ఫ్రాన్స్ లోని బ్రిటన్ కు చెందిన ఓ ఇంజినీర్ల బృందం మూడేళ్లపాటు రకరకాల ప్రయోగాలు చేసి విండ్ ట్రీను తయారు చేసింది. 'విండ్ ట్రీ' పేరుతో వచ్చే ఏడాది ఈ చెట్లు మార్కెట్లోకి రానున్నాయి. 26 అడుగుల ఎత్తుండే ఒక్కో చెట్టు ధర రూ. 20 లక్షలకు పైగానే ఉంటుంది. ఒక్కసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు... జీవితాంతం కరెంటును పొందవచ్చని దీన్ని తయారు చేస్తున్న కంపెనీ ప్రకటిస్తోంది.
విండ్ ట్రీలు నిజంగా చెట్లు కావు. ఇవి చెట్ల ఆకారంలో ఉన్న గాలి మరలు. ఆకుల స్థానంలో దీర్ఘవృత్తాకారంలో ఉన్న టర్బైన్లు ఉంటాయి. గాలి వీచినప్పుడల్లా ఇవి తిరుగుతాయి. అప్పుడు టర్బైన్లలో ఉండే పలుచటి బ్లేడ్లలో కదలికలు ఏర్పడి కరెంటు ఉత్పత్తి అవుతుంది. గాలి ఏ దిశలో వీచినా బ్లేడ్లు కదలడం ఈ చెట్ల గొప్పదనం. సాధారణంగా 8 మైళ్ల వేగంతో గాలులు వీస్తే తప్ప పవన విద్యుత్తును ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. కానీ, విండ్ ట్రీతో కరెంటును ఉత్పత్తి చేయాలంటే, కేవలం 4.5 మైళ్ల వేగంతో గాలి వీస్తే చాలు. విశాలమైన, ఎత్తైన ప్రదేశాల్లోనే కాకుండా... ఇంటి దగ్గర, రోడ్ల కూడళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment