అహం మనిషికి వుండే భావాల్లో ఇది ఒకటి. కాని బాస్ కి వుండేది అహం భావం అంటే ఒప్పుకుంటారా ?
పైకి ఎదిగేప్పుడు కష్టపడాలి, ఆ స్థానం నిలుపుకోవాలంటే ఒదిగి వుండాలి.
కాని నేను చెప్పిందే వేదం అందరు నా మాటే వినాలి అంటే అది తల పొగరు గాక ఇంకా ఏమిటి ?
క్రింద వాళ్ళు చేస్తే తప్పు, తను చేస్తే పొరపాటు.
తను సెలవు తీసుకుంటే అవసరం. క్రింద వాళ్ళు తీసుకుంటే అవకాశవాదం!
ఇది అందరి బాసుల పరిస్థితి, కొంత మంది తులసి మొక్కలు వుంటారు అనుకోండి!
వాళ్ళ నెత్తిన ఎక్కి తొక్కేవాళ్ళు వుంటారు .వాళ్ళ మంచి తనం గుర్తించకుండా
ఇదండీ బాసిజం !
No comments:
Post a Comment