SEARCH

Wednesday 25 June 2014

పక్కవారితో మనకేం పని ?

నువ్వు నీగురించి నేను నా గురించి ఆలోచిస్తే అది స్వార్ధం, నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచిస్తే అదే పరమార్ధం

అలా ఎదుట వారి గురించి తలచి మంచి చేసిన వారే పాండవులు, తన గురించి మాత్రమే చూసుకుంటే వారే దుర్యోధన వారసులు

పక్కవారి గురించి నాకు అనవసరం అనుకుంటే వాళ్ళు చేసే తప్పులు, వాటి పరిణామాలు మనపై పడతాయి అప్పుడు వగచి ప్రయోజనం ఉండదు.

అందుకే అప్పుడప్పుడు పక్కవారి గురించి ఆలోచన మంచిది.

నువ్వు కడుపు నిండా తింటే భుక్తాయాసం వస్తుంది, పక్కవారికి పంచితే తృప్తి మిగులుతుంది. అది నీకు సుఖ నిద్ర ఇస్తుంది.

ఒక కొత్త విషయం పంచితేకూడా ఆనందం వస్తుంది. అందుకే మంచిని పంచాలి, చెడుని త్రుంచాలి.


No comments:

Post a Comment