SEARCH

Monday, 27 March 2017

నేను - ఆన్లైన్లో పత్రికలు -1


హడావిడిగా మొదలు కావలసిన సోమవారం నాకు నెప్పిగా మొదలు అయ్యింది.

కాలికి రాత్రి తగిలిన దెబ్బ ఉదయానికి కప్పలా  వాస్తే డాక్టరు దగ్గరకు వెళ్లాలని అర్ధం అయ్యింది.

ఏం చేస్తాం ? బాసుకి సెలవు అని చెప్పి డాక్టరుకు హలొ చెప్పాను.

ఎక్సరే , మందులు, అయ్యి ఇంటికి వచ్చి చూస్తే ఏమీ తోచడం లేదు అని
ఎన్నో రోజులుగా వ్రాద్దామని అనుకున్న విషయాలు మీతో పంచుకోవడం మంచిది అనిపించింది!

పుస్తకాలు చదవాలి, కధలు వ్రాయాలి అనే వారికి ఇది ఏమైనా ఉపయోగపడుతుంది ఏమో  అనే ఆలోచనతో  ఇంకా ఆలశ్యం చేయకూడదని మొదలు పెట్టాను.
                                                 
                                       ***

ఫ్లాష్ న్యూస్ చూడాలంటె నేను ఇక్కడే వేళ్ళాడతాను

అదే ఏపీ7ఏఎం.కాం
http://www.ap7am.com/index.php


అంతేనా ఇందులో న్యూస్ పేపర్లు  ఈనాడూ , జ్యోతి , సాక్షి, నమస్తే తెలంగాణా  ఇంకా చాలా ఆఖరికి క్రికెట్ లైవ్ అప్డేట్ ,  బిజినెస్ న్యూస్  తో సహా అన్నీ తెలుసుకోవచ్చు.


ప్రతీ ఆదివారం అనుబంధాలతో వచ్చే వార్తా పత్రికలు  సోమవారం తీరుబడిగా చదువుకోవచ్చు.


బుధవారం జ్యోతి పత్రికలో వచ్చే నవ్య వీక్లి ఆన్లైన్లో  చదివి

http://www.andhrajyothy.com/navyaweekly

శుక్రవారం వచ్చే   గోతెలుగు.కాం చదివి
 http://www.gotelugu.com/

మళ్ళీ సోమవారం కోసం ఎదురు చూస్తాం

అంటే వారం మధ్యలో ఏమి చేస్తారు?  అని అడిగితే !


 ఇంకా వుంది !



No comments:

Post a Comment