అంతట నిండివున్న నన్ను ఎలా కాదనగలవు ?
అజ్ఞానం, మూర్ఖత గురించి నేను తలచుకున్నపుడు ఉదాహరణలు కోకొల్లలు
పిల్లలను బడి వద్ద వదిలి వస్తున్నపుడు నా ముందు ఆగిన వాహనం నడిపే వ్యక్తి సరిగా సంభాలించలేక వెనుకనున్న నా వాహనాన్ని డ్హీ కొట్టాడు . పిల్లలు తూలీ పడబోయారు , నేను ఇంకా ఏమి అనకుండానే దారికడ్డంగా ఎలా ఆపుతావు చూడు నీవల్ల వెనుకాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని మొదలు పెట్టాడు.
ఆహా ! క్షమాపణలు ఇలా చెపుతారా అని ఆశ్చర్యపోక ఇంక చేసేదేమివుంది ?
స్వచ్ఛభారతుకాక బుద్ధిమాన్ భారత్ మొదలు పెట్టమని కోరుతున్నా
ఎందుకంటే చదువు కున్న వాళ్ళే వాదినలో గెలవాలని చూస్తున్నారు కాని, తగవులు కూడదని తెలుసుకోవటలేదు.
ఇక్కడే ఇంకొక విషయం, విడాకులు కోరుతున్న వారిలో ఎక్కువ విద్యాధికులేనట !
సరే ముందుకు బయలు దేరితే ఆటో వాడు అడ్డు వచ్చాడని గొడవ పడుతున్నాడు ఇంకో వాహన దారుడు
భాగ్యనగర వారసులు వాళ్ళేనని ఇంకా తెలిసినట్లు లేదు !
జ్యోతితో ఇంకొక జ్యోతిని వెలిగించవచ్చు
నీటితో వెలుగు కుదరదు
జ్ఞానినుంచే జ్ఞానసముపార్జన చేయవచ్చు
అంధుడు ఇంకొక అందునకు దారిచూపలేడు కదా !
అ ప్రదేశంలోనే చాల కాలంగా వున్నా సరే
No comments:
Post a Comment