వాహనదారులు ఇక నుంచి తమ వాహనాల్లో
పెట్రోల్, డీజిల్ నింపుకోవాలంటే 'కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్' (పీయూసీ- పొల్యుషన్ అండర్ కన్ట్రోల్ సర్టిఫికెట్) చూపించక తప్పదంటోంది ఢిల్లీ ప్రభుత్వం.
సూత్రప్రాయంగా తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావంతో నగరంలోని వాహనాల కాలుష్యాన్ని
తప్పక తనిఖీ చేస్తారు. ఒకవేళ సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నుంచి
పెట్రోలును వాహనాల్లో నింపుకోలేరు.
చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.శ్రీవాత్సవ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, వాయు కాలుష్యానికి సంబంధించిన సమస్యలపై వివరంగా చర్చ జరిగింది. ఈ మేరకు వాహనాలు ఎంత కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయో తెలుసుకునేందుకు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ పొందిన వాహనాలను తనిఖీ చేయాలని ఓ నిపుణుల కమిటీ నివేదిక రికమండ్ చేసినట్లు మీడియాకు ఆయన చెప్పారు.
ఈ విధానాన్ని అమలు చేసేందుకు కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అయితే, ముందుగా దీనిపై ప్రజలకు అవగాహన కోసం ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రచారాన్ని చేస్తుందని, తర్వాత ఆ మార్గదర్శకాలకు వారే కట్టుబడతారన్నారు. వాహనాలు తనిఖీ చేసేందుకు వివిధ పెట్రోల్ పంపులు వద్ద ఇప్పటికే సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు చీఫ్ సెక్రెటరీ వెల్లడించారు.
ఇది మనకి కూడా అమలు అయితే ముక్కుకి గుడ్డలు కట్టుకోవక్కరలేదు !

No comments:
Post a Comment