SEARCH

Friday, 29 August 2014

మంచి రోజులు అంటే జీడీపీ పెరగడమా

రధాని నరేంద్ర మోడీ 'అచ్చే దిన్' మంత్రం బాగానే పనిచేసింది. పదవి చేపట్టిన మూడు నెలల్లోగానే మోడీని మరింత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. రెండున్నరేళ్లుగా భారీ పతన దశలో కూనారిల్లుతున్న దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని భారీగా పెంచేసింది. గడచిన తొమ్మిది త్రైమాసికాల జీడీపీ రేటును తాజా త్రైమాసిక ఫలితాలు తిరగరాసేలా చేసింది. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో జీడీపీ 5.7గా నమోదైనట్లు వెల్లడించాయి. అంటే అంతకుముందు క్వార్టర్ జీడీపీ 4.6 కంటే భారీ వృద్ధి నమోదైనట్లే లెక్క. అంతేకాక గడచిన తొమ్మిది క్వార్టర్లు, అంటే రెండున్నరేళ్ల తర్వాత జీడీపీలో భారీ పెరుగుదల నమోదైంది. 

మంచి రోజులు  అంటే  జీడీపీ పెరగడమా ?
ఇంకా ఏదో కావాలనుకుంట ! సామాన్యుడు కనీసం రెండుపూటలా భోజనం చేయడమని  నేను అనుకుంటున్నాను 

మంచి కొనసాగింపు

వినాయక చవితి సుభకామనలతో

ఏదైనా మంచి విషయం తో రోజు మొదలయితే  ఆహ్లాదం ముందుకు సాగి మంచి రోజుగా ముగుస్తుంది
దానికి మనం చేయవలసింది నవ్వుతూ రోజు ప్రరంబించడమే .
మన ఆస్తి వెనకేసి ముందు వాళ్ళకి అందించకపోయినా . మంచి విషయాలు  నేర్పితే మంచిని కొనసాగించిన వాళ్ళం అవుతాం

సరే మళ్ళీ  అడుగుతున్నాను .

ఇవాళ ఒక్కసారైనా నవ్వుకున్నారా

Wednesday, 27 August 2014

ఏపీరాజధానిగా వినుకొండ-మార్టూరు ?

కేంద్ర హోంశాఖకు శివరామకృష్ణన్‌ కమిటీ సమర్పించబోతోన్న నివేదికలోని కీలక అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శివరామకృష్ణన్‌ కమిటీ ఏపీరాజధానిగా వినుకొండ-మార్టూరు ను 'బెస్ట్ ఛాయిస్ గా' పేర్కొంది. విజయవాడ-గుంటూరును రాజధానిని చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని కమిటీ సూచించింది.ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే ఆర్థిక పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని కమిటీ హెచ్చరించింది

వినుకొండ గుంటూరు జిల్లాలో ఉండగా... మార్టూరు ప్రకాశం జిల్లాలో ఉంది. వినుకొండ-మార్టారు మధ్య ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అత్యంత అనుకూలమని కమిటీ తేల్చింది. మార్టూరు... వినుకొండ కు మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే జిల్లా రాజధాని గుంటూరు నుంచి వినుకొండ సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. వినుకొండకు మార్టారుకు మధ్య ఉన్న ముఖ్యనగరం నరసరావు పేట. నరసరావు రావు పేటకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వినుకొండ ఉంది. నరసరావు పేట నుంచి మార్టూరు కు మధ్య దూరం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది.

Tuesday, 26 August 2014

తెలంగాణలో వర్షాలు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారంట !

విమర్సించటానికి కూడా  అర్ధం  వుండాలి ! అని మీరు అనుకుంటే  ఇంకా మీరు అయోమయంలోనే వున్నారు 
ఇలా విమర్సిస్తున్నదేవరో  తెలుసా  
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తెలంగాణపైనా ప్రభావం చూపిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి. ఆయన అక్కడ అధికారంలోకి రావడంతో ఇక్కడ వర్షాలు పడడం లేదని ప్రజలు అనుకుంటున్నారని నాయిని పేర్కొన్నారు



Monday, 25 August 2014

ఆర్టీసీని ప్రైవేటీకరించరు కాని డీజిల్ ధరలు పెరిగినపుడల్లా ఆర్టీసీ చార్జీలు పెరిగేలా చర్యలు

పెట్రోలియం శాఖ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావుకు భలేనచ్చినట్టుంది. అందుకే ప్రైవేటీకరణ కాకుండానే ప్రైవేటు స్థాయి సంస్కరణల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెట్రోలియం సంస్థలకే ధరల నియంత్రణ పగ్గాలు ఇచ్చినట్టుగా ధరల నిర్ణయం ఆర్టీసీ అధికారులకే అప్పగించేలా సంస్కరణలు చేపట్టనున్నారని సమాచారం. ఈ మేరకు డీజిల్ ధరలు పెరిగినపుడల్లా ఆర్టీసీ చార్జీలు కూడా వాటంతట అవే పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు.

సంస్థ ఇంధన ఖర్చును తగ్గించేందుకు బయో డీజిల్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిన ఆయన, కర్ణాటకలో ఆర్టీసీ(కేఎస్ ఆర్టీసీ) పనితీరును అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపనున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు లీజుకిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకుంటామని ఆయన చెప్పారు. 


