SEARCH

Wednesday, 16 December 2015

ఉగాది 19వ సంచిక

ఉగాది 19వ సంచిక
ఈ సంచికలో
ఆంజనేయ అవతారాలు
పాయసం కోతి అత్యాశ
పద్యం
పలుకే బంగారమా!
అత్తగారి కధలు

Monday, 9 November 2015

ఉగాది 18వ సంచిక


చదువుతూ వినచ్చు కూడా!


హితులకు దీపావళి శుభాకాంక్షలు 
ఉగాది 18వ సంచిక 
ఈ సంచికలో 
1.ఐదు రోజుల దీపావళి 
2.ఎలుక పెళ్లి 
3.ఇల్లు కట్టి చూడు !! 
4.నాగుల చవితి 

Sunday, 18 October 2015

ఇలా వెళ్దాం !

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ
నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి
దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి.
అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.
1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.
2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.
ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి
తండ్రులు ప్రొత్సహించరాదు .)
3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో
వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.
4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత
అంతా దేవుడిపైనే ఉంచాలి.
7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.
8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.
9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.
10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.
12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ
చేయాలి.
32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
33) గోపుర దర్శనం తప్పక చేయాలి.
34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు


గురువు గారికి కృతజ్ఞతలు

Thursday, 15 October 2015

ఉగాది 17వ సంచిక



దసరా శుభాకాంక్షలు
ఉగాది 17వ సంచిక
ఈ సంచికలో
1.దసరా
2.కోతి ఉపాయం
3. విజయదశమి
4. ఇల్లు కట్టి చూడు !!
5. బతుకమ్మ



https://www.youtube.com/watch?v=jcNyOzDfpYI

Thursday, 1 October 2015

అన్నం , సర్వ దోష నివారణ కారకం !

 


అన్నం పర బ్రహ్మ స్వరూపం  :-ధన కారకం :  తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతే   ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే  శ్రీమంతులు అవుతారు.


రోగ నాశనం : తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తే  వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.చర్మ రోగ నాశనం : తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతే  వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.శాంతికి , ధైర్యం కొరకు :తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.శని దోష నివారణం :తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.ఇచ్చిన ధనం  చేతికి చేరడానికి : అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తుంటే : వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది

Wednesday, 16 September 2015

వినాయక చవితి శుభాకాంక్షలతో !! ఉగాది 16వ సంచిక

వినాయక చవితి శుభాకాంక్షలతో
ఉగాది 16వ సంచిక
ఈ సంచికలో
1. ఇలా జరుపుకుందాం !
2. వ్రతకధ
3. ఇరవై ఒక్క రకాలు
4. ఇల్లు కట్టి చూడు !!
5. ఇదేమి వంట !


Sunday, 16 August 2015

ఉగాది 15వ సంచిక

ఉగాది 15వ  సంచిక 
ఈ  సంచికలో  
1. భారతీయులు !
2. కలాం కలకాలం మీకు సలాం    
3. తెలుగు  పద్యం
4. మనమేనా
5. మహాత్మా నీకు వందనం

6. ఇల్లు కట్టి చూడు !!    

Saturday, 8 August 2015

మృత్యు స్వరూపం


మృత్యు స్వరూపం ఏమిటి? ఆయుష్షు తగ్గడానికి, రోగాలు పెరగడానికి కారణం ఏమిటి?
మృత్యువు స్వరూపం ఇతమిద్దంగా ఇది అని చెప్పడానికి లేదు. కాని కొన్ని విశేషాలు తెలుపుతాను.
కలికాలంలో మానవుడి ఆయుష్షు 128 సంవత్సరాలు. కాని ఎవ్వరూ అన్ని సంవత్సరాలు బ్రతకరు. ఎందువలన?
నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం., వేసవిలో దాహం తీర్చడానికి పెట్టిన చలివేంద్రాలకి పెట్టిన వారి తాతల పేరు నుండి భార్య పేరుతొ సహా చెప్పుకోవడం, ఆలయాలలో ఇచ్చిన గోడగడియారానికి కూడా వంశం లో ఉన్న అందరి పేర్లు పెట్టి ఇది ఫలానా వారు ఇచ్చారని చెప్పుకోవడం ఇలాంటి గోప్పలవలన ఆయుష్షు తగ్గుతుంది.
అత్తమామలని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం, లేదా భర్తతో అత్తమామలపై లేనిపోని చాడీలు చెప్పి తిట్టించడం, గెంటించడం, భర్తని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కయ్యానికి కాలు దువ్వడం, లేనిపోని అనుమానాలతో భర్త లేక భార్య ని హింసపెట్టడం, సంప్రదాయాలని వదిలేయడం.
(అత్తమామలు ఇంట్లో లేకపోతె ఇదే కదా జరిగేది, చెప్పేవారు ఉండరు, తినడం, టివిల ముందు తిష్ట వేసుకుని కూర్చోవడం, వంట చేయడం కూడా మనసు పెట్టె పనిలేదు. వంట చేశాం అంటే చేశాం. ఒక పూజ ఉండదు, గుడికి వెళ్ళడం ఉండదు, చుట్టుపక్కల విషయాలన్నీ చెవిలో వేసుకోవడం. సినిమాలు, షికార్లు అని తిరగం, పిల్లల సంగతి సరేసరి! వీళ్ళని తాయారు చేయడానికి కూడా 100 తిట్టుకుంటూ తయారుచేస్తారు కొందరు తల్లులు. ఎందుకు బ్రతుకుతున్నారో కూడా పాపం పసివాళ్ళకి కూడా తెలియదు.) మొదటి రాత్రి భర్తకి ఈ కలికాలంలో పరీక్ష. విజయం సాధించడా మంచివాడు అవుతాడు. పొరపాటున ఓడిపోయడా వీడి జీవితం నాశనం. గుప్పెట్లో పెట్టి నోక్కేస్తుంది. కొందఱు మహిళా మణులైతే వీడి మీద లేనిపోని చాడీలు చెప్పి ఇంకో వివాహానికి సిద్ధపడతారు.
సంప్రదాయాలు చెప్పెపనిలేదు. వినే అవసరం అంతకంటే లేదు. చెయ్యాలంటే బద్ధకం, చెయ్యాలని ఒకానొకరోజు పూనుకుంటారు. 2రోజులు బాగానే చేస్తారు. 3 రోజు విసుగు వస్తుంది, వారం తిరిగేసరికి మంగళం పడేస్తారు.
ఉదయం 7,8,9 గంటలకి నిద్ర లేవడం, త్రిసంధ్యాకాలాలో నిద్రించడం, తినడం తిరగడం, ఇష్టమైన పని చేయడం తప్పితే సంప్రదాయాలు పట్టించుకోరు. ఉచిత సలహాలు అడగకపోయినా ఇస్తారు. ఇలాంటి కారణముల వలన ఆయుష్షు తగ్గుతుంది.
పాపుల్ని అదేపనిగా తిట్టడం వలన వాడి ఆయుష్షు పెరిగి తిట్టినవారి ఆయుర్దాయం తగ్గుతుంది. అందుకే అన్నారు పాపి చిరాయువు అని.
అనవసరపు అనుమానాలు పెంచుకోవడం వలన, అతిగా ఆవేశపడటం వలన, కోపగించుకోవడం, అరవడం,తిట్టడం, వీటి వలన ఆయుష్షు తగ్గుతుంది.
ప్రమాదంలో మరణించేవారు, ప్రమాదవశాత్తు మరణించేవారు అత్యంత పాపాత్ములు. పుట్టిన వెంటనే మరణించేవారు, చిన్న వయస్సులో మరణించేవారు, తల్లిదండ్రులని భాదించేవారు, గురువులని బ్రాహ్మణులని దూషించేవారు, బ్రాహ్మణ జాతిలో జన్మించి వేదాలు వదిలి ఇష్టం వచ్చినట్టు తిరిగేవారు పరమ పాపాత్ములు. దానం చేయని వారు, చేసేవారిని ఆపేవారు, పురాణములు చెప్పెచోట నిద్రించేవారు, పక్కవారితో పరచాకలు ఆడేవారు, అప్పు ఇచ్చి జలగలా పీడించేవారు, తీసుకున్న అప్పుని ఏదో నెపంతో ఎగ్గోట్టేవారు, ఆహార నియమం పాటించనివారు, బంగారం దొంగతనం చేసేవారు, ఈ కాలంలో ఇవి సాధ్యం కదండీ అని చెప్పేవారు, వీరందరూ రాక్షస అంశాలో జన్మించినవారు. వీరికి ఆయుర్దాయం తక్కువ. బ్రతికినన్నాళ్లు ఏదో ఒక సమస్యతో (ఇంటి రోగమో, వంటి రోగమో, మనస్సులో తీరని ఆవేదనో) బాధపడుతూనే ఉంటారు. చనిపోయిన తరువాత ఘోరమైన రౌరవాది నరకాలలో పడతారు.
ఇంకా ఉన్నాయి కానీ ఎన్నని చెప్తాం. ఎవరికీ వాళ్ళు తెలుసుకోవాల్సిందే. కాకపోతే ప్రస్తుతానికి కొన్ని మాత్రం ఇప్పుడు జరుగుతున్న విషయాలు చెప్పాను. ఇందులో నాపైత్యం ఏమి లేదండి. ఉన్న విషయం చెప్పాను.
ఇప్పటివరకు వీటిలో మీలో ఎవరైనా పైన చెప్పిన పనులు చేస్తే వెంటనే ఆపేయండి, లేదా 1 కి 1000 రెట్లు బాధపడతారు


గురువుగారికి  కృతజ్ఞతలతో 

Friday, 24 July 2015

పిశాచం రూపంలో హనుమంతుడు ????

పిశాచం రూపంలో హనుమంతుడు.....

పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర రణ రంగం లో విజయుడి రధం జెండా పై ”కపి రాజు ”హను మంతుడు కొలువై ఉన్నాడు .యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా ,అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు .కిరీటి రధం దిగి ,రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు .అందరు బంధువులే .కావలసిన వారే .వీళ్ళందర్నీ చంపి ,తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు .కనుక యుద్ధం చేయటం కంటే భిక్షం ఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి .మనసు అంతా వ్యాకులం అయింది .కర్తవ్యమ్ తోచటం లేడు .శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్యమ్ బోధించమని వేడు కొన్నాడు .

బావ మరిది ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడు అర్జునుని మనో భావం గుర్తిన్చాడు శ్రీ కృష్ణ భగవాన్ .వెంటనే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతా సారాన్ని విని పించి యుద్దోన్ముఖుడిని చేశాడు .భగవానుని గీత ను అను సరించి ,విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .

పార్దునికి ,పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రధాపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించు కొన్నాడు .”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తీ తో నమస్కరించాడు .అప్పుడు గోపాల చక్ర వర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హను మంతా !నేను చెప్పిన విషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు .నువ్వు విన్న గీత కు ”భాష్యం ”రచించు .దానితో నీ పిశాచ రూపం అంత రిస్తుంది ”అని శాపాన్ని ,శాప విమోచనాన్ని తెలియ జేశాడు పరమాత్మ .

కురు క్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత,హనుమ పిశాచి రూపం పొంది ,గంధ మాదన పర్వతం చేరాడు .అక్కడ అత్యంత భక్తీ ,శ్రద్ధ లతో భగవద్ గీతను మననం చేసు కొంటూ ”,గీతా భాష్యం ”రచించాడు .అదే హనుమద్ భాష్యం ”గా లోకం లో ప్రసిద్ధి చెందింది .అక్కడక్కడ ఈ భాష్య గ్రంధాలు కనీ పిస్తున్నాయట .

ఈ కదా విశేషా లన్నిటిని మైత్రేయాది మహర్షులకు పరాశర మహర్షి చెప్పి” శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని”సంపూర్ణం గా తెలియ జేశాడు .ఆ మర్నాడు మైత్రేయాది మహర్షులు ,పరాశర మహర్షి ఇత్యాది శిష్య బృందం అందరు కలిసి శ్రీ హనుమ పూజ ను నిర్వహించి ,నైవేద్యం పెట్టి అందరికి తీర్ధ ,ప్రసాదాలను అంద జేశారు .ఎక్కడ హనుమ పూజ జరుగు తుందో అక్కడ శ్రీ రాముడు సీతా ఆంజనేయ సమేతం గా లక్ష్మణ భరత శత్రుఘ్నపరి వారంతో ,ఉమా మహేశ్వరు లతో కొలువై ఉండి అందరకు మనో భీష్టా లను నేర వేరుస్తాడు .

”ఆంజనేయ పాహిమాం -ఆంజనేయ రక్షమాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం ”

”సువర్చ లాధిష్టిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్పణం –భాను ప్రభం ,రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం ,శ్రీ హానూ మంత మీడే”.

”హనుమా, నంజనా సూను,వాయుపుత్రో ,మహా బలహ -రామేష్టహ ,ఫల్గున సఖః ,పింగాక్షో ,అమిత విక్రమః

ఉదధి క్రమణశ్చైవ ,సీతా శోక వినాశనః ,లక్ష్మణ ప్రాణ దాతాచ ,సుగ్రీవస్య దర్పహా ,ద్వాదశైతాని నామాని కపీంద్రస్య

మహాత్మనః -స్వాప కాలే పతేన్నిత్యం ,యాత్రా కాలే విశేషతః ,-తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ”.

”అతులిత బలదామం ,స్వర్ణ శైలాభి దేహం- దనుజ వర క్రుశానుం జ్ఞానినా మగ్ర గణ్యం- సకల గుణ నిధానం ,వానరా ణా మధీశం–రఘు పతి ప్రియ భక్తం వాత జాతం నమామి ”
”సుందరే సుందరే రామః సుందరే సుందరీ కధా –సుందరే సుందరీ సీతా ,సుందరే సుందరం వనం

సుందరే ,సుందరం కావ్యం ,సుందరే సుమ్దరః కపిహ్ -సుందరే సుందరం మంత్రం సుందరే కిం నసుందరం ”

”గోష్పదీకృత వారాశిం మశకీ కృత రాక్షసం -రామాయణ మహా మాలా రత్నం వందే అ నిలాత్మజం ”

”ఒక భూతంబున కుద్భ వించి ,మరి ఇంకో దాని పై కేగి -,ఇంకొక దానిన్ దరి ఈడ్చి ,వేరొకట రక్షో దేశమున్ గాల్చి ,-వేరొక

భూతంబు తనూజ గుర్తెరిగి పెరుమ్గాంచి -,భూత ప్రపంచక రూపాత్మకుడైన మారుతి సమస్తా రాధ్య దైవంబగున్ ”

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం...

”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే –పూర్వా భాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూ మతే

కరుణారస పూర్ణాయ,ఫలా పూప ప్రియాయచ -మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూ మతే

సువర్చలా కళత్రాయ,చతుర్భుజ ధరాయచ -ఉష్ట్రా రూధాయ వీరాయ ,మంగళం శ్రీ హానూ మతే

దివ్య మంగళ దేహాయ ,పీతాంబర ధరాయచ -తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హానూ మతే

భక్త రక్షణ శీలాయ ,జానకీ శోక హారిణే-జ్వలత్పావక నేత్రాయ ,మంగళం శ్రీ హానూ మతే

పంపా తీర విహారాయ ,సౌమిత్రి ప్రాణ దాయినే -సృష్టి కారణ భూతాయ ,మంగళం శ్రీ హనూమతే

రంభా వన విహారాయ ,గంధ మాదన వాసినే –సర్వ లోకైక నాధాయ ,మంగళం శ్రీ హనూమతే

‘ పంచానన భీమాయ ,కాలనేమి హరాయచ –కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూ మతే ”’.

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం సర్వం సంపూర్ణం –ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ –

Monday, 13 July 2015

ఉగాది 14 వ సంచిక- పుష్కరాలు ప్రత్యేక సంచిక

ఉగాది 14 వ సంచిక - పుష్కరాలు ప్రత్యేకం
ఈ  సంచికలో  
1. పుష్కర స్నానవిది  
2. తెలుగు  పద్యం    
3. చాతుర్మాసం  
4. పుష్కర విధి 
5. గోదావరి పుష్కరాలు 
6. ఇల్లు కట్టి చూడు !!   

Sunday, 28 June 2015

ఉగాది 13 వ సంచిక



ఉగాది 13 వ సంచిక
ఈ  సంచికలో  
1. మంచి మాట 
2. తెలుగు  పద్యం    
3. ఆషా"ఢం" 
4. కవిత్వం చెప్పిన వ్యాపారి  కధ
5. గోదావరి పుష్కరాలు 
6. ఇల్లు కట్టి చూడు !!    



Saturday, 13 June 2015

గర్వం ఎక్కడ ? అణుకువ తప్ప



గర్వం : మనిషికి హాని  చేసే దుర్లక్షణాలలో  ఒకటి

ఒకరికి సహాయం చేసే స్థానంలో వున్నపుడు మనలో కలిగే భావం. 
కాని,  అప్పుడు మనం  గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే
ఎదుటి వ్యక్తి  చేసిన ప్రార్ధనల ఫలితం అతనికి   మనతో  అందే వీలు కలిపించాడు ఆ  దైవం అంతే! .

సంగ్రామానికి ముందు యుద్ధం చేయలేనన్న అర్జునిడికి కృష్ణుడు చెప్పింది కూడా అదే!!
నువ్వు యుద్ధం చేస్తే ఆ ఫలితం నీకు దక్కుతుంది, నువ్వు చేయకపోయినా యుద్ధం ఆగదు.
కాబట్టి యుద్ధం అయిన, మంచి పని అయినా నువ్వు చేయకపోతే  జరగదు అనుకోవద్దు,
నువ్వు కాకపొతే ఇంకొకరు చేస్తారు, కాబట్టి నువ్వు చేసేది ఇంకొకరి పని అనుకున్నపుడు
గర్వం ఎక్కడ ?
అణుకువ తప్ప 

Thursday, 11 June 2015

ఉగాది 12 వ సంచిక

ఉగాది 12 వ సంచిక
ఈ  సంచికలో  
1. తెలుగు సంఖ్యలు 
2. భర్తృహరి   పద్యం    
3. వివాహం సంగతులు
4. గులకరాళ్ళు  కధ
5. యోగం శరణం     

6. ఇల్లు కట్టి చూడు 

Sunday, 7 June 2015

కోపం బట్టతలకు కారణం ! నిజమేనా ?

ఒక వింత వాదన

మనం ఎవరినైనా ఎందుకు దూరంగా  ఉంచాలని అనుకుంటామో తెలుసా
ముఖ్యంగా కోపిష్టి వాళ్ళను దూరంగా ఉంచుతాం, అదే కోపిష్టి బాస్ అయితే ఇంకా మనం జాగర్తగా వుంటాం
వాళ్ళు కొడతారని, తిడతారని కాదు, అందరిలోనూ అవమానిస్తారని ! నిజమే కదూ ?
సరే మనల్ని కోపిస్తే వాళ్లకు వచ్చే లాభం ఏమిటి ? వాళ్ళ లో వున్న అసంతృప్తి  మనమీదకు కుమ్మరించేస్తారు,
వాళ్ళ  కోపం తగ్గేవరకు మనల్ని ఉపకరణంలా  వాడుకుంటారు.
మరి నష్టాలు :
మన దృష్టిలో పతనం అవ్వడం
కోపిష్టి వాడిగా ముద్ర పడి  మందికి దూరం అవ్వడం
అంతేనా
కోపిష్టి వాళ్ళకు  జుట్టు పలచబడి, రాలడం ఎక్కువ అవుతుందిట
ఇంకా బట్టతల  వచ్చేస్తుందిట
అందుకేనేమో మా పాత బాస్ కి గుండు వుంటుంది !
కోపం   బట్టతలకు  కారణం ! నిజమేనెమో  ?



Thursday, 4 June 2015

ఇష్టం కష్టం

కొంచెం కష్టమైనా ఇష్టమైన పని చేయాలి
లేకపోతె ఇష్టం లేని పనే కష్టంగా చేయవలసి వస్తుంది
వాడు తిడితే పడాలి పనిలోంచి పీకేస్తే పోవాలి
నీ తప్పు లేకపోయినా సారీ చెప్పాలి
అవసరమైతే అపోలిజి లెటర్ వ్రాయాలి
లేకపోతె మనసు కష్ట పెట్టుకోవాలి
అందుకే మంచి పనికోసం కష్ట పడాలి
మనసుకు నచ్చిన పని చేయాలి
ఇదే నేటి జీవన సూత్రం

Image result for apology face

Tuesday, 2 June 2015

సింహాద్రి అప్పన్న



చాల సంవత్సరాల తరువాత  శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్సనం చేసుకున్నాను.
ఆంధ్రా కళా పరిషత్ లో మాష్టర్ డిగ్రీ చదివేప్పుడు క్రమం తప్పక దర్శించుకునే స్వామీ,  నా వివాహం  తరువాత జంటగా ఆయన్ని దర్శించటం ఇదే ప్రధమం. అందుకే ఈ  దర్సనం నాకు ఇంకా నచ్చింది.
శనివారం గుడి త్వరగా మూసి వేసారని  తెల్సి ఆదివారం ఉదయాన్నే బయలుదేరాం! కాని, ఆరోజు చాల జన సమ్మర్ధంగా వుంటుంది అని మా వాళ్ళు భయ పెట్టారు.

ఆ స్వామి దయ ఒక గంట వ్యవధి లోనే  ఆయనను తనివి తీరా దర్శించుకుని  బయటకు వచ్చాం
ఆరోజు పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఎక్కువగానే వున్నాయి.  కాని ఆయన కూడా  నాకోసం వేచి వున్నారా! అన్నట్లు  త్వరగానే స్వామిని చూడగలిగాను.
పునర్దర్సనమ్ ఇమ్మని కోరుకుంటూ బయటకు ఆనందంగా వచ్చాను.

Monday, 1 June 2015

వృత్తి మార్చే సమయం !


చాతి నొప్పి, కడుపులో మంట, తలనొప్పి, నిద్రలేమి, శ్వాస లో ఇబ్బంది, పొత్తి కడుపులో నొప్పి, ఆరోగ్యంలో తేడాలు ఇలాంటి వ్యాధులు ఎన్ని జాగ్రతలు  తీసుకున్న తగ్గకుండా మీకు శారీరకంగా    బాధ కలిగిస్తూ వుంటే ఆ బాధలు చాలా నెలలు సంవత్సరాలు అయితే మీరు తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత  ఏమిటంటే

మీరు  చేస్తున్న  వృత్తిని మార్చడమే!  


ఉద్యోగులైతే వెంటనే  ఉద్యోగం  మార్చేయండి !!!

ఎందుకంటే  మీకు మానసికంగా వున్న బాధలను, శారీరక బాధలుగా  మీరు భావిస్తూ మందులు, డాక్టర్లు చుట్టూ తిరుగుతూ వుంటారు, ఇంకా లేదంటే ఇలా చేసి చూడండి 

1. మీలో వున్నా అపరాధ భావనలు లేదా విచార భావనలను బయటకు పంపించి వేయండి 
2. జీవితం పట్ల విశాల దృక్పధం ఏర్పరుచుకోండి 
3. ప్రేమ, ఆనందకర భావాలను పెమ్పందిన్చుకోండి 
4. ధ్యానం చేయండి 
6.  ఆహార, విహారాదులలో  మార్పులు చేయండి


ఇంకా మానసిక వైద్యులను సంప్రదించి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి

Monday, 25 May 2015

ఉగాది 11వ సంచిక

ఉగాది 11వ  సంచిక 

ఈ  సంచికలో  

1. అబ్బ ! ఎండ దెబ్బ ?!   

