SEARCH

Thursday, 18 September 2014

మెట్రో ప్రాజెక్టుపై ప్రతిస్పందన

క్రితం రోజు పత్రికల్లో పతాక సీర్షిక ఒక్కటే హైదరాబాదు మెట్రో ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖ దానికి కేటీఆర్  ప్రతిస్పందన 
టీఆర్ఎస్ మెదక్ లో సాధించిన ఘనవిజయాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని మలినం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కథనాలు వెలువడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించడమే మీడియా ఉద్దేశమని కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు.  
 ఎల్ అండ్ టీ ఎండీ వీబీ గాడ్గిల్ ప్రతిస్పందన
 హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు పనులు నిలిచిపోనున్నాయంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను ఎల్ అండ్ టీ ఎండీ వీబీ గాడ్గిల్ కొట్టివేశారు. మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగుతుందని చెప్పారు. అయితే, ఈ నెల 10న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమేనన్న గాడ్గిల్, అది నేరం కాదన్నారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ఉన్నాయని తెలిపింది. ఎల్ అండ్ టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని తెలిపింది. మెట్రో ప్రాజెక్టు రెండో దశపై కేంద్రంతో చర్చిస్తామని చెప్పింది. 

ఈ దెబ్బతో తెలంగాణలో మీడియా  ఉండదని భావించాను 
అబ్బే అలా ఏమి జరగలేదు !!
 

1 comment:

  1. MY HOMES???? MY homes .....my homes......my homes..................
    entee my homes....? Evarikaina telusa.....? K C R Ki telusu.

    ReplyDelete