధ్యానం చేయటం మంచిది.
5. ‘సైలీషియా’ మంచి ఫలితాన్నిస్తుంది (హోమియో)


మకరం:
అజీర్ణం, రక్తదోషాలు, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులు, జలుబు, ఉన్నదరోగాలు, వాతసంబంధ అనారోగ్యాలు, మలమూత్ర వ్యాధులు, చలి, చెవుడు, వెన్నెముక వ్యాధి, కెన్సెర్‌, పక్షవాతం మొదలైనవి వానికి అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. వంటికి నువ్వుల నూనె పట్టించుకోవటం
2. నువ్వుపొడి ఆహారంలో వాడకం
3. ప్రాణయామం, సూర్య నమస్కారాలు
4. అపక్వాహారం తీసుకోవట
5. ‘కాల్కేఫాసు వాడకం మంచిది (హోమియో)

కుంభం:
నంజువ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్తప్రసారదోషాలు, గుండెజబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, సీల మండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు మొదలైన అనారోగ్యాలకు అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మకరరాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్‌, ఆహారంలో నువ్వులపొడి వాడటం, సూర్య నమస్కారాలు చెయ్యటం చేయాలి.
2. నేట్రమూరు వాడడం మంచిది
3. ప్రతిపనిలోను చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు.


మీనం:
భాహాద్రేకం, బలహీనత, కీళ్ళజబ్బులు, పాదములు, కాలివేళ్ళు నీరు పట్టడం, మద్యపానాదుల వల్ల వచ్చే అనారోగ్యం, కణతులు, మలకోశం, ఆమకోశం మొదలైన వానికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మొలకలు వచ్చిన శనగలు, మితహారం
2. పసుపు ఆహారంలో తీసుకోవటం
3. కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది
4. ఫెర్రంపాసు (హోమియో) వీరికి తగినది.


గోచార రీత్యా జన్మ చంద్ర లగ్నానికి -షష్టి, అష్టమ  స్థానాల్లో సంచరించే వ్యతిరేక గ్రహాలు హాని కలిగించవచ్చు.
అంతేగాదు జన్మ చంద్రాత్తు వ్యయంలో చంద్రుడు  సంచారించే సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆపదలు దాటవచ్చు.
ఉదాహరణకు:  మీరు అశ్వని నక్షత్రంలో పుట్టి ఉంటే మేషరాశి చంద్ర లగ్నం అవుతుంది. అపుడు గోచార రీత్యా  మీనంలో  చంద్రుడు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి.
పైన తెలిపిన కొన్ని విషయాలు నేను చదివినవి(రచయితలకు కృతజ్ఞతలు), కొన్ని అనుభవంలో చూసినవి
మీకు ఉపయోగపడితుంది అని .... .

  



Monday, 15 May 2017

ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు......



కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.

- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు వినాశనము అవుతారు.

- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).

- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.

- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.

- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.

Wednesday, 12 April 2017

నేను - ఆన్లైన్లో పత్రికలు - 4

ఇంకా కొన్ని ఆన్లైన్ పత్రికలూ వాటి ఇమెయిల్ ఐడీ లు



సుజనరంజని అని అమెరికా నుంచి వెలువడే ఒక తెలుగు ఆన్లైన్ పత్రిక
 http://sujanaranjani.siliconandhra.org/   --  sujanaranjani@siliconandhra.com  కు RTS పధ్ధతిలో కానీ లేక యూనికోడ్ తెలుగు ఉపయోగించి కానీ పంపండి 

తెలుగు వేదిక ముంబయి నుంచి వెలువడే ఒక పత్రిక 

https://www.teluguvedika.net/home.html  -    teluguvedika.net@gmail.com


కౌముది అనే ఆన్లైన్ పత్రిక నేను తప్పకుండా చదువుతాను అని ముందు పోస్టులలో చెప్పాను కదా,  వారికి రచనలు పంపాలంటే editor@koumudi.net అనే మెయిల్ ఐడి కి పంపాలి 

మరి ఆఫ్ లైన్ పత్రికలు  అదేనండి కొని చదివే పుస్తకాలూ, పుస్తకం హస్తభూషణం అనిపించుకునేవి 
స్వాతి, నవ్య, రచన,  ప్రభ వంటివి వాటి చిరునామాలు కావాలా ?



