SEARCH

Friday 29 January 2016

Be ready



అకస్మాత్ గా  ఎవరికైనా ఎపుడైనా  ఎక్కడైనా  ఏదైనా  జరుగవచ్చు
ఇది  గుర్తు ఉంచుకుంటే  చాలు, మనం మనకు గాని మన వారికి గాని జరుగు
 ఘటనాఘటనలందు వచ్చు మానసిక తామసిక భావనలను అదుపులో ఉంచుకోగలం.
అంతేనా ఎప్పుడూ  అలాంటి భావన మనకు స్థిరంగా అలవడుటకు
అనుక్షణ భగవానుని నామ  స్మరణ ప్రాధమిక సోపానం.
అందరిలోనూ ఆ పరాత్పరుని చూడగలగటం మనకు తరవాతి శిక్షణ. 
అలా స్థిర చిత్తుడవయిన , ఎటువంటి అలజడి లేకుండా చేయవలసిన కార్యములు
నిర్విఘ్నంగా జరిపించగలవు.

ఇదే నేటి రోజున ప్రాచుర్యంలో ఉన్న pro activeness

Wednesday 27 January 2016

కొంచెం సాయం!


ఆలోచిస్తే మంచి ఊహలు వస్తాయి
వ్రాయడం మొదలు పెడితే మంచి కధలు వస్తాయి
నేను ఇలా నువ్వు అలా  అనకుంటే మనుషులు ఎట్టా!
నీకోసం నేను అనుకుంటే దేముడైనట్టా?

స్వంత లాభం కొంతమాని పరులకు కొంత సహాయం  చేయడం మంచిదే
మనకి, మన ఆరోగ్యానికి
అలాగని అన్ని ఉచితంగా ఇవ్వడం మంచిదికాదు
ఉచిత సలహాలు అస్సలు ఇవ్వరాదు

Monday 25 January 2016

ర్యాలి – శ్రీ జగన్మోహిని కేశవస్వామి

మీకు జరూరుగా ఉద్యోగంలో  స్థానం మార్పు అంటే ట్రాన్సఫర్ కావాలా అయితే వెళ్ళిరండి ర్యాలి. 
      ర్యాలి అనేది ఆంధ్రప్రదేశ్లోని  తూర్పు గోదావరి జిల్లా  రావులపాలెం దగ్గరలోని  ఒక గ్రామం
      ఇక్కడే వున్న ఒక భగవత్ రూపం గురించి విశేషాలు అందిచడమే ఈ శీర్షిక ఉద్దేశ్యం
   
క్షీరసాగర మధనంలో శ్రీహరి ధరించిన రూపాలు రెండు.  మొదటిది ఆరంభంలో కూర్మావతారము అయితే రెండోది అమృతం లభించిన వేళ పంచేందుకు వచ్చిన జగన్మోహిని అవతారం
ఇంకో విశేషం ఏమిటి అంటే అర్ధనారీశ్వర రూపం ఆది దంపతులకు ఏకాత్మ స్వరూపం అయితే,
జగన్మోహిని కేశవ స్వామి వారిది ఒకే భగవత్స్వరూపానికి ఉన్న రెండు రూపాలు అన్నమాట
 అందువలన ఈయన అలాగే దర్శనం ఇస్తారు, అంతేకాదు విష్ణు పాదోద్భవ గంగ అని కదా  మనం విన్నాం ఇక్కడ ఆ విశేషం కళ్ళారా చూడవచ్చు, కేశవస్వామి పాదాలనుంచి నిత్యం ఊరుతూ ఉబికి వస్తూ వుంటుంది గంగ . మనం దర్శించే సమయంలో ఆ గంగా జలం  మనపై ప్రోక్షిస్తారు.
ఐదు అడుగుల ఏక సాలగ్రామ  శిలా మూర్తి జగన్మోహిని కేశవ స్వామి వారిది

     ర్యాలి లో మనం దర్శించే రూపం జగన్మోహిని కేశవ స్వామి వారిది. అంటే అర్ధనారీశ్వరుని రూపంలాంటిది.
     కానీ శివుడు, పార్వతీదేవి కలసి ఉన్న రూపం అర్ధనారీశ్వరునిది అయితే ముందు పురుషరూపం వెనుక స్త్రీ రూపం కలగలసిన స్వరూపం జగన్మోహిని కేశవ స్వామి వారిది

ముందు ఉన్న పురుష రూపం కేశవ స్వామి వారు, విష్ణు అలంకార ప్రియుడు కదా  
    ఇక ఇక్కడ గర్భాలయంలోనికి వెళ్ళవచ్చు. అందువలననే వెనుక ఉన్న మోహినీ రూపాన్ని మనం దర్శించగలం.
     వెనుక స్త్రీ  రూపం కొప్పు ముడిచి పువ్వులు ఉన్న రూపం, పద్మినీజాతి స్త్రీలకు ఉండే పుట్టుమచ్చ, చీర వెనుకవైపు భాగం మనకు స్పష్టంగా కనపడుతుంది.

Friday 22 January 2016

ఆఫీసు లో బూచాళ్ళు

ఆఫీసు నిండా  బూచాళ్ళే

అబ్బబ్బ  వీళ్ళకి ఏమి చెప్పినా అర్ధం కాదు ఎవడు రా ఇది  రాసింది  ఆఫీసు లో బూచా !
వాణ్ని లోపలి రమ్మను అన్నాడు సంజయ్ .
  *****

ఏమైందిరా అలా  వున్నావు  అడిగాను సూర్యాన్ని
ఏమి చేయమంటావు గురూ ! ఏదో ఈ మధ్యన బ్లాగాడిస్తున్న ! నీకు తెలుసు కదా , నిన్న మంచి టైటిల్ పెట్టి  ఒక మంచి సీరియల్  ఒకటి ప్లాను చేసాను  కానీ  మన బాసు అది ఆయన గురించి అనుకుని పొద్దునే నాకు సినిమా చూపించేసాడు అన్నాడు.
నిన్న నేను లీవు లో వున్నాను అందుకని  మావాడి బ్లాగ్  చదవలేదు

వెంటనే అతని బ్లాగ్ ఓపెన్ చేశాను
మంచి టైటిల్  ఆఫీసులో బూచి !
నాకు నవ్వు ఆగలేదు  అది చూడగానే,  మా బాసుపైనే  అని నాకు కూడా అనిపించింది.
పూర్తిగా చదివాక,  బాసు నిన్ను చివాట్లు పెట్టేలాగా ఏమి లేదు కదా అన్నాను
ఒక చిన్న నిట్టూర్పుతో మొదలు పెట్టాడు
****
నీకు ఎన్ని సార్లు చెప్పను ? పై వాళ్ళ గురించి మాట్లాడెపుడు , కొంచెం ఆలోచించి రాయాలి కదా !
నువ్వు బ్లాగ్ లో మంచి విషయాలు రాస్తున్నావని ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి రాస్తావా?
ఆఫీసు లో బూచి  ఏమిటి
బాసు అంటే అంత  చులకనా ?
కోపంగా అడిగాడు సంజయ్
నాకు ఒక్కసారిగా ఏమి అర్ధం కాలేదు , నన్ను చూస్తూనే  మండిపడుతున్న బాసుకి  ఏమి సమాధానం  చెప్పాలో అర్ధం కాలేదు
కాని ఆయనికి చెప్పాలి అని మొదలు పెట్టాను

సర్  ఒక్క మాట ఇది మన కధ కాదు ,
 ఒక ఆఫీసులో బాసు, సబార్డినేట్ వీళ్ళమధ్య  సంబంధాలు , ఎవరి ఆలోచనలు ఎలా వుంటాయి, ఎలా ఉండాలి
అవి నేను ఒక సీరియల్ గా కధలో భాగంగా చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పేసరికి కొంచెం తగ్గి
తన ఆలోచనలు చెప్పాడు
బాసు మీకు ఒక బూచి అయితే,  మీరందరూ బాసుకి బూచాళ్ళే !
అంటే ఆఫీసు నిండా  బూచాళ్ళే అన్నమాట, అన్నాడు  సంజయ్
అంటూ ఆయన చెప్పిన విషయాలు నోట్ చేసుకుని బయటకు వచ్చేసాను .
కాని నన్ను అపార్ధం చేసుకున్నాడని కొంచెం బాధ అన్నాడు  సూర్యం




Thursday 21 January 2016

ఆఫీసులో బూచి

అబ్బబ్బ ఇంకా నిద్రలోనే వున్నారా !
లేవండీ ! అంటూ నిద్ర లేపింది మా శ్రీమతి
ఏమయింది మీరు కూడా స్కూలు కి వెళ్లనని మారాం చేసే పిల్లాడిలా తయ్యారు అయ్యారు

పదండి అని
అవును ఈ మద్య ఆఫీసు కి వెళ్ళాలంటే దడుచ్కుంటూ వున్నాను
ఆఫీసులో బూచిని చూసి !?
ఏపని చేసినా తప్పే, చెయ్యక పోయినా తప్పే
అందుకే నాకు ఏమి చెయ్యాలో తెలీటం లేదు. 
పోనీ మానేద్దాం అంటే ఇప్పటికి ఇప్పుడు ఎలా ?
ఉన్న ఉద్యోగం మానేసి ఇంకో పని వెతుక్కోవడం  ఆత్మహత్య సదృశం .
ఇప్పుడు ఎలా
అందుకే ఏ దేముడు కనిపిస్తే ఆ దేముడికి మొక్కులు మొక్కుతున్నాను

అసలు ఇంత  కష్టం ఎందుకు వచ్చిందో  మీకు చెప్పాలి

సాధారణం గా  ఎక్కడైనా,   ఫైనాన్సు డిపార్టుమెంటు కి హెడ్డ్  C.F.O , మొత్తం అడ్మిన్కి C.O.O  వుంటారు.
నేను చేయడానికి   ఫైనాన్సు డిపార్టుమెంటు వున్నా, మాకు  హెడ్డ్అదేమీ విచిత్రమో గానీ C.O.O అయ్యాడు

అదిగో అప్పడి నుంచి మాకు కష్టాలు
వాడికి ఫైనాన్సు  అంటే తెలీదు మమ్మల్ని అదుపులో పెట్టుకోవాలని తాపత్రయం తప్ప !

పోనీ మేము ఏదైనా ప్రాబ్లెమ్  చెపితే  మీరు వున్నది ఎందుకు ?
ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలయ్య ! అంటాడు దుబాయిశీను  సినిమాలో   ఫైర్ స్టార్ సల్మాన్ రాజు లాగ
పోనీ వాడికి వచ్చిన పిడకల స్టెప్ కూడా వెయ్యడు . అదికూడా  మేమే వేసేసి వాడి గొప్ప అని చెప్పలంటాడు
బాబోయి ఈ బూచి నుంచి మాకు విముక్తి ఎప్పుడో ?!





Tuesday 5 January 2016

ఉగాది 20వ సంచిక

Happy new year to all 
Birthday special issue 
ఈ సంచికలో 
పుట్టినరోజు శుభాకాంక్షలు 
జీవితం ఇచ్చే శిక్ష(ణ) 
పద్యం 
ఉపపాండవులు 
ర్యాలి 
సంక్రాంతి పండుగ