ఆర్టీసీని   ప్రైవేటీకరించరు  కాని డీజిల్ ధరలు పెరిగినపుడల్లా ఆర్టీసీ చార్జీలు పెరిగేలా చర్యలు

Sunday, 24 August 2014

వాళ్ళను దూరంగా వుంచండి

ప్రపంచం మనదే అందులో మనకి ఇష్టమైనవాళ్ళు  వుంటారు ఇష్టం లేని వారు వుంటారు
మనకి చెడు చేస్తున్నారు అని తెలిసిన తరువాత  వాళ్ళను దూరంగా  వుంచడంలో  ఏ మాత్రం తప్పులేదు
వాళ్ళు మనకి బంధువులు, ముందుగా స్నేహితులు , ముందు ఎప్పుడైనా పనికి వస్తారు అనే సంశయాలు , ఆలోచనలు  అసలే వద్దు. 
వాళ్లకు నీ జీవితం లో  చోటు లేదు అనుకున్నప్పుడు శరీరంలో చెడు భాగాన్ని వైద్యులు కోసి పారేసినట్లుగానే  నీ నుంచి విసిరికొట్టు.
నిన్ను ద్వేషించే  వారు, అనవసరంగా అడ్డుపడి మన ఎదుగుదలని ఆపాలని చూసేవారిని బయటకు పంపెయడమే.
ఒక వేళ  నీకు కలుగుతున్న ఇబ్బంది చెప్పినపుడు వాళ్ళు  మారితే సరే లేకపోతే  మాత్రం  వాళ్ళు నీకు సంబదించిన పరిధినుంచి బయటకు వెళ్లిపోవలసిందే !!
అంటే వాళ్ళను వారి ఖర్మకు వదిలి మనం దూరంగా మన ప్రపంచానికి వచ్చేయడమే !

ఎందుకంటే  నీ  మనసుకు ఎప్పుడో తెలుసు వాళ్ళు దుఖకారకులని నీ మెదడే  ఆలస్యంగా తెలుసుకుంది.


Saturday, 23 August 2014

జీవితం యొక్క అంతిమ గమ్యం



సంతోషం, ఆనందం ఇవే ముఖ్యం
ఇస్తే హాయిగా వుంటుంది , తీసుకుంటే బరువుగా వుంటుంది
దుఃఖమయమైన పరిసరాలను చిరునవ్వు వెలుగిస్తుంది
మన జీవనం  మరో ఒక్క తోటి ప్రాణికి అవసరం, తోడూ అయినా చాలు నీ గమ్యం చేరుకున్నట్టే .

చెట్టుమీద కూర్చున్న పక్షి , కొమ్మ విరుగుతుందేమో అని భయపడదు .
ఎందుకంటే తన రెక్కలపై తనకున్న నమ్మకం.
అలాగే నీ పై నీకు  వున్న నమ్మకమే  నిన్ను ముందుకు నడిపిస్తుంది , నీ గమ్యం చేరుస్తుంది

Friday, 22 August 2014

ఐ సి ఐ సి ఐ క్రెడిట్ కార్డ్ - సి ఇ ఓ ఫై కేసు


ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ పై కేసు నమోదు చేయాలంటూ లక్నోలోని ప్రాంతీయ కోర్టు పోలీసులను ఆదేశించింది. చందాతో పాటు కార్డ్ ఆపరేషన్ హెడ్ విజయ్ వాల్సేపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లే... ఇమ్రాన్ అహ్మద్ అనే వ్యక్తి క్రెడిట్ కార్డు ద్వారా అతని ప్రమేయం లేకుండానే ఆన్ షాపింగ్ జరిగింది. మే 28న రాత్రి 9.53 నుంచి 10.01 గంటల మధ్యలో ఇమ్రాన్ కు కొన్ని ఎస్ఎంఎస్ లు వచ్చాయి. నాలుగో ఎస్ఎంఎస్ లో టర్కీలో రూ. 79 వేల విలువైన ఆన్ లైన్ షాపింగ్ జరిగిందని సమాచారం వచ్చింది.

దీంతో, అవాక్కైన ఇమ్రాన్ మోసం జరిగిందంటూ వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా... అలసత్వం ప్రదర్శించారు. దీంతో, ఆగ్రహానికి గురైన ఇమ్రాన్ బ్యాంకు అధికారుల శైలిని నిరసిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్ లో కూడా ఇమ్రాన్ కు నిరాశే ఎదురైంది. దీంతో, అతను డైరెక్ట్ గా కోర్టు మెట్లెక్కడంతో... కేసును విచారించిన కోర్టు కొచ్చర్ పై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Thursday, 21 August 2014

ఇకపై ఎబోలాకు భయపడాల్సిన అవసరం లేదా ?!

కెంట్ బ్రాంట్లీ అమెరికా వైద్యుడు. ఆఫ్రికాలో ప్రాణాంతక వ్యాధి ఎబోలా బారిన పడ్డ రోగులకు చికిత్స అందించాడు. ఈ క్రమంలో ఆయన కూడా అదే వ్యాధి బారిన పడ్డారు. మృత్యువుకు అతి సమీపంగా వెళ్లారు. అయితే ఈ వ్యాధి బారిన పడ్డవారికి చికిత్స అందించేందుకు ఎంత ధైర్యంతో ముందడుగు వేశారో, అంతే ధైర్యంతో ఏకంగా ఆ వ్యాధినే జయించారు. ప్రపంచాన్నే నివ్వెరపరచారు.

ఆఫ్రికాలో చికిత్స అందించేందుకు వెళ్లి, ఎబోలా వ్యాధి బారిన పడిన అతడిని స్వదేశం తీసుకువచ్చి చికిత్స అందించాలన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయంపై 15 రోజుల క్రితం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ విమర్శకులే ఒబామా నిర్ణయంతో పాటు బ్రాంట్లీ ధైర్య సాహసాలను కీర్తిస్తున్నారు. ఎబోలా బారిన పడిన బ్రాంట్లీని ఆఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన అమెరికా, అట్లాంటాలో చికిత్స అందించింది.

పూర్తి ఆరోగ్యంతో బ్రాంట్లీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. జ్మాప్ పేరిట కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్స బ్రాంట్లీ ప్రాణాలను కాపాడింది. ఎబోలాను తరిమికొట్టింది. ఇకపై ఎబోలాకు భయపడాల్సిన అవసరం లేదని బ్రాంట్లీతో పాటు జ్మాప్ చికిత్స యావత్తు ప్రపంచానికి ధైర్యం నూరిపోస్తున్నారు.

ఇక నిర్భయ స్కూటర్

ఇండో-జపనీస్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ మారెల్లో యమాసకి ప్రత్యేకించి భారతీయ మహిళల కోసం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కూటర్‌కు కంపెనీ 'నిర్భయ' అనే పేరును ఖరారు చేసింది. మహిళల భద్రత కోసం ఇన్-బిల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్(జీపీఆర్‌ఎస్ ఎనేబుల్ ట్రాకింగ్ సిస్టమ్) ఉండడం ఈ స్కూటర్ ప్రత్యేకత.

ఈ స్కూటర్ మహిళలకు ఎలా రక్షణ ఇస్తుందంటే... నిర్భయ స్కూటర్లలో జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంటుంది. స్కూటర్ లో ఉన్న జీపీఆర్ఎస్ ను ఓ ప్రత్యేకమైన యాప్ ద్వారా వాహనం నడుపుతోన్న మహిళ మొబైల్ కు అనుసంధానం చేస్తారు. ఈ స్కూటర్‌లో ఎస్ఓఎస్ అనే బటన్ కూడా ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ జీపీఆర్ఎస్ ద్వారా మహిళా రైడర్ ఫోన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ బటన్‌ను ప్రెస్ చేయగానే ఏకకాలంలో ఆరు విభిన్న మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా పంపబడుతాయి. ఈ బటన్‌ను నొక్కగానే, సదరు స్కూటర్ ఏ ప్రాంతంలో ఉందనే సమాచారం ప్రతీ రెండు మూడు నిమిషాలకు సదరు మహిళ కుటుంబసభ్యులకు ట్రాన్స్ ఫర్ అవుతుంటుంది.

మరో రెండు నెలల్లో మార్కెట్ లోకి విడుదలవనున్న ఈ స్కూటర్ ధర రూ.35,000 ఉండొచ్చని కంపెనీ సీఈవో  చెబుతున్నారు. మహిళా కొనుగోలుదారులకు 10 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం 35 కిమీ అని.... దీనికి డ్రైవింగ్ లెసైన్స్ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. 



కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ వుందా ? సరే, పెట్రోల్/ డీజిల్ తీసుకోండి

వాహనదారులు ఇక నుంచి తమ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకోవాలంటే 'కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్' (పీయూసీ- పొల్యుషన్  అండర్ కన్ట్రోల్  సర్టిఫికెట్) చూపించక తప్పదంటోంది ఢిల్లీ ప్రభుత్వం. సూత్రప్రాయంగా తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావంతో నగరంలోని వాహనాల కాలుష్యాన్ని తప్పక తనిఖీ చేస్తారు. ఒకవేళ సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నుంచి పెట్రోలును వాహనాల్లో నింపుకోలేరు.

చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.శ్రీవాత్సవ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, వాయు కాలుష్యానికి సంబంధించిన సమస్యలపై వివరంగా చర్చ జరిగింది. ఈ మేరకు వాహనాలు ఎంత కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయో తెలుసుకునేందుకు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ పొందిన వాహనాలను తనిఖీ చేయాలని ఓ నిపుణుల కమిటీ నివేదిక రికమండ్ చేసినట్లు మీడియాకు ఆయన చెప్పారు.

ఈ విధానాన్ని అమలు చేసేందుకు కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అయితే, ముందుగా దీనిపై ప్రజలకు అవగాహన కోసం ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రచారాన్ని చేస్తుందని, తర్వాత ఆ మార్గదర్శకాలకు వారే కట్టుబడతారన్నారు. వాహనాలు తనిఖీ చేసేందుకు వివిధ పెట్రోల్ పంపులు వద్ద ఇప్పటికే సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు చీఫ్ సెక్రెటరీ వెల్లడించారు. 

ఇది మనకి కూడా అమలు అయితే  ముక్కుకి గుడ్డలు కట్టుకోవక్కరలేదు !

