అబ్బబ్బ వీళ్ళ
లాగులు చూడలేక చస్తున్నాం అంది మా శ్రీమతి లోపలికి వచ్చి తలుపు మూస్తూ.
ఏమైంది? అడిగాను
ఎదుటి ఇంటి
పెద్దాయన నిక్కర్లో తిరుగుతూ ఉన్నాడట అదీ విషయం.
మొన్నటిదాకా శుభ్రంగా
పంచి, పొడుగు ప్యాంటు లో కనపడేవాడు కదా ! ఆశ్చర్యంగా అడిగాను.
ఏముంది మొన్ననే
అమెరికా నించి దిగబడ్డారు. అది సమాధానం
పిల్లలు మారుతున్నారంటే అర్ధం వుంది. వీళ్ళు ఇలా మారితే ఎలా
పిల్లలు మారుతున్నారంటే అర్ధం వుంది. వీళ్ళు ఇలా మారితే ఎలా
పోనీ ఇంట్లో తొడిగి
తిరిగితే పరవాలేదు రోడ్డుపైకి వస్తే ఎలా ? శ్రీమతి గొణుగుళ్ళు
నేను ఆలోచనలో
పడ్డాను
కట్టు బొట్టు
తీరు బాగుండాలి అని ఆడవారిని అంటారు మరి మగవాళ్ళు ఇలా ఎందుకు తయారు అవుతున్నారు
కొంచెం వయసు
మళ్లి అంటే 50 వ పడిలోకి వస్తే పంచి కట్టకుండా ఉండేవారు కాదు ఇదివరకు పెద్దలు.
మావాడు అమెరికాలో
ఉన్నాడు, మేము అమెరికా వెళ్లి వచ్చాం! అని
చెప్పుకోవడం అతిశయంగా ఉన్న రోజులనించి
అక్కడి వేష ధారణలు
ఇక్కడా వేసి, వీళ్ళు అమెరికాలో ఉన్న తమ పిల్లల దగ్గరకు వెళ్లి వచ్చారు అని చూడగానే
తెలిసే విధంగా అతిశయ ప్రవర్తన కొంచెం
చిరాకు కలిగించేదే?!
సరి, మరి వాళ్ళ
ఇంటి ఆవిడా ఎలా మారిందో ? కనుక్కుందాం అనుకునేలోపు ఆవిడా దర్శనం ఇచ్చారు నైటీలో
ఆహా! అని బోల్డంత
ఆశ్చర్యంతో కుర్చీలో కూలబడ్డాను.
ఇంకా మా శ్రీమతి
గోణుగుతోంది
నేను ఏమి
మాట్లాడకుండా కూర్చున్నాను
ఎందుకంటే ఇప్పుడు
ఏమైనా మాట్లాడితే తను నాకోసమే చేస్తున్న స్పెషల్ వంటకం తగలడుతుంది మరి!
No comments:
Post a Comment