SEARCH

Thursday, 4 September 2014

ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్ర తల్లి లేదు మరి తెలంగాణా తల్లి తెలుగు తల్లి కాలేదా ?

ఇక చాలు,  తెలుగు తల్లిని వదిలి తెలంగాణా తల్లికి మారిన వారినుంచి ఏడుపులు, పెడబొబ్బలు వదిలించుకుని
మాది తెలుగు కాదు తెలంగాణా అని మొరపెట్టుకున్న వారిని  వదిలేసి పదండి ముందుకు. 
సమగ్రాభివృద్ధి మన విధానం, సర్వుల క్షేమమే మన ధర్మం.
అధికారం కోసం పార్టీలు మారుతున్న ఓ నాయకులారా, ప్రతిపక్షం లో మీరు గట్టిగా పట్టుపడితేనే ఏ  రాష్ట్రం లో నైనా  అధికార పక్షం  దారిలో వుంటుంది. ఇది వై సి పి , కాంగ్రెస్స్ , తెదేపా  అందరికీ  వర్తిస్తుంది

నేను తెలంగాణా లేదా ఆంధ్ర అనుకూలంగా వ్యాఖ్యలు  చెయ్యదలుచుకోలేదు నేను తెలుగువారికి అనుకూలిడిని. 
హిందీ వాళ్లకి 8 రాష్టాలున్నాయి  తెలుగు వారికి 2 రాష్టాలుండాలి అని మొదలు పెట్టి తెలుగు తల్లి మమ్మల్ని సవితిలా చూస్తోందని తెలంగాణా తల్లిని తెచ్చి  తెలంగాణావాల్లే  బాగుండాలి మిగతా వాళ్ళు మట్టికొట్టుకుపోవాలి అని కోరుకుంటున్న వాళ్లకి నేను వ్యతిరేకం.
నిజాం దౌర్జన్యాలు భరించి నెగ్గుకు వచ్చిన తెలంగాణా ప్రజానీకం మళ్లి  తురకల ప్రాభవంలోకి వెళ్ళేలా ప్రయత్నాలు సాగుతున్నాయోమో  అనే  అనుమానం తోనే

 బ్లాగుల్లో, సోషల్ నెట్ వర్క్ సైటుల్లో , ఇంకా  ఆంధ్ర, తెలంగాణా అని ఇంకా కొట్టుకోవడం మానేసి తెలుగువారిగా ఎలా ఎదగాలో కృషి చేద్దాం  ఎందుకంటే 2050కి  అంతరించిపోయే భాషల చిట్టాలో  తెలుగు భాషదే ప్రధమ క్రమ సంఖ్య







4 comments:

  1. మన తెలుగువాళ్ళకి తెలుగుభాషనీ తెలుగువాళ్ళమన్న ముధ్రనీ వదిలించుకుందుకు ఆ 2050దాకా అగే ఓపిక ఉన్నదనుకుంటున్నారా?

    ReplyDelete
  2. తెలుగుతల్లి విగ్రహం ఇప్పటికే మనకి ఉందికదా.మీరనుకున్నట్టు 2050కి తెలుగుభాష అంతరించిపోదని నేను గట్టిగా నమ్ముతున్నాను.

    ReplyDelete
  3. శ్యామలీయం గారికి, కమనీయం గారికి ముందుగా కృతజ్ఞతలు ,
    మన భాషకి తల్లి వుంది , ఆంధ్రప్రదేశానికి తల్లి లేదు , మనం మాట్లాడే తెలుగే మనకి తల్లిగా చేసుకున్నాం, తెలుగు రాష్ట్రం రెండుగా అయినపుడు ,తెలంగాణా ఏర్పాటులో తెలంగాణా తల్లి పాత్ర కాదనలేం,కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు కూడా తల్లి కావాలేమో !

    శ్యామలీయం గారికి చదవడం వచ్చిన భాషని ఎవరూ త్వరగా మరచిపోరండి , మాత్రుభాషలో భావ వ్యక్తీకరణలో వున్న స్వేచ్చ పరాయి భాష లో ఉండదు అని జనులకు అర్ధం అయితే మన కృషి ఫలించినట్లే , నీరసం మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు, కాబట్టి మన కృషి మనం చేద్దాం,

    ReplyDelete
  4. ఆంధ్రదేశానికి ఆంధ్రమాత ముందు నుండీ ఉంది, బహుశా మీకు తెలియదేమో. మద్రాసునుండి ఆంధ్రా విడిపోవటానికి జరిపిన ఉద్యమంలో ఆంద్రమాత పేరు విరివిగానే వినిపించింది. 1913 నాటి ఆంధ్రపత్రిక సంవత్సర సంచికలో ఈ విషయం తెలుసుకోవచ్చు. లేదా ఈ క్రింది లింక్ లో ఆ సంచిక చిత్రాన్ని చూడవచ్చు.

    http://www.mulakkada.com/201401/andhra-matha-transforms-to-telugu-thalli/

    ఇక ఆంధ్రమాత కాని తెలుగుతల్లి కాని తెలంగాణాతల్లి కాని సందర్భాలను బట్టి మనం సృష్టించుకున్నవే. ఈ తల్లులు లేనప్పుడు కూడా తెలుగు భాష ఉంది - ముందుకూడా ఉంటుంది.

    ReplyDelete