Tuesday, 19 August 2014

శ్వేతపత్రం - సీమాంధ్రరాష్ట్రం ఇంకొక్కసారి విభజించబడటం

ఒక ముసాయిదాబిల్లు చట్టంగా రూపొందాలంటే ఇరు సభలు (లోక్ సభ, రాజ్యలభలలో) చేత ఆమోదించబడాలి. అప్పుడే అది చట్టంగామారుతుంది. రాష్ట్రవిభజనచట్టం అనంతరం నష్టాలపై ఎనిమిదో శ్వేతపత్రంవిడుదలచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు వాస్తవపరిస్థితిని మనముందువుంచడానికి ప్రయత్నించటం అబినందనీయం. కొన్నినెలలువెనక్కువెళ్ళి, రాష్ట్రవిభజన ముసాయిదా, చట్టంగా ఎలామారిందో చూస్తే, కొన్నినిజాలు బయటికి కనిపిస్తాయు. కాంగ్రెసువారిచేత అడ్డగోలుగా రూపొందించబడిన బిల్లు ఇరు సభలలో ఆమోదం పొందాలంటే, ఖచ్చితంగా ప్రతిపక్షం మద్దత్తు తెలియజేయాలి. మద్దత్తువిషయంలో వెనకడుగువేస్తే, తెలంగాణాలో ఎక్కడ నష్టపోతామేమోనని భావించిన బి.జె.పి., అడ్డగోలుగా రూపొందించిన బిల్లుకి, తన మద్దత్తు తెలపటంద్వారా, లోక్ సభలో బిల్లు విజయవంతం అయ్యేలా, తన పాత్రను పోషించింది. ఆరోజే కనుక, బిల్లుని మరింత విస్తృతంగా, సమగ్రంగా రూపొందించాకే తమ మద్దత్తు వుంటుందని ఖచ్చితంగా చెప్పివుంటే, ఈ రోజు బాబుగారికి శ్వేతపత్రంవిడుదల చేయవలసిన అవసరంవుండేదికాదు. ఇరురాష్ట్రాలమధ్య సహృధ్భావ వాతావరణంవుండేది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా న్యాయబద్దంగా విభజించాల్సిన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటంలో, కాంగ్రెసు, బి.జె.పి.కి సమానవాటా వుంది. ఇప్పుడునెపం, కాంగ్రెసుమీదకు తోసేసి, చేతులు దులుపుకోవటానికి బి.జె.పి. తన ప్రయత్నంచేస్తుంది. అదే వెంకయ్యనాయుడిగారి మాటల్లో క(వి)నిపిస్తుంది. కాలచక్రంలో వెనక్కువెళ్ళి జరిగిన తప్పులను సరిదిద్దుకొనే అవకాశం, ఎలాగా లేదు, కనీసం ఇప్పుడు జరుగుతున్న తప్పులనైనా, సరిదిద్దుకోవటానికి అవకాశంవుంటుంది. కాని వాస్తవ పరిస్థితి బిన్నంగా కనిపిస్తుంది. సీమాంధ్రరాష్ట్ర్ర రాజధాని విషయంలో, 4.5 కోట్ల ప్రజల మనోబావాలని పరిగణలోకి తీసుకుంటూ, బేషజాలకు పోకుండా, అన్నిపక్షాలను, వర్గాలను కలుపుకుని ముందుకు పోవాల్సిన తరుణంలో, బేషజాలకు పోయు, సీమాంధ్రరాష్ట్ర్ర రాజధాని విషయం, ఒక పార్టీ వ్యవహారంగా మార్చేస్తుంది ఇప్పుడున్న అధికారపక్షం. ఈ పద్దతి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో సీమాంధ్రరాష్ట్రం ఇంకొక్కసారి విభజించబడటం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ,ఇంకొక రాజకీయ పార్టీ శ్వేతపత్రం విడుదలచేస్తుంది! ఇది వాస్తవం.

ధైర్యమే భయానికి విరుగుడు మందు

ధైర్యం కావాలా ?

పిరికి తనానికి కారణం  తెలుసుకోండి ,  అంటే మీ భయానికి కారణం  ఏమిటి?
 ఏదైనా  సమస్యా , వ్యక్తా , పరిసరాలా
 ఎందుకు భయపడుతున్నావు ? నీకు తెలియని విషయమా , అర్ధం కాని వివరాలా  
 లేక కొత్త ఉద్యోగమా ? ఎలా  ఎదుర్కోవాలి ? ఏమి సాధించాలి ?

అంటే వచ్చిన   సమస్యని దాటి జీవితంలో  ముందుకి వెళ్ళడానికి ఏమి కావాలో ఆ శక్తి సామర్ధ్యాలు సాధించాలి. 
అలా సాధించిన శక్తులతో  సమస్యని కాని పరిష్కరించుకోవడం వల్ల లేదా  జీవితంలో కాని  ముందుకు వెళ్ళడం వల్ల  వచ్చే లాభం నష్టం అంచనా  వేయాలి.

 అన్ని వివరాలు నీకు కరతామలకంగా వుంటే  ఇంకా భయం ఎందుకు ? వేయ్  అడుగు ముందుకు.

Monday, 18 August 2014

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమన్తి దేవతాః


యత్ర  నార్యస్తు పూజ్యంతే   తత్ర రమన్తి దేవతాః

మోడీ గారు మీరు మంచి ప్రశ్నే వేసారండి!  అబ్బాయిల్ని కూడా బయటకు వెళ్తున్నపుడు ఎక్కడికి ?  అని అడుగుతున్నార లేదా అని .
కాని విలువలు జారిపోతుంటే ఎలా కాపాడుకోవాలో కూడా  చెప్పండి

ముందు కన్డోముల  యాడ్లు  ఆపండి .

పరాయి స్త్రీ తల్లి లేదా సోదరి అనే పాఠాలు కలలో కూడా గుర్తొచ్చేలా  చెప్పించండి


ఆడపిల్లలకు జరిగిన అన్యాయం మీడియాలో రావక్కర్లేదు , అలా  అన్యాయం చేసినవాడికి పట్టిన గతి మీడియాలో వచ్చేలా చేయండి .


వాళ్లకు కఠిన శిక్షలు అమలు చేయండి


తెలంగాణ ప్రభుత్వం - ఆర్టీఏ చట్టంలో మార్పులు

ఇల్లు మారారా? ఆర్టీఏకు తెలియజేయాల్సిందే. జరిమానా బారిన పడాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రవాణాశాఖ నుంచి గతంలో సేకరించిన చిరునామాలే పోలీసుల వద్ద ఉన్నాయి. దీంతో ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ చిరునామాను ఆరాతీస్తే అక్కడ వాహన యజమానులు ఉండడం లేదు. ఈ-చలానాలు పంపినా రిజెక్ట్ అవుతున్నాయి. 

ఇలాంటి పరిస్థితిని పోలీసులు, రవాణాశాఖ దృష్టికి తీసుకువచ్చారు. దీనిని నివారించేందుకు ఆర్టీఏ చట్టంలో మార్పులు తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆ చట్టం ప్రకారం వాహనదారులు ఇల్లుమారితే 30 రోజుల్లోగా కొత్త చిరునామాను ఆర్టీఏ కార్యాలయాలకు అందజేయాలి. లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వాహనదారుల్లో చైతన్యం తెచ్చేందుకు రవాణాశాఖ భారీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతోంది. 

