SEARCH

Monday, 1 September 2014

"బాపు"రే :(

 
మానవ నాగరికతకు మొదటి చిహ్నాలుగా వాళ్ళు గీసిన బొమ్మలు, గీతలు ప్రామాణికాలు నిలబడి చరిత్ర పటనంలో ఎంతగానో వుపయోగపడ్డాయు. బాష తెలియక పోయునా, చదవటం రాకపోయునా పెద్దాయన కుంచెనుంచి జాలువారిన చిత్రాలతో రామాయణ మొత్తం సారాన్ని ప్రపంచం మొత్తం అర్ధంచేసుకొనేలా రూపొందించిన ఘనత ఆయనకే సొంతం. బాపు తెలుగు అక్షరాలలో వున్న ఒంపుసొంపులన్ని, అవసాన దశలోవున్న తెలుగుబాషమీద మమకారం పుట్టేలా చేసే తెలుగు వర్ణమాల ఆయన సృష్టే. నవరసాల వ్యక్తీకరణకు పెద్దాయన గీసిన చిత్రాలు,సంప్రాదాయాల తెలుగుదన ఆహార్యం (వాలుజడ, పైటకొంగు) ఎలావుండాలి అనేది తెలుసుకోవాలంటే, సినిమాలలో ఆయన చూపించిన విధం ఒక ప్రామాణికంగా నిలిచిపోతుంది. ఆయన ప్రయాణంలో ఆఖరి మజిలిలో తీసిన శ్రీరామరాజ్యంలో పనిచేసిన నటీ, నటులు, సాంకేతిక నిపుణల ఎంతో అదృష్టవంతులు. పెద్దాయన వదలివెళ్లిన గురుతులు, తెలుగుజాతి శ్వాసగా, జాతివున్నంత వరకు మిగిలిపోయే, అజరామర కీర్తి ఆయన సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో. సంవత్సరానికే ఒకసారే, ఒక పుష్పమే వికసించే పుష్పం బ్రహ్మకమలం. సాయంత్రం వేళలో మాత్రమే వికసించే ఆ పుష్పం వికాసాన్ని కన్నులారా చూస్తే, మనస్సులో కోరిన కోరికలు నెరవేరుతాయని నానుడి, కాని ఈ బ్రహ్మకమలం ప్రతిరోజు వికసిస్తూ మనలందరిని ఆహ్లాద పరుస్తూనేవుంది. కాని ఆ వికాసాన్ని మనంకంటే ఎక్కువగా తమిళులు మాత్రమే అర్ధంచేసుకోవటం వల్లే, ఆయనకు ఆ ప్రభుత్వం తరపున పద్మశ్రీ పురస్కారాన్ని అందించకలిగారు. మన తెలుగుజాతి కేవలం సాక్ష్యంగా మిగిలిపోయుంది. ఇప్పటికైనా మించిపోయుంది లేదు, పెద్దాయన పేరుని, భారతదేశ అత్యున్నత పురస్కారానికి పరిగణించాలని మన పాలకులు కోరాలి. దానికి మనం మద్దత్తు తెలపాలి, ఎందుకంటే తెలుగుజాతికి శ్వాసే ఆయన, ఆయనకు శ్వాసే తెలుగుజాతి కనుక. బాపుగారికి శ్రధ్దాంజలి ఘటిస్తూ..

No comments:

Post a Comment