2. వేమన  పద్యం    

3. వివాహం సంగతులు

4. చిట్టి కధ

5. ధ్రువ పత్రాలు పోతే !    

6. 25-25-25   ధారావాహిక 





Sunday, 3 May 2015

ఉగాది 10వ సంచిక

ఉగాది 10వ  సంచిక 

ఈ  సంచికలో  

1. పరీక్షల ఫలితం   

2. సుమతీ  పద్యం    

3. వివాహం సంగతులు

4. సింహం - చిట్టెలుక  కధ

5. పిల్లల పెంపకం    

6. 25-25-25   ధారావాహిక 




https://www.youtube.com/watch?v=ON1PvfCbKsw

Friday, 1 May 2015

వేసవి శెలవులు వచ్చేశాయి మనం ఏమి చేయవచ్చు ?

వేసవి శెలవులు  వచ్చేశాయి మనం ఏమి చేయవచ్చు ?
పిల్లలు చదివి అలసిపోయాం ఇప్పుడు సెలవులు ఆనందంగా గడుపుదాం అనుకుంటున్నారా ?
రోజు ఉదయం అర్ధగంట కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించండి ., కొత్త పద్యమో,శబ్దమో , భాష ఏదైనా సరే !
సాయంత్రం కొత్త తరగతి పుస్తకాలు చదవటానికి అర్ధగంట కేటాయించండి 

తల్లితండ్రులారా ! ఇక మీ బాధ్యత ఏమిటో తెలుసా ?

పిల్లలను 
1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో  
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.

2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........

3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి..........

4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........

5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...

6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......

7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......

8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........

9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............

10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి........

దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............సెలవుల్లో  పిల్లలను  సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........

Monday, 20 April 2015

ఉగాది 9వ సంచిక !


ఈ  సంచికలో  

1. ఆదర్శ సోదరులు  

2. వేమన పద్యం    

3. వివాహం సంగతులు

4. ఏప్రిల్ ఫూల్ !

5. జన్మకర్మలు  

6. 25-25-25   




Saturday, 18 April 2015

ఓ బాసు ఇది విను !

నాతో  మాట్లాడిన ప్రతీసారి మా బాస్ కి సారి చెబుతున్నాను  ఈ మధ్యన  ఎందుకో అర్ధం కావడం లేదు!
మొన్న ఒకరోజు హటాత్ గా  నాకు బల్బు వెలిగింది.  మా బాసు నాతొ  మాట్లాడితే నేను  సారి చెప్పటం లేదు.
అస్తమాను విమర్శిస్తుంటే, తిడుతుంటే సారి చెబుతున్నానని
ఒక్కసారిగా నాకు బ్రహ్మర్షి విశ్వామిత్ర  కధ  జ్ఞాపకం వచ్చింది.  ఆయన బ్రహ్మర్షి అవ్వాలని తపస్సు చేస్తున్నపుడు, ప్రతి సారి తన తపస్సక్తిని  వ్యర్ధం చేసుకుంటాడు, ఒక సారి మేనక వలన, ఇంకోసారి రంభ వలన, హరిశ్చంద్రుడు వలన,వగైరా వగైరా  సంఘటనలు, చర్యల వలన ఆయన తపస్సు వ్యర్ధం అవ్వడమే కాక తన లక్ష్యాన్ని చేరుకో లేకపోతాడు.
తన నిగ్రహ లోపం వలన తనకే కాక ఎదుటి వారికి కూడా కష్టాలు వస్తాయి అని నాకు అనిపించింది.
ఏవిధంగా  అంటే, మా బాసు తనకు తెలీని విషయాలను తెలుసుకోవలనుకుంటాడు , కాని అది అధికార మదంతో మావద్దనుండే!?,
 కొత్తగా వాచ్చిన బాధ్యతల వలన మోయలేని భారం వలన ఆయనకు ఆదుర్దా, కోపం రావడం తప్పులేదు, కాని దానివలన మా దృష్టిలో  పాపిగా మిగిలి పోతున్నాడు  కదా !
మా సహకారం ఇక,  భయం వలన అందిస్తామే కాని ఆదరణతో కాదు కదా ?!

