SEARCH

Tuesday, 31 March 2015

వదలవలసిని జ్ఞాపకాలు

నా ఇల్లు, నా భర్త అంటూ తానంటే ఇష్టం లేని భర్తను భరిస్తూనే వుంటుంది ఒక ఇల్లాలు తనకంటూ ఒక రోజు రాకపోతుందా అని. 
నా కొడుకు , నా కోడలు అంటూ వుంటారు కన్న తల్లి తండ్రులు  పిల్లలుకోసం  సర్వస్వం త్యాగం చేస్తే  ఆ పిల్లలు వీళ్ళను గాలికి వదిలేస్తారు, అయినా  వీళ్ళు ఎదురు చూస్తోనే వుంటారు తమకంటూ ఒక రోజు రాకపోతుందా అని. 

ఒక అమ్మాయిని   లేదా  అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళు వీళ్ళని వదిలేసి వేరే దగ్గరకు వెళ్లి పోతారు కాని వీళ్ళు మాత్రం వాళ్ళ జ్ఞాపకాలతో  జీవిస్తూ  వుంటారు ఒక రోజు రాకపోతుందా అని.

కాని నిజానికి ఆ రోజు రాదు, జీవితంలో అందరూ  ముందుకు పోతువుంటే  వీళ్ళు  అక్కడే ఆగిపోతారు .
నిజానికి వాళ్ళు చేయవలసింది నిజాన్నీ గుర్తించి ముందుకు సాగటం  నేర్చుకోవాలి. మొదట్లో  చాల కష్టంగా వుంటుంది , కాని ముందుకు సాగాలంటే  పాత జ్ఞాపకాలు ఆగాలి.  తప్పదు !


No comments:

Post a Comment