ప్రతి సంవత్సరం వాహన ఇన్స్యూరెన్స్ రెన్యూవల్ చేసుకునేప్పుడు, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకునేప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలోని అడ్రెస్ ను వాహనదారులు పేర్కొంటున్నారు. అలా కాకుండా ఇకపై ఇంటి చిరునామాను అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలు, నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసు- రవాణాశాఖలు సంయుక్తంగా వ్యవహరించి, రిజిస్టర్ అయ్యే ప్రతి వాహనం వివరాలు నేరుగా పోలీసు డేటా సర్వర్‌లో నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించనున్నారు.

వాహనం తయారీ కంపెనీ పేరు, రంగు, ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్ నంబర్లు, యజమాని పేరు, చిరునామా సహా వాహనం, యజమాని వివరాలు పోలీసు రికార్డుల్లోకి చేరనున్నాయి. ఇది ఓ నెల రోజుల్లో కార్యరూపం దాల్చనుందని సమాచారం.

Saturday, 16 August 2014

అసూయతో పక్క వారి దీపాల్ని అర్పేస్తే నువ్వు వెలిగించిన దీపాలు ఎక్కువ కాంతినివ్వవు


అసూయతో  పక్క వారి దీపాల్ని అర్పేస్తే  నువ్వు వెలిగించిన దీపాలు ఎక్కువ   కాంతిని ఇస్తాయా కాంతినివ్వవు
 పక్కవారి పతనం    నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా  మత్స్యరం నీ  క్కూడా  అదే గతి పట్టిస్తుంది
అరిషడ్వర్గాల్లో మత్సరం కుడా ఒకటి , దానివల్ల పతనం అయిన   ధుర్యోధనుడు  ఒక పెద్ద ఉదాహరణ.
పక్కవారి విజయం నీది అనుకుని ఆనందించక్కరలేదు, కనీసం కుళ్ళుకోకు.

Friday, 15 August 2014

గౌరవం ప్రవర్తనపట్టి వుంటుంది కాని వయసునిబట్టి కాదు

వయసు మీద పడే సరికి  అందరు తమను గౌరవించాలి  అని కోరుకునే వారు వాళ్ళ ప్రవర్తనను మార్చుకోరు.

గౌరవం ప్రవర్తనపట్టి వుంటుంది కాని వయసునిబట్టి కాదు

కోపం, కోరికలు పెరుగుతున్నపుడు వయసు పెరిగినా జ్ఞానం రావటం లేదు కాబట్టి గౌరవం ఎలా వస్తుంది.

నీ అనుభవం నీకు వున్న పరిణితిని బట్టి విజ్ఞానంగా పరిణమిస్తుంది. పరిమితులు ఉన్నా నువ్వు చూపించే విజ్ఞత నిన్ను అందలం ఎక్కిస్తుంది, అందుకే జ్ఞానం వున్న చిన్నవారే పెద్ద వయస్సు వచ్చిన మూర్ఖుల కంటే పెద్దవారే.

కోపాన్ని కోరికలను అదుపులో ఉంచుకోవడం తెలీని వయసు వచ్చిన మూర్ఖుల్లారా, అధికారమిచ్చిని దర్పంతో  కళ్ళు కనపడని పెద్ద తలకాయల్లారా. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తలలు కోల్పోతారు , ఇక్కడ వుండే అర్హత పోగొట్టుకొంటారు.

అధికారం కోల్పోతే మీరు గుడ్డిగవ్వ పాటి చెయ్యరు.  ఎదురుగా వచ్చినా మిమ్మల్నిఅవతలికి పొమ్మంటారు.

తస్మాత్ జాగ్రత!!

Thursday, 14 August 2014

ఏటీఎం నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని పరిమితులు

ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు తీసుకోవాల్సి వస్తే... మన ఖాతా ఉన్న బ్రాంచ్ కి వెళ్లాల్సిందే. మరిప్పుడో, ఎంచక్కా ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేసుకొనే వీలుంది. 24 గంటల్లో ఎప్పుడైనా వెళ్లి మన అకౌంట్ నుంచి డబ్బు తీసుకొనే సౌలభ్యం కూడా ఉంది. అందులోనూ ఇప్పుడు వేతన జీవులకు శాలరీ ఎకౌంట్ ద్వారానే జీతం అందుతోంది. దాంతో, ఏటీఎం వాడకం అనేది మన జీవితంలో ముఖ్య భాగమైపోయింది.

రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడంలో ఉన్న నిబంధనలను మార్చింది. వేరే బ్యాంక్ ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని పరిమితులు విధించింది. నెలకు మూడుసార్లు మాత్రమే ఇతర బ్యాంకుల నుంచి డబ్బును ఉచితంగా తీసుకునే వీలుంది. ఒక నెలలో అంతకు మించి వేరే బ్యాంకుల ఏటీఎంలను వినియోగిస్తే ఒక్కో ట్రాన్షాక్షన్ కు రూ.20 చొప్పున సర్వీస్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. అదే, మన ఖాతా ఉన్న బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచి అయితే 5 సార్లు  డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. 


తెలంగాణ సమగ్ర సర్వే ఐచ్ఛికమే



తెలంగాణ ప్రభుత్వం ప్రతిఒక్కరూ పాల్గొనాల్సిందేనని ఆదేశించిన సమగ్ర సర్వేపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సర్వే ఐచ్ఛికమన్న తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ వ్యాఖ్యలను హైకోర్టు రికార్డు చేసింది. సర్వేలో పాల్గోవాలా, వద్దా? అనేది ప్రజల ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. 
సర్వే ఐచ్ఛికమన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది
ప్రజలను వ్యక్తిగత వివరాలు అడిగి ఇబ్బంది పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. 
బ్యాంకు, తపాల ఖాతాలు, భీమా వివరాలు, మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలు అడగకూడదని హైకోర్టు సూచించింది.
అంటే మీరు ఎప్పుడు తెలంగాణా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్నలతో పాటు  ఈ   క్రింది వాటిలోంచి ఇవి కూడా  తగ్గిపోయాయి. 
1. వాటర్ బిల్లు
2. ఇంటి పన్ను రసీదు
3. గ్యాస్ బిల్లు
4. కరంటు బిల్లు
5.  బ్యాంకు, తపాల ఖాతాలు
6. ఆదార్ కార్డు
7. కుల ధృవీకరణ పత్రం
8. జనన ధృవీకరణ పత్రం
9. వికలాంగుల ధృవీకరణ పత్రం
10. వాహనాల C బుక్
11.  రేషన్ కార్డ్
12.ఓటర్ కార్డ్ 
13. మొబైల్ నెంబర్
14. పాన్ కార్డ్
15. పెన్షన్ పాస్ బుక్
16. స్థల పత్రాలు

Wednesday, 13 August 2014

తేనె ఆహారానికే కాదు అందానికి కుడా



మనం తేనెను ప్రధానంగా ఓ ఆహారపదార్ధంగానే వినియోగిస్తాం. అయితే, అందులో ఉన్న ఔషధ విలువలు అనేక రుగ్మతలను తగ్గిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనిని రోజూ పరిమితంగా స్వీకరిస్తే ఆరోగ్యరీత్యా ఎంతో మేలంటున్నారు.

ఫేషియల్ గా  :
స్పాలు, బ్యూటీ పార్లర్ లకు వెళ్ళాల్సిన పనిలేకుండా తేనెను ఫేషియల్ గా ఉపయోగిస్తే... ముఖ చర్మం కాంతులీనుతుంది. దీంట్లో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడాంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, అల్ట్రా మాయిశ్చరైజింగ్ పదార్థాలు చర్మానికి తగినంత పోషణను అందిస్తాయి.

సిల్కీ స్మూత్ హెయిర్:
 సిల్కీ స్మూత్ హెయిర్ కోరుకోని వారెవరుంటారు? అలాంటివారికి ఈ మధుర పదార్థం ఇతోధికంగా సాయపడుతోంది. అదెలాగంటే... కొద్దిగా సాధారణ షాంపూకి ఓ టీ స్పూన్ తేనె కలిపి దాన్ని జుట్టుకు పట్టించాలి. అలా ఓ 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. తద్వారా జట్టు మృదువుగా మారుతుంది. శరీరానికి ఇది ఎంతో శక్తిదాయని. 

తక్షణ శక్తికి :
టీ, పాలల్లో చక్కెరకు బదులుగా తేనె ఉపయోగిస్తే తక్షణ శక్తి వస్తుంది.

హ్యాంగోవర్ తాలూకు తలనొప్పి తగ్గడానికి 
 మందుబాబులకు కూడా దీంతో లాభాలున్నాయట. హ్యాంగోవర్ ను తగ్గించడంలో తేనెను మించింది లేదంటున్నారు. పరిమితంగా తీసుకుంటే హ్యాంగోవర్ తాలూకు తలనొప్పి ఇట్టే మాయమైపోతుందట.

Tuesday, 12 August 2014

వీటితో గుండె భద్రం

సరైన ఆరోగ్యం ఆహారం వ్యాయామం  వీటితో గుండె జబ్బులకు దూరంగా వుండొచ్చు  

ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవిస్తోంది హృదయ సంబంధ వ్యాధుల కారణంగానే. వైద్యులందరి మాట ఇదే. ఇంతటి ప్రమాదకర వ్యాధిని సింపుల్ గా దూరం పెట్టొచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇందుకుగాను మూడు అంశాలను ఆచరణలో పెడితే సరి అని అంటున్నారు. వాటిని కచ్చితంగా పాటిస్తే కార్డియోవాస్కులార్ జబ్బులు చెంతకు రావట. అవేంటో చూద్దాం... 

ఆరోగ్యకర ఆహారం

కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని మితంగా భుజించాలి. ధాన్యాలు, పీచు పదార్థం ఉన్న కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. పుష్కలమైన ప్రొటీన్ల దృష్ట్యా చేపలు, కోడి మాంసం, గుడ్లు, బీన్స్, జీడిపప్పు, బాదం పప్పు వంటి బలవర్ధకమైన ఆహారపదార్థాలకు డైట్ చార్టులో చోటు కల్పించాలి. ఇవేకాదు, తాజా ఫలాలు, నవనవలాడే కూరగాయలు మన గుండెకు మేలుచేస్తాయి. అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్ ను తీసుకోవచ్చు గానీ, ట్రాన్స్ ఫ్యాటీ పదార్థాలకు దూరంగా ఉండాలి. 

శారీరక వ్యాయామం

రోజూ అరగంటపాటు కసరత్తు చేయాలి. తద్వారా గుండెజబ్బు రిస్క్ కాస్తంత తగ్గించవచ్చు. జిమ్ కు వెళ్ళగలిగే సౌలభ్యంలేని వాళ్ళు... మెట్లెక్కి దిగడం, వాకింగ్ చేయడం ద్వారా వ్యాయామం కల్పించుకోవాలి. దీంతో, బరువు అదుపులో ఉండడమే కాదు, రక్తపోటు, హై కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధుల నుంచి ముప్పునూ తగ్గించవచ్చు. 

