SEARCH

Friday, 30 January 2015

ఆంధ్రులారా చేవ చచ్చినవారా ? ఆంధ్రోల్లు అంటే అంత చులకనా !

విడగొట్టడం  ఇంత  వీజీయా  అన్నట్టుగా  విడదీసేసారు
ప్రత్యేకం అని అడిగిన వారికి రాజధాని, మిగులు  మూల ధనం  ఇచ్చి
విడిపోవద్దు  అన్న వారికి  రాజధాని లేదు,  మిగులు మాట దేముడు ఎరుగు మింగ మెతుకు లేదు .

మేము అన్యాయం  చెయ్యం. అంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  రాజ్య సభలో  ప్రత్యేక హోదా గురించి మేమే అడిగాం అని జబ్బలు చెరచిన  కమల వీరులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలు  ఒప్పుకోవాలి అంటున్నారు.

ఆంధ్రోల్లు అంటే అంత  చులకనా !
   ఇంకా ఎంత కాలం మీకు ఈ  దురదృష్టం ?
ఇంకా ఎంత కాలం ఇలా   మోసపోతారు ?
 ఆంధ్రులారా చేవ చచ్చినవారా  ?
చేతకాని వారా ?
కళ్ళు తెరిచి,  కాళ్ళు పట్టడం మాని పీక పట్టండి !


1 comment:

  1. ఆంధ్రులు ఆరంభ శూరులు
    పొగిడితే వుబ్బిపోతారు
    మీ అంత వారు లేరు అంటే ఉన్నదంతా వూడ్చి పెడతారు
    అన్యాయం జరిగినా చూస్తూ ఉండి పోతారు.
    ఇప్పటికైనా కనులు తెరిచి అడగకపోతే
    అమ్మ కాదు, అక్కడ వున్నది నాన్న! అస్సలు పెట్టడు .
    అరిచి గీ పెడితేనే నీకు వస్తుంది రావలసినది కాదు , రావలసినదే !

    ఇచ్చే దాకా అడుగుదాం ప్రత్యేక హోదా

    ReplyDelete