మనం తేనెను ప్రధానంగా ఓ ఆహారపదార్ధంగానే వినియోగిస్తాం. అయితే, అందులో ఉన్న ఔషధ విలువలు అనేక రుగ్మతలను తగ్గిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనిని రోజూ పరిమితంగా స్వీకరిస్తే ఆరోగ్యరీత్యా ఎంతో మేలంటున్నారు.
ఫేషియల్ గా :
స్పాలు, బ్యూటీ పార్లర్ లకు వెళ్ళాల్సిన పనిలేకుండా తేనెను ఫేషియల్ గా ఉపయోగిస్తే... ముఖ చర్మం కాంతులీనుతుంది. దీంట్లో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడాంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, అల్ట్రా మాయిశ్చరైజింగ్ పదార్థాలు చర్మానికి తగినంత పోషణను అందిస్తాయి.
సిల్కీ స్మూత్ హెయిర్:
సిల్కీ స్మూత్ హెయిర్ కోరుకోని వారెవరుంటారు? అలాంటివారికి ఈ మధుర పదార్థం ఇతోధికంగా సాయపడుతోంది. అదెలాగంటే... కొద్దిగా సాధారణ షాంపూకి ఓ టీ స్పూన్ తేనె కలిపి దాన్ని జుట్టుకు పట్టించాలి. అలా ఓ 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. తద్వారా జట్టు మృదువుగా మారుతుంది. శరీరానికి ఇది ఎంతో శక్తిదాయని.
తక్షణ శక్తికి :
టీ, పాలల్లో చక్కెరకు బదులుగా తేనె ఉపయోగిస్తే తక్షణ శక్తి వస్తుంది.
హ్యాంగోవర్ తాలూకు తలనొప్పి తగ్గడానికి
మందుబాబులకు కూడా దీంతో లాభాలున్నాయట. హ్యాంగోవర్ ను తగ్గించడంలో తేనెను మించింది లేదంటున్నారు. పరిమితంగా తీసుకుంటే హ్యాంగోవర్ తాలూకు తలనొప్పి ఇట్టే మాయమైపోతుందట.
No comments:
Post a Comment