పొగాకుకు దూరంగా ఉండాలి

గుండె ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినడానికి ఉన్న అవకాశాల్లో పొగాకు ప్రధానమైనది. హృద్రోగం తీవ్రమవడానికి ధూమపానం, పొగాకు ఉత్పత్తులు నమలడం వంటి అంశాలు కారణమవుతాయి. ఆ అలవాట్లకు స్వస్తి చెబితే గుండెజబ్బు ప్రమాదం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

Monday, 11 August 2014

హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల సంస్కరణలు

హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఇకపై నిమిషాల తరబడి నిలిచిపోవాల్సిన దురవస్థకు చెక్ పడనుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించిన అల్ఫా న్యూమరికల్ సిగ్నళ్ల ఏర్పాటుతో ఈ అవస్థ నుంచి మనకు ట్రాఫిక్ పోలీసులు విముక్తి కల్పించనున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సీవీ ఆనంద్ చేపట్టిన సంస్కరణలు తాజాగా మనలను ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించనున్నాయి.

తాజాగా చర్యల్లో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటయ్యే అల్ఫా న్యూమరికల్ టైమర్లు, వాహన శ్రేణి లేని రూట్ కు రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వాహనాల క్యూ ఉన్న మార్గానికి గ్రీన్ సిగ్నల్ ను ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది. దీంతో 90 శాతం ట్రాఫిక్ అంతరాయాలకు చెక్ పడినట్టే. ఇప్పటికే ఈ టైమర్లను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ధ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది. దీంతో నగరంలోని 221 ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద అల్ఫా న్యూమరికల్ టైమర్లను అమర్చేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం కసరత్తు ప్రారంభించారు. త్వరలోనే ఈ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.

చెడురోజుల్లో ఆర్టీసీ బస్సులు తిరగవు


ప్రజలు అశుభంగా భావించే రోజుల్లో బస్సులను గణనీయంగా తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మంగళవారం, అమావాస్య, పాడ్యమి లాంటి అమంగళకర రోజుల్లో ప్రయాణికుల సంఖ్య బాగా తక్కువగా ఉంటోందని ఆర్టీసీ నిర్వహించిన ఓ స్టడీలో తేలింది. ఈ రోజుల్లో ప్రయాణికులు చాలా తక్కువగా బస్సులు ఎక్కడం వల్ల... ఆర్టీసీకి భారీ నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. శుభప్రదం కాని రోజుల్లో బస్సుల ట్రిప్పులు బాగా తగ్గించి... పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే సీజన్ లో... పండగల టైమ్ లో ప్రస్తుతం నడుపుతున్న వాటి కంటే ఎక్కువగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. నష్టాల నివారణకు ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలలో ఇది ఓ భాగం మాత్రమే అని అధికారులు పేర్కొన్నారు.



Sunday, 10 August 2014

పని ఫలితం

నన్ను  ఈ  మధ్య బాగా  బాధపెడ్తున్న విషయం  ఒకటి వుంది

 తను చేసిన పనిని వేరే వాళ్ళు  తము  చేసిన పనిగా చెప్పేసి  దాని  వల్ల  వాచ్చే ఫలితాన్ని దర్జాగా అనుభవిస్తుంటే చూసి కడుపు మండి పోతోంది . కాని ఒక కొటేషన్  నా ఆలోచనలని మార్చేసింది

"నువ్వు చేసేపనిని వేరొకరు చేయగలిగితే  వారిచేతే చేయి ంచు ఫలితం మాత్రం నీకే దక్కేలా చూసుకో . "

నిజంగా బావుంది కదూ


Saturday, 9 August 2014

సమయంతో పాటు మార్పు అనివార్యం మార్పు లోనే మనుగడ

నీ భావాలతో ప్రపంచాన్ని ఇంకొంచం ఆనందంగా చెయ్యగలిగినప్పుడు బయటకు చెప్పి సంతోషంపంచు ఏమో ఆ భావం ఇంకొకరి ప్రపంచాన్ని మార్చవచ్చు, ఆలస్యం చేయకు


ఆధునిక ప్రపంచం. సరికొత్త ఆవిష్కరణలతో నిత్యం నూతనోత్తేజంతో అలరారుతోంది. అయితే ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి నడకలు నేర్పింది మాత్రం 11 కార్పొరేట్ సంస్థలేనని తాజాగా ఓ పరిశోధన కథనం తేల్చింది. ఆధునికతను మన ముంగిట పరిచిన ఆ కంపెనీలు నేటికీ తమ ఉనికిని చాటుకుంటూనే ప్రయాణం సాగిస్తుండటం గమనార్హం. ప్రపంచానికే కొత్త నడకలు నేర్పిన ఆ కంపెనీలు, తమ నడకను మాత్రం ఎలా విశ్రమిస్తాయని సదరు పరిశోధన కథనం ప్రశ్నిస్తోంది.


ఆ కంపెనీల్లో మొదటి స్థానం మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీదే. క్రీ.శ. 1700 నాటికి ప్రపంచ జీడీపీలో భారత్, చైనాలది 47 శాతం. అయితే 16వ శతాబ్ధం ఆరంభంలో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త జూలు విదల్చడంతో 1870 నాటికి వీటి వాటా 29 శాతానికి పడిపోయింది. అంతేకాక, యూరోప్ దేశాల జీడీపీని 26 శాతం నుంచి ఒక్కసారిగా 42 శాతానికి పెంచేసింది. తద్వారా యూరోప్ ఆధిపత్యానికి బాటలు వేసింది. 

ఇక రెండో స్థానంలో ఓటీస్ నిలుస్తోంది. ఎలివేటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ కంపెనీ, నగర జీవనంలో మరింత వినూత్నతకు నాంది పలికింది. 1853లో అమెరికా పారిశ్రామికవేత్త ఎలిశా ఓటీస్ నేతృత్వంలో రంగప్రవేశం చేసిన ఓటీస్, తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ఖ్యాతిగాంచిన బుర్జ్ ఖలీఫాలోనూ తన ఎలివేటర్లతో పై అంతస్తుకు సందర్శకులను నిమిషాల వ్యవధిలో తీసుకెళుతోంది. 

నేటి ఆధునిక యుగంలో చమురు లేనిదే బండి నడవదు. 1880లో స్టాండర్డ్ ఆయిల్ తో తెరపైకొచ్చిన జాన్ డీ రాక్ ఫెల్లర్, మొత్తం చమురు రంగాన్నే ఒడిసిపట్టి, చమురు రంగానికి జీవం పోశారు. నేటి మొబైల్ విప్లవానికి పునాది పడింది 1877లోనే. 1876లో టెలిఫోన్ ను ఆవిష్కరించిన గ్రాహం బెల్, తర్వాత అమెరిన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ (ఏటీ అండ్ టీ)ని చేజిక్కించుకుని సమాచార ప్రసారాలకు కొత్త ఊపిరులూదారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే, మొత్తం ప్రపంచమే చీకటిలో మునిగినట్లుంటుంది. ఇంతగా విద్యుత్ వినియోగించేందుకు బీజం పడింది మాత్రం 1892 లోనే.

అప్పటికే ఎన్నో విద్యుత్ ఉపకణాల తయారీ కంపెనీలున్నా, జనరల్ ఎలక్ట్రిక్ రంగ ప్రవేశంతో విద్యుత్ వినియోగం కొత్త పుంతలు తొక్కింది. అప్పటిదాకా అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న రవాణా వ్యవస్థకు 1903లో ఫోర్డ్ కార్లు వేగాన్ని పెంచాయి. తత్ఫలితంగా రవాణా వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. నేటి కంప్యూటర్ యుగానిని కూడా ‘జిరాక్స్’ 1906లోనే పునాది వేసింది. అప్పటిదాకా రోడ్డు, నౌకాయానాలతోనే సరిపెట్టుకున్న మనిషికి, పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్ వేస్ 1924లో వైమానిక యానంలోని వేగాన్ని, ఆధునిక సౌకర్యాలను ముంగిట్లో దింపింది. 

ఆహారం ఉత్పత్తుల విషయంలో మెక్ డోనాల్డ్, భిన్న ఆహార రీతులను 1955లో పరిచయం చేసింది. వినియోగదారుల కొనుగోలు రీతులను 1962లో రంగ ప్రవేశం చేసిన వాల్ మార్ట్ సమూలంగా మార్చేసింది. ఇక అరచేతిలోనే విశ్వ సమాచారాన్ని ఇమిడ్చేసిన గూగుల్ 1996 నుంచి అన్ని రకాల సమాచారాన్ని ఒక్కదరికి చేర్చేసింది. ఇలా ఈ 11 కంపెనీలు నేటికీ తమ ఉనికిని కాపాడుకుంటూనే, కొత్త తరహాలో శరవేగంతో దూసుకువస్తున్న కార్పొరేట్ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాణిస్తున్నాయి.

Thursday, 7 August 2014

అది ఇస్తాం, ఇది చేస్తాం అంటూ ఇది మాటల ప్రభుత్వమే అని నిరూపించారు.

ప్రతిపక్షం, పక్క రాష్ట్రం అనేవి ఉండకుండా చూసుకోవడమే నేటి మన కచరాగారి లక్ష్యంలా వుంది , ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పట్టించుకోలేదు, కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంటు కూడా ఇప్పుడు హుళాక్ - 700 కుటుంబాలు రోడ్డున పదనున్నాయని నేటి వార్తల్లో ఒకటి.


చానల్సు ఆపడం రాష్ట్ర సొంత విషయం ఇది మీకు తెలుసా  నిన్ని మన కేకే గారి వాదన,
తెలంగాణా కరంటు కష్టాలకు చబన, కేంద్రం కారణం అంటూ కొత్త సాకు.   అప్పుడు అర్జంటుగా రాష్ట్ర  బ్రాండ్ అంబాసిడర్ కావలి కాని ఆ డబ్బుతో కొంచం కరంటు కొనవచ్చు కదా, కాదండో అడిగితే బాన్ చేయిస్తారు .. 
జయహో  ...

Wednesday, 6 August 2014

పేరు మారిస్తే అభివృద్ధి

నేను చాలా రోజుల క్రితం విన్న చిన్న కధ : ఒక దేశం మంత్రిగారు పొరుగున వున్న పేద దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఓక మంత్రిగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నివసిస్తున్న విలువైన  భవనం చూసి ఆశ్చర్యపోతారు.
ఎలా ఇంత ఖరీదైన భవంతి కట్టారో చెప్పమని అడిగినప్పుడు ఆ మంత్రిగారు దూరంగా వున్న నది మీద కట్టిన వంతెన చూపించి అందులో మిగుల్చుకున్న 20శాతం  నిధులుతో కట్టించాను అని వివరించారు.
సరే ఇప్పుడు ఆ దేశం మంత్రిగారు మన మంత్రిగారు  వున్న  దేశానికి వచ్చి ఈయన నివసిస్తున్న విలువైన  భవనం చూసి ఆశ్చర్యపోతారు. ఎలా ఇంత ఖరీదైన భవంతి కట్టారో చెప్పమని అడిగినప్పుడు మన మంత్రిగారు దూరంగా వున్న నది మీద కట్టని వంతెన చూపించి అందులో మిగుల్చుకున్న 100శాతం  నిధులుతో కట్టించాను అని వివరించారు.
ఇప్పుడు మన కచరా గారు చేస్తున్న పనులు చూస్తే 100శాతం మంత్రిగారు కనిపిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టకుండా వున్న ప్రాజెక్టులకున్న ఆంధ్రపేర్లు మార్చేసి తెలంగాణా పేర్లు పెట్టేసి  తను కట్టినట్టు కలరిచేస్తున్నాడు.

చబన , వైఎస్సార్ , ఒకరికి మించి ఒకరు చేసిన రిలయన్స్, జల (ధన) యజ్ఞంలు మించిపోయారు మన కచరాగారు జయహో