SEARCH

Wednesday, 12 April 2017

నేను - ఆన్లైన్లో పత్రికలు - 4

ఇంకా కొన్ని ఆన్లైన్ పత్రికలూ వాటి ఇమెయిల్ ఐడీ లు



సుజనరంజని అని అమెరికా నుంచి వెలువడే ఒక తెలుగు ఆన్లైన్ పత్రిక
 http://sujanaranjani.siliconandhra.org/   --  sujanaranjani@siliconandhra.com  కు RTS పధ్ధతిలో కానీ లేక యూనికోడ్ తెలుగు ఉపయోగించి కానీ పంపండి 

తెలుగు వేదిక ముంబయి నుంచి వెలువడే ఒక పత్రిక 

https://www.teluguvedika.net/home.html  -    teluguvedika.net@gmail.com


కౌముది అనే ఆన్లైన్ పత్రిక నేను తప్పకుండా చదువుతాను అని ముందు పోస్టులలో చెప్పాను కదా,  వారికి రచనలు పంపాలంటే editor@koumudi.net అనే మెయిల్ ఐడి కి పంపాలి 

మరి ఆఫ్ లైన్ పత్రికలు  అదేనండి కొని చదివే పుస్తకాలూ, పుస్తకం హస్తభూషణం అనిపించుకునేవి 
స్వాతి, నవ్య, రచన,  ప్రభ వంటివి వాటి చిరునామాలు కావాలా ?



Friday, 7 April 2017

నేను - ఆన్లైన్లో పత్రికలు - 3


మీ వద్ద మంచి కధలు వున్నాయి.  కానీ ఎవరికి  ఎలా పంపాలో తెలియదు అప్పుడు ఎలా ?

అప్పుడు మీరు చేయవలసినది చెప్పడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం


కంప్యూటరు ఉపయోగించి  తెలుగు లిపిలో వ్రాసినవి వీటికి పంపవచ్చు
అచ్చంగా తెలుగు వారికి అయితే contact@acchamgatelugu.com, writers@acchamgatelugu.com
mail  వర్డ్ డాక్యుమెంట్ రూపంలో  పంపవచ్చు.

సుకధ  అని ఈమధ్య ఇంకో  ఆన్లైన్ సైట్ చూసాను
https://sukatha.com/

మీ కథలు ఈ మెయిల్ ఐడి కి  storyboard@sukatha.com పంపండి

ఇందులో ప్రచురించే ప్రతీ కధకు రూ.500 ఇస్తారుట !

గోతెలుగు.కాం లో ప్రచురించే కధకు పారితోషికం రూ. 200 ఇస్తారు వారి మెయిల్ ఐడీ gotelugucontent@gmail.com

అచ్చంగా తెలుగులో అయితే ఒక పుస్తకం ఇస్తారు

మిగతా వాటితో నాకు ఇంకా రచయితగా అనుభవం రాలేదు !

ఈమాట వారికి అయితే  submissions@eemaata.com మెయిల్ ఐడి కి 
రచనలని టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో పంపడం ఉత్తమం

http://www.offprint.in/  అనే ఇంకో సైట్ వుంది దీంట్లో అయితే లాగిన్ అయి మీ రచనలు ఇవ్వవలసి ఉంటుంది 

Wednesday, 5 April 2017

శ్రీ రామ చుట్టకుండా ఒక్క మాట కూడా వ్రాయకుండుగాక !


శ్రీ రామ చుట్టకుండా ఒక్క మాట కూడా వ్రాయకుండుగాక !
అని వాల్మీకి మహర్షి లవకుశలో చెపితే ఒక మానవుడు దేవుడు ఎలా అయ్యాడు అని అడిగినపుడు
చెప్పిన కధ  రామాయణం, ఇది సీతాయాః చరితం మహత్ అని వినుతికి ఎక్కి
సీతా రాముల పుత్రుల చేత లోకంలో ప్రసిద్ధి చెందిన కధ
 ఎప్పుడో జరిగిన రామాయణం ఆధారం లేకుండా ఎలా నమ్మగలం అనే వారికి 
మన తాత ముత్తాతల చరిత్రే మనకు తెలియదు మన అశ్రద్ధే కదా కారణం!
కలుషితమైన గాలి పీల్చి, కలుషితమైన ఆహారం తినే మనకు
కలుషితమైన ఆలోచనలు కాక మంచివి వస్తాయా ?
తెల్ల దొరలు   నింపిన భావజాలంలో మునిగి కొట్టుకుంటున్న మనకు
వాళ్ళు చెపితే కానీ వినిపించుకోని భావ దారిద్య్రం మనల్ని ఎప్పుడు వదులుతుందో ?