చాల సంవత్సరాల తరువాత శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్సనం చేసుకున్నాను.
ఆంధ్రా కళా పరిషత్ లో మాష్టర్ డిగ్రీ చదివేప్పుడు క్రమం తప్పక దర్శించుకునే స్వామీ, నా వివాహం తరువాత జంటగా ఆయన్ని దర్శించటం ఇదే ప్రధమం. అందుకే ఈ దర్సనం నాకు ఇంకా నచ్చింది.
శనివారం గుడి త్వరగా మూసి వేసారని తెల్సి ఆదివారం ఉదయాన్నే బయలుదేరాం! కాని, ఆరోజు చాల జన సమ్మర్ధంగా వుంటుంది అని మా వాళ్ళు భయ పెట్టారు.
ఆ స్వామి దయ ఒక గంట వ్యవధి లోనే ఆయనను తనివి తీరా దర్శించుకుని బయటకు వచ్చాం
ఆరోజు పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఎక్కువగానే వున్నాయి. కాని ఆయన కూడా నాకోసం వేచి వున్నారా! అన్నట్లు త్వరగానే స్వామిని చూడగలిగాను.
పునర్దర్సనమ్ ఇమ్మని కోరుకుంటూ బయటకు ఆనందంగా వచ్చాను.