SEARCH

Saturday, 6 September 2014

విధ్యావిధానం

గురుపూజోత్సవదినం సంధర్బంగా, రేపటి భారతపౌరులను ఉద్దేశించి శ్రీ మోడిగారు  చేసిన ప్రసంగలో, పిల్లలకి సందేశాన్ని ఇస్తూ, చదువులేకాదు, ఆటపాటలు కూడా వుండాలి, పరిగెట్టండి, గెంతండి, దూకండి, రోజుకు నాలుగుసార్లయునా చెమట పట్టేలా ఆటలాడండి అని సందేశాన్ని ఇచ్చారు. ఇదిపిల్లలకి ఎంతో విలువయున సందేశం, ఎందుకంటే, ఎంతటి మేధావికైనా, ఆరోగ్యం, శారీరక ధారుడ్యం అనేవి రెండు కళ్ళులాంటివి. ఏది లోపించినా, ఆ తెలివితేటలు సమాజానికి ఉపయోగపడకుండా పోతాయు. ఇది నాణానికి ఒక కోణం. మరొక కోణం, ఇదే గురుపూజోత్సవదినం సంధర్బంగా ఆంధ్రఫ్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ని విధ్యారంగానికి హబ్బ్ గా మారుస్తామన్నారు. అంతటి శక్తి, సామార్ధ్యాలు కూడా ఆయనకువున్నాయు. కార్పోరేట్ విధ్యావ్యవస్థ విధానాన్ని సమూలంగా మార్చాలి.  దీనికి కావాల్సింది చిత్తశుద్ది మాత్రమే. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో పట్టణ, పురపాలశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారాయణ విధ్యాసంస్థల అధినేత శ్రీ నారాయణగారి కార్పోరేట్ స్కూళ్ళ గురించి ఒక్కసారి చెప్పుకోవాలి. ఆటస్థలం లేని పాఠశాలలు, కాలేజీలు, చెమటలే పట్టని తరగతి గదులు, శారీరక ధారుడ్యమేలేని విధ్యావిధానాలు, ప్రజలు నివాసంవుండే అపార్టమెంట్ లలో పాఠశాల, కాలేజీల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ని విధ్యారంగాన్ని హబ్బ్ గా మార్చాలంటే శ్రీ మోడిగారు చెప్పినట్టు, రోజుకి కనీసం రెండుసార్లయునా చమటపట్టేలా,  శారీరక ధారుడ్యము పెరిగేలా ఫిజికల్ ఎడ్యుకేషన్ భోదన జరిగేలా మార్పులు జరగాలి. ఆ మార్పుకూడా నారాయణ విధ్యాసంస్థలునుంచే ఫ్రారంబించాల్సిన అవసరం చాలావుంది. ఆ మార్పుకి నాంది పలికేలా శ్రీ చంద్రబాబు గారు, నారాయణ విధ్యాసంస్థల అధినేత శ్రీ నారాయణగారికి సూచనలు చేసి మార్పుకి శ్రీకారంచుట్టితే, మిగతావాళ్ళుకూడా ఆ బాటలో ముందుకి నడుస్తారు. అప్పుడే నిజంగా ఆంధ్రప్రదేశ్  విధ్యారంగ హబ్బ్ గానే కాకుండా భావిభారత ఆరోగ్యంభారతానికి రోలుమోడలుగా మారుతుంది. అంతటి చిత్తశుద్దితో శ్రీ చంద్రబాబు గారు ముందుకు సాగాలి, దానికి నారాయణ విధ్యా సంస్థలు శ్రీకారం చుట్టాలి, మార్పు నారాయణ విధ్యాసంస్థలనుంచే మొదలవ్వాలి.

No comments:

Post a Comment