తమిళనాట ప్రతిష్ఠాత్మక రీతిలో అమలు చేస్తున్న 'అమ్మ' పథకాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్యాంటీన్లు, మినరల్ వాటర్, ఫార్మసీలు... ఇలా ఎన్నో పథకాలు 'అమ్మ' జయలలిత పేరిట ప్రారంభమయ్యాయి. రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు ప్లేటు భోజనంతో క్యాంటీన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇంత చవకగా సేవలు అందించడం ఎలాగో తెలుసుకుందామని దేశంలోని ఇతర నగరాలకు చెందిన అధికారులే కాకుండా, ఈజిప్టు వంటి దేశాల నుంచి కూడా చెన్నై వస్తుండడం విశేషం.
హైదరాబాద్, చండీగఢ్, జైపూర్, ముంబయి, ఢిల్లీ నగరాల కార్పొరేటర్లు, మేయర్లు చెన్నైలోని క్యాంటీన్ల పనితీరును పరిశీలించారు. పొరుగురాష్ట్రం స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి బడ్జెట్ క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు మంత్రి పరిటాల సునీత ప్రకటించారు కూడా. ఇటీవలే ఈజిప్టు నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం చెన్నై జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన 'అమ్మ' క్యాంటీన్ ను సందర్శించింది. ఏదేమైనా, తమిళనాడు సీఎం జయలలిత ప్రారంభించిన ఈ పథకాలు రాష్ట్రాలతో పాటు దేశాలకూ ప్రేరణ కలిగించడం నిజంగా అభినందించాల్సిన విషయం.
No comments:
Post a Comment