SEARCH

Tuesday, 19 August 2014

శ్వేతపత్రం - సీమాంధ్రరాష్ట్రం ఇంకొక్కసారి విభజించబడటం

ఒక ముసాయిదాబిల్లు చట్టంగా రూపొందాలంటే ఇరు సభలు (లోక్ సభ, రాజ్యలభలలో) చేత ఆమోదించబడాలి. అప్పుడే అది చట్టంగామారుతుంది. రాష్ట్రవిభజనచట్టం అనంతరం నష్టాలపై ఎనిమిదో శ్వేతపత్రంవిడుదలచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు వాస్తవపరిస్థితిని మనముందువుంచడానికి ప్రయత్నించటం అబినందనీయం. కొన్నినెలలువెనక్కువెళ్ళి, రాష్ట్రవిభజన ముసాయిదా, చట్టంగా ఎలామారిందో చూస్తే, కొన్నినిజాలు బయటికి కనిపిస్తాయు. కాంగ్రెసువారిచేత అడ్డగోలుగా రూపొందించబడిన బిల్లు ఇరు సభలలో ఆమోదం పొందాలంటే, ఖచ్చితంగా ప్రతిపక్షం మద్దత్తు తెలియజేయాలి. మద్దత్తువిషయంలో వెనకడుగువేస్తే, తెలంగాణాలో ఎక్కడ నష్టపోతామేమోనని భావించిన బి.జె.పి., అడ్డగోలుగా రూపొందించిన బిల్లుకి, తన మద్దత్తు తెలపటంద్వారా, లోక్ సభలో బిల్లు విజయవంతం అయ్యేలా, తన పాత్రను పోషించింది. ఆరోజే కనుక, బిల్లుని మరింత విస్తృతంగా, సమగ్రంగా రూపొందించాకే తమ మద్దత్తు వుంటుందని ఖచ్చితంగా చెప్పివుంటే, ఈ రోజు బాబుగారికి శ్వేతపత్రంవిడుదల చేయవలసిన అవసరంవుండేదికాదు. ఇరురాష్ట్రాలమధ్య సహృధ్భావ వాతావరణంవుండేది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా న్యాయబద్దంగా విభజించాల్సిన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటంలో, కాంగ్రెసు, బి.జె.పి.కి సమానవాటా వుంది. ఇప్పుడునెపం, కాంగ్రెసుమీదకు తోసేసి, చేతులు దులుపుకోవటానికి బి.జె.పి. తన ప్రయత్నంచేస్తుంది. అదే వెంకయ్యనాయుడిగారి మాటల్లో క(వి)నిపిస్తుంది. కాలచక్రంలో వెనక్కువెళ్ళి జరిగిన తప్పులను సరిదిద్దుకొనే అవకాశం, ఎలాగా లేదు, కనీసం ఇప్పుడు జరుగుతున్న తప్పులనైనా, సరిదిద్దుకోవటానికి అవకాశంవుంటుంది. కాని వాస్తవ పరిస్థితి బిన్నంగా కనిపిస్తుంది. సీమాంధ్రరాష్ట్ర్ర రాజధాని విషయంలో, 4.5 కోట్ల ప్రజల మనోబావాలని పరిగణలోకి తీసుకుంటూ, బేషజాలకు పోకుండా, అన్నిపక్షాలను, వర్గాలను కలుపుకుని ముందుకు పోవాల్సిన తరుణంలో, బేషజాలకు పోయు, సీమాంధ్రరాష్ట్ర్ర రాజధాని విషయం, ఒక పార్టీ వ్యవహారంగా మార్చేస్తుంది ఇప్పుడున్న అధికారపక్షం. ఈ పద్దతి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో సీమాంధ్రరాష్ట్రం ఇంకొక్కసారి విభజించబడటం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ,ఇంకొక రాజకీయ పార్టీ శ్వేతపత్రం విడుదలచేస్తుంది! ఇది వాస్తవం.

1 comment:

  1. ఒకసరని యేమి కర్మం! ఇక్కడ సీమాంధ్ర తెలంఅాణాల్లో అనేక జిల్లాలున్నాయి.
    సీమాంధ్రలో సీమ, ఆంధ్ర అని మొదలు. మరలా ఉత్తారాంధ్ర అని మరొకసారి.
    తెలంగాణలో ఏదో ఒకనాటికి హైదరాబాదు అస్తిత్వం కోసం మరొకసారి.
    ఇలా తెలుగువాళ్ళ విడిపోవటం తెగులు ఎన్నో ఎన్నెన్నో ముక్కలయ్యేదాకా తగ్గదు.
    ఇదివరలో వ్రాసాను. అసలీ తెలుగు ప్రాంతాల్ని ముక్కలు చెక్కలు చేసి ప్రక్కరాష్ట్రాల్లో కలిపి వేస్తే అందరి తెగులూ అణుగుతుంది. కొన్ని వందల సంవత్సరాలపాటు పడి ఉంటారు. ఈ తన్నుకు చావటం అనే జాతీయతమాషాకార్యక్రమం పరమదరిద్రంగా ఉంది.

    ReplyDelete