ఒకానొక రైతు పెట్టిన కంపెనీ లో అదేనండి ఇంట్లో ఒక HR అంటే కోడి , చెప్పినదానికి తలాడించే ఒక చెంచా అదేనండి గొర్రె , పైవాడు చెప్పిందానికి కష్టపడటమే మార్గం అనుకునే ఒక ఎద్దుగారు పని చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా ఒక ఆఫీసు బాయ్ ఒక ఎలుక కూడా వుంది.
సరే రైతు ఎలుకను పింక్ స్లిప్ ఇచ్చి అంటే బోను తెచ్చి బయటకు పంపెద్దామని తయారు అయిపోతాడు.
ఇంట్లోకి బోను, ఎలుక వంట్లోకి భయం వచ్చి చేరతాయి.
మనకు కష్టం వస్తే మన బాస్ దగ్గరకు వెళ్తాం కదా ! అలాగే ఎలుక, ఎద్దు దగ్గరకు వెళ్లి తన కష్టం చెప్పుకుంటే
తను సహాయం చేయలేను అని అంటుంది ఎద్దు.
గొర్రె దగ్గరకు వెళ్తే మునుపెన్నడు నాకు ఇటువంటి కష్టం రాలేదు, కాబట్టి ఏమి చేయాలో నాకు తెలీదు అంటుంది.
కోడి నీకష్టం నీ ఇష్టం అంటుంది.
ఎవ్వరు సహాయం చేయతలేదని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఎలుక.
ఆ రాత్రి బోనులో ఏదో చిక్కినట్లు శబ్దం వస్తే, చూడటానికి వెళ్తుంది రైతు భార్య .
బోనులో చిక్కిన తన తోకను తీసుకోవడానికి అవస్త పడుతున్న పాము, రైతు భార్యను కాటు వేస్తుంది !
ఆమెకు వచ్చిన విష జ్వరాన్ని తగ్గించడానికి, రైతు కోడి పులుసు తాగిస్తాడు , కాని తగ్గదు జ్వరం.
సరే ఆమెను పరామర్శకోసం వస్తున్న వారికోసం గొర్రెగారు ఖర్సు ! అవుతారు .
కొన్నిరోజులకు రైతు భార్య మరణిస్తుంది. ఆ రోజులకు ఎద్దు బలి !
ఇలాగ అన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఒక్కరు మాత్రం ఉండిపోతారు !?
ఎవరంటే ఎలుకగారు !
అందుకే మన జట్టులో ఎవరికైనా కష్టం వస్తే, ఆదుకోకపోతే ఆ కష్టం మనకు నష్టం తేవచ్చు !
ఇదే కధ ఇక్కడ వినవచ్చు
https://www.youtube.com/watch?v=3R49Lu56piU

No comments:
Post a Comment