SEARCH

Saturday 9 August 2014

సమయంతో పాటు మార్పు అనివార్యం మార్పు లోనే మనుగడ

నీ భావాలతో ప్రపంచాన్ని ఇంకొంచం ఆనందంగా చెయ్యగలిగినప్పుడు బయటకు చెప్పి సంతోషంపంచు ఏమో ఆ భావం ఇంకొకరి ప్రపంచాన్ని మార్చవచ్చు, ఆలస్యం చేయకు


ఆధునిక ప్రపంచం. సరికొత్త ఆవిష్కరణలతో నిత్యం నూతనోత్తేజంతో అలరారుతోంది. అయితే ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి నడకలు నేర్పింది మాత్రం 11 కార్పొరేట్ సంస్థలేనని తాజాగా ఓ పరిశోధన కథనం తేల్చింది. ఆధునికతను మన ముంగిట పరిచిన ఆ కంపెనీలు నేటికీ తమ ఉనికిని చాటుకుంటూనే ప్రయాణం సాగిస్తుండటం గమనార్హం. ప్రపంచానికే కొత్త నడకలు నేర్పిన ఆ కంపెనీలు, తమ నడకను మాత్రం ఎలా విశ్రమిస్తాయని సదరు పరిశోధన కథనం ప్రశ్నిస్తోంది.


ఆ కంపెనీల్లో మొదటి స్థానం మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీదే. క్రీ.శ. 1700 నాటికి ప్రపంచ జీడీపీలో భారత్, చైనాలది 47 శాతం. అయితే 16వ శతాబ్ధం ఆరంభంలో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త జూలు విదల్చడంతో 1870 నాటికి వీటి వాటా 29 శాతానికి పడిపోయింది. అంతేకాక, యూరోప్ దేశాల జీడీపీని 26 శాతం నుంచి ఒక్కసారిగా 42 శాతానికి పెంచేసింది. తద్వారా యూరోప్ ఆధిపత్యానికి బాటలు వేసింది. 

ఇక రెండో స్థానంలో ఓటీస్ నిలుస్తోంది. ఎలివేటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ కంపెనీ, నగర జీవనంలో మరింత వినూత్నతకు నాంది పలికింది. 1853లో అమెరికా పారిశ్రామికవేత్త ఎలిశా ఓటీస్ నేతృత్వంలో రంగప్రవేశం చేసిన ఓటీస్, తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ఖ్యాతిగాంచిన బుర్జ్ ఖలీఫాలోనూ తన ఎలివేటర్లతో పై అంతస్తుకు సందర్శకులను నిమిషాల వ్యవధిలో తీసుకెళుతోంది. 

నేటి ఆధునిక యుగంలో చమురు లేనిదే బండి నడవదు. 1880లో స్టాండర్డ్ ఆయిల్ తో తెరపైకొచ్చిన జాన్ డీ రాక్ ఫెల్లర్, మొత్తం చమురు రంగాన్నే ఒడిసిపట్టి, చమురు రంగానికి జీవం పోశారు. నేటి మొబైల్ విప్లవానికి పునాది పడింది 1877లోనే. 1876లో టెలిఫోన్ ను ఆవిష్కరించిన గ్రాహం బెల్, తర్వాత అమెరిన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ (ఏటీ అండ్ టీ)ని చేజిక్కించుకుని సమాచార ప్రసారాలకు కొత్త ఊపిరులూదారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే, మొత్తం ప్రపంచమే చీకటిలో మునిగినట్లుంటుంది. ఇంతగా విద్యుత్ వినియోగించేందుకు బీజం పడింది మాత్రం 1892 లోనే.

అప్పటికే ఎన్నో విద్యుత్ ఉపకణాల తయారీ కంపెనీలున్నా, జనరల్ ఎలక్ట్రిక్ రంగ ప్రవేశంతో విద్యుత్ వినియోగం కొత్త పుంతలు తొక్కింది. అప్పటిదాకా అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న రవాణా వ్యవస్థకు 1903లో ఫోర్డ్ కార్లు వేగాన్ని పెంచాయి. తత్ఫలితంగా రవాణా వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. నేటి కంప్యూటర్ యుగానిని కూడా ‘జిరాక్స్’ 1906లోనే పునాది వేసింది. అప్పటిదాకా రోడ్డు, నౌకాయానాలతోనే సరిపెట్టుకున్న మనిషికి, పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్ వేస్ 1924లో వైమానిక యానంలోని వేగాన్ని, ఆధునిక సౌకర్యాలను ముంగిట్లో దింపింది. 

ఆహారం ఉత్పత్తుల విషయంలో మెక్ డోనాల్డ్, భిన్న ఆహార రీతులను 1955లో పరిచయం చేసింది. వినియోగదారుల కొనుగోలు రీతులను 1962లో రంగ ప్రవేశం చేసిన వాల్ మార్ట్ సమూలంగా మార్చేసింది. ఇక అరచేతిలోనే విశ్వ సమాచారాన్ని ఇమిడ్చేసిన గూగుల్ 1996 నుంచి అన్ని రకాల సమాచారాన్ని ఒక్కదరికి చేర్చేసింది. ఇలా ఈ 11 కంపెనీలు నేటికీ తమ ఉనికిని కాపాడుకుంటూనే, కొత్త తరహాలో శరవేగంతో దూసుకువస్తున్న కార్పొరేట్ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాణిస్తున్నాయి.

No comments:

Post a Comment