Friday, 7 April 2017

నేను - ఆన్లైన్లో పత్రికలు - 3


మీ వద్ద మంచి కధలు వున్నాయి.  కానీ ఎవరికి  ఎలా పంపాలో తెలియదు అప్పుడు ఎలా ?

అప్పుడు మీరు చేయవలసినది చెప్పడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం


కంప్యూటరు ఉపయోగించి  తెలుగు లిపిలో వ్రాసినవి వీటికి పంపవచ్చు
అచ్చంగా తెలుగు వారికి అయితే contact@acchamgatelugu.com, writers@acchamgatelugu.com
mail  వర్డ్ డాక్యుమెంట్ రూపంలో  పంపవచ్చు.

సుకధ  అని ఈమధ్య ఇంకో  ఆన్లైన్ సైట్ చూసాను
https://sukatha.com/

మీ కథలు ఈ మెయిల్ ఐడి కి  storyboard@sukatha.com పంపండి

ఇందులో ప్రచురించే ప్రతీ కధకు రూ.500 ఇస్తారుట !

గోతెలుగు.కాం లో ప్రచురించే కధకు పారితోషికం రూ. 200 ఇస్తారు వారి మెయిల్ ఐడీ gotelugucontent@gmail.com

అచ్చంగా తెలుగులో అయితే ఒక పుస్తకం ఇస్తారు

మిగతా వాటితో నాకు ఇంకా రచయితగా అనుభవం రాలేదు !

ఈమాట వారికి అయితే  submissions@eemaata.com మెయిల్ ఐడి కి 
రచనలని టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో పంపడం ఉత్తమం

http://www.offprint.in/  అనే ఇంకో సైట్ వుంది దీంట్లో అయితే లాగిన్ అయి మీ రచనలు ఇవ్వవలసి ఉంటుంది 

Wednesday, 5 April 2017

శ్రీ రామ చుట్టకుండా ఒక్క మాట కూడా వ్రాయకుండుగాక !


శ్రీ రామ చుట్టకుండా ఒక్క మాట కూడా వ్రాయకుండుగాక !
అని వాల్మీకి మహర్షి లవకుశలో చెపితే ఒక మానవుడు దేవుడు ఎలా అయ్యాడు అని అడిగినపుడు
చెప్పిన కధ  రామాయణం, ఇది సీతాయాః చరితం మహత్ అని వినుతికి ఎక్కి
సీతా రాముల పుత్రుల చేత లోకంలో ప్రసిద్ధి చెందిన కధ
 ఎప్పుడో జరిగిన రామాయణం ఆధారం లేకుండా ఎలా నమ్మగలం అనే వారికి 
మన తాత ముత్తాతల చరిత్రే మనకు తెలియదు మన అశ్రద్ధే కదా కారణం!
కలుషితమైన గాలి పీల్చి, కలుషితమైన ఆహారం తినే మనకు
కలుషితమైన ఆలోచనలు కాక మంచివి వస్తాయా ?
తెల్ల దొరలు   నింపిన భావజాలంలో మునిగి కొట్టుకుంటున్న మనకు
వాళ్ళు చెపితే కానీ వినిపించుకోని భావ దారిద్య్రం మనల్ని ఎప్పుడు వదులుతుందో ?


Wednesday, 29 March 2017

ఆమె ఎవరు ? ఒక థ్రిల్లర్


చనిపోయారు అనుకున్న వారు తిరిగి వస్తే , మనల్ని వెంటాడితే  అప్పుడు....

అందరికీ సస్పెన్స్ కధలు అన్నా, నవలలు అన్నా కాస్త ఇష్టం వుండే తీరుతుంది.

ఎందుకంటే మొత్తం కథలో ఒక ట్విస్ట్ కూడా లేకుండా చదివితే బోర్ కొడుతుంది

మీకోసం బోల్డన్ని ట్విస్టులతో నిండిన ఓక నవల

మా సోదరులు వ్రాసినది

కినిగెలో ఇపుడు దొరుకుతోంది

ఆమె ఎవరు ? ఒక థ్రిల్లర్

http://kinige.com/book/Ame+Yevaru

http://kinige.com/book/Ame+Yevaru


మీ అభిప్రాయాలు పంచుకుంటారు అని ఆశిస్తూ

ఉగాది శుభకామనలతో !