SEARCH

Monday, 13 October 2014

రెడీమేడ్ ఆహారం - క్యాన్సర్ ముప్పు

ప్రస్తుతం స్పీడ్ యుగం నడుస్తోంది. ప్రజల లైఫ్ స్టయిల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. భారత్ వంటి దేశాల్లోనూ పాశ్చాత్య దేశాల తరహాలో ఇంట్లో వంట చేసుకోవడం క్రమేణా తగ్గుతోంది. రెడీమేడ్ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ఇలాంటి ఆహార అలవాట్లు క్యాన్సర్ కు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల్లో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారుచేసిన ఫ్లేవర్లు, కృత్రిమ చక్కెర కలుపుతారని, వాటి ద్వారా జీర్ణకోశ క్యాన్సర్ తలెత్తే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ తరహా ఆహార పదార్ధాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయని, తద్వారా వాటిలో ఏర్పడే రసాయనిక మార్పులు క్యాన్సర్ కు దారితీస్తాయన్నది నిపుణుల మాట.
ప్రోసేస్సుడ్  ఫుడ్    
రెడ్ మీట్ (బీఫ్, మటన్) తినేవారిలో జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పు అధికమట. ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ లో ఉండే సోడియం నైట్రేట్ రూపాంతరం చెంది క్యాన్సర్ కారకంగా మారడమే అందుకు కారణం. ఈ మేరకు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించగా స్పష్టమైంది. ఈ క్రమంలో రోడ్డు మీద కాల్చే మాంసాహార పదార్ధాలు కూడా ప్రమాదకరమే. ఇక చక్కెర కారణంగా క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయట. చక్కెరతో తయారైన పదార్థాలను అధికంగా తీసుకుంటే బరువు పెరిగి, ఫలితంగా రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశముంది.
ఫ్రైడ్ స్నాక్స్ 
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్ ఐటమ్స్ లో ఉండే అక్రిలమైడ్ అనే పదార్థం క్యాన్సర్ ను కలిగించే గుణం కలిగి ఉంటుంది. ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు ఈ అక్రిలమైడ్ తయారవుతుంది. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో అక్రిలమైడ్ కారణంగా కణుతులు ఏర్పడినట్టు తెలుసుకున్నారు. ముఖ్యంగా, మద్యపానం కారణంగా నోరు, గొంతు, కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

No comments:

Post a Comment