SEARCH

Monday, 20 April 2015

ఉగాది 9వ సంచిక !


ఈ  సంచికలో  

1. ఆదర్శ సోదరులు  

2. వేమన పద్యం    

3. వివాహం సంగతులు

4. ఏప్రిల్ ఫూల్ !

5. జన్మకర్మలు  

6. 25-25-25   




Saturday, 18 April 2015

ఓ బాసు ఇది విను !

నాతో  మాట్లాడిన ప్రతీసారి మా బాస్ కి సారి చెబుతున్నాను  ఈ మధ్యన  ఎందుకో అర్ధం కావడం లేదు!
మొన్న ఒకరోజు హటాత్ గా  నాకు బల్బు వెలిగింది.  మా బాసు నాతొ  మాట్లాడితే నేను  సారి చెప్పటం లేదు.
అస్తమాను విమర్శిస్తుంటే, తిడుతుంటే సారి చెబుతున్నానని
ఒక్కసారిగా నాకు బ్రహ్మర్షి విశ్వామిత్ర  కధ  జ్ఞాపకం వచ్చింది.  ఆయన బ్రహ్మర్షి అవ్వాలని తపస్సు చేస్తున్నపుడు, ప్రతి సారి తన తపస్సక్తిని  వ్యర్ధం చేసుకుంటాడు, ఒక సారి మేనక వలన, ఇంకోసారి రంభ వలన, హరిశ్చంద్రుడు వలన,వగైరా వగైరా  సంఘటనలు, చర్యల వలన ఆయన తపస్సు వ్యర్ధం అవ్వడమే కాక తన లక్ష్యాన్ని చేరుకో లేకపోతాడు.
తన నిగ్రహ లోపం వలన తనకే కాక ఎదుటి వారికి కూడా కష్టాలు వస్తాయి అని నాకు అనిపించింది.
ఏవిధంగా  అంటే, మా బాసు తనకు తెలీని విషయాలను తెలుసుకోవలనుకుంటాడు , కాని అది అధికార మదంతో మావద్దనుండే!?,
 కొత్తగా వాచ్చిన బాధ్యతల వలన మోయలేని భారం వలన ఆయనకు ఆదుర్దా, కోపం రావడం తప్పులేదు, కాని దానివలన మా దృష్టిలో  పాపిగా మిగిలి పోతున్నాడు  కదా !
మా సహకారం ఇక,  భయం వలన అందిస్తామే కాని ఆదరణతో కాదు కదా ?!

Tuesday, 7 April 2015

కోపం - పాపం

కోపం  మనిషికి వుండే దుర్గునాల్లో  ఒకటి మహాత్ములు కోపించరు, కాని కోపిస్తే మాత్రం శపిస్తారు.
దుర్మార్గుడు శాపనార్ధాలు పెడతాడు.
సరే! పేదవాడి కోపం  పెదవికి చేటు, కాని రాజుగారు లేదా  బాసు  కోపం మాత్రం మన పనికి చేటు తెస్తుంది.
ఎప్పుడూ  కోప్పడని  బాసు  కోపిస్తే  మనం మన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు, ఆలోచించవలసిన విషయమే !
కోపిష్టి బాసు కోపిస్తే  పట్ట్టిన్చుకోవక్కర్లేదు, లేదంటే  వాడిని ఉద్యోగంలోంచి తీసేయవచ్చు, మనం కొత్త వుద్యోగం చూసుకుని !

కోపం మనకు వస్తే తగ్గించుకోవడానికి 10 సంఖ్యలు లేక్కబెడితే  కోపం తగ్గి మనం బుద్ధి సరి స్థితిలోకి వస్తుంది.
ఇక్కడే  నాకు ఒక విట్టు  గుర్తుకు వచ్చింది.
నీకు కోపం వచ్చినప్పుడు 10 సంఖ్యలు  లేక్కబెత్తమన్నాను కదా ! అని అడిగిన తల్లికి  చింటూ గాడు  ఇలా సమాధానం ఇచ్చాడట ,తనకి తగిలిన దెబ్బల తాలూకు రక్తం తుడుచుకుంటూ, బంటూ గాడిని వాళ్ళమ్మ 5 సంఖ్యలే  లేక్కపెట్టమన్దంటమ్మ  

ఇదండీ బాసిజం !


అహం మనిషికి వుండే భావాల్లో ఇది ఒకటి. కాని బాస్ కి వుండేది  అహం భావం  అంటే ఒప్పుకుంటారా ?

పైకి ఎదిగేప్పుడు కష్టపడాలి, ఆ స్థానం నిలుపుకోవాలంటే ఒదిగి వుండాలి.
కాని నేను చెప్పిందే  వేదం అందరు నా మాటే వినాలి అంటే  అది తల పొగరు గాక ఇంకా ఏమిటి ?
క్రింద  వాళ్ళు చేస్తే తప్పు, తను చేస్తే పొరపాటు.
తను సెలవు తీసుకుంటే అవసరం. క్రింద  వాళ్ళు తీసుకుంటే అవకాశవాదం!

ఇది అందరి బాసుల పరిస్థితి, కొంత మంది తులసి మొక్కలు వుంటారు  అనుకోండి!

వాళ్ళ నెత్తిన ఎక్కి తొక్కేవాళ్ళు వుంటారు .వాళ్ళ మంచి తనం గుర్తించకుండా

ఇదండీ  బాసిజం !