చిరాకుగా అన్న ఒక చిన్న మాట
వెక్కిరిస్తూ విసిరిన ములుకులాంటి చూపు
మనవారినే ఎంతో బాద పెడుతుంది
కొత్త మనుషుల్ని పరిచయం చేసుకోవడం
మనవారిని దూరం చేసుకోవడం ఎంతో సులభం
కాని ఉన్న బంధాలను జీవితాంతం కొనసాగించడం ఎంతో కష్టం!?
అబ్బబ్బ ఒక అధ్యయనం ముగిసింది
అధ్యాయం కాదు అధ్యయనమే !
చాలా రోజుల తరవాత నేను పరీక్ష వ్రాసాను
నిన్న అంతా విరగాదీస్తామని అనుకుంటే
అనారోగ్యం నన్ను మంచంలో పడేసింది
అయినా సరే ఇవాళ పరీక్షా కాలం ముగించాను
80% వచ్చింది
ఇప్పుడు నాకు ఒక సమస్య
మా పిల్లలకు నా గొప్ప చెప్పుకోవచ్చా ?
ఎందుకంటే వాళ్లకు 90% తక్కువ వస్తే నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను !