ఆఫీసు నిండా బూచాళ్ళే
అబ్బబ్బ వీళ్ళకి ఏమి చెప్పినా అర్ధం కాదు ఎవడు రా ఇది రాసింది ఆఫీసు లో బూచా !
వాణ్ని లోపలి రమ్మను అన్నాడు సంజయ్ .
*****
ఏమైందిరా అలా వున్నావు అడిగాను సూర్యాన్ని
ఏమి చేయమంటావు గురూ ! ఏదో ఈ మధ్యన బ్లాగాడిస్తున్న ! నీకు తెలుసు కదా , నిన్న మంచి టైటిల్ పెట్టి ఒక మంచి సీరియల్ ఒకటి ప్లాను చేసాను కానీ మన బాసు అది ఆయన గురించి అనుకుని పొద్దునే నాకు సినిమా చూపించేసాడు అన్నాడు.
నిన్న నేను లీవు లో వున్నాను అందుకని మావాడి బ్లాగ్ చదవలేదు
వెంటనే అతని బ్లాగ్ ఓపెన్ చేశాను
మంచి టైటిల్ ఆఫీసులో బూచి !
నాకు నవ్వు ఆగలేదు అది చూడగానే, మా బాసుపైనే అని నాకు కూడా అనిపించింది.
పూర్తిగా చదివాక, బాసు నిన్ను చివాట్లు పెట్టేలాగా ఏమి లేదు కదా అన్నాను
ఒక చిన్న నిట్టూర్పుతో మొదలు పెట్టాడు
****
నీకు ఎన్ని సార్లు చెప్పను ? పై వాళ్ళ గురించి మాట్లాడెపుడు , కొంచెం ఆలోచించి రాయాలి కదా !
నువ్వు బ్లాగ్ లో మంచి విషయాలు రాస్తున్నావని ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి రాస్తావా?
ఆఫీసు లో బూచి ఏమిటి
బాసు అంటే అంత చులకనా ?
కోపంగా అడిగాడు సంజయ్
నాకు ఒక్కసారిగా ఏమి అర్ధం కాలేదు , నన్ను చూస్తూనే మండిపడుతున్న బాసుకి ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు
కాని ఆయనికి చెప్పాలి అని మొదలు పెట్టాను
సర్ ఒక్క మాట ఇది మన కధ కాదు ,
ఒక ఆఫీసులో బాసు, సబార్డినేట్ వీళ్ళమధ్య సంబంధాలు , ఎవరి ఆలోచనలు ఎలా వుంటాయి, ఎలా ఉండాలి
అవి నేను ఒక సీరియల్ గా కధలో భాగంగా చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పేసరికి కొంచెం తగ్గి
తన ఆలోచనలు చెప్పాడు
బాసు మీకు ఒక బూచి అయితే, మీరందరూ బాసుకి బూచాళ్ళే !
అంటే ఆఫీసు నిండా బూచాళ్ళే అన్నమాట, అన్నాడు సంజయ్
అంటూ ఆయన చెప్పిన విషయాలు నోట్ చేసుకుని బయటకు వచ్చేసాను .
కాని నన్ను అపార్ధం చేసుకున్నాడని కొంచెం బాధ అన్నాడు సూర్యం