Tuesday, 7 April 2015

కోపం - పాపం

కోపం  మనిషికి వుండే దుర్గునాల్లో  ఒకటి మహాత్ములు కోపించరు, కాని కోపిస్తే మాత్రం శపిస్తారు.
దుర్మార్గుడు శాపనార్ధాలు పెడతాడు.
సరే! పేదవాడి కోపం  పెదవికి చేటు, కాని రాజుగారు లేదా  బాసు  కోపం మాత్రం మన పనికి చేటు తెస్తుంది.
ఎప్పుడూ  కోప్పడని  బాసు  కోపిస్తే  మనం మన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు, ఆలోచించవలసిన విషయమే !
కోపిష్టి బాసు కోపిస్తే  పట్ట్టిన్చుకోవక్కర్లేదు, లేదంటే  వాడిని ఉద్యోగంలోంచి తీసేయవచ్చు, మనం కొత్త వుద్యోగం చూసుకుని !

కోపం మనకు వస్తే తగ్గించుకోవడానికి 10 సంఖ్యలు లేక్కబెడితే  కోపం తగ్గి మనం బుద్ధి సరి స్థితిలోకి వస్తుంది.
ఇక్కడే  నాకు ఒక విట్టు  గుర్తుకు వచ్చింది.
నీకు కోపం వచ్చినప్పుడు 10 సంఖ్యలు  లేక్కబెత్తమన్నాను కదా ! అని అడిగిన తల్లికి  చింటూ గాడు  ఇలా సమాధానం ఇచ్చాడట ,తనకి తగిలిన దెబ్బల తాలూకు రక్తం తుడుచుకుంటూ, బంటూ గాడిని వాళ్ళమ్మ 5 సంఖ్యలే  లేక్కపెట్టమన్దంటమ్మ  

ఇదండీ బాసిజం !


అహం మనిషికి వుండే భావాల్లో ఇది ఒకటి. కాని బాస్ కి వుండేది  అహం భావం  అంటే ఒప్పుకుంటారా ?

పైకి ఎదిగేప్పుడు కష్టపడాలి, ఆ స్థానం నిలుపుకోవాలంటే ఒదిగి వుండాలి.
కాని నేను చెప్పిందే  వేదం అందరు నా మాటే వినాలి అంటే  అది తల పొగరు గాక ఇంకా ఏమిటి ?
క్రింద  వాళ్ళు చేస్తే తప్పు, తను చేస్తే పొరపాటు.
తను సెలవు తీసుకుంటే అవసరం. క్రింద  వాళ్ళు తీసుకుంటే అవకాశవాదం!

ఇది అందరి బాసుల పరిస్థితి, కొంత మంది తులసి మొక్కలు వుంటారు  అనుకోండి!

వాళ్ళ నెత్తిన ఎక్కి తొక్కేవాళ్ళు వుంటారు .వాళ్ళ మంచి తనం గుర్తించకుండా

ఇదండీ  బాసిజం !

Tuesday, 31 March 2015

ఉగాది సంచిక -8

ఉగాది సంచిక -8

 ఈ  సంచికలో
1. రామాయణం చెప్పిన సంగతులు
2. వేమన పద్యం  
3. రామ ధర్మం
4. వివాహం సంగతులు
5. నీలా విలాపం
6.స్వర విజ్ఞానం
7. సహజ గుణం


వదలవలసిని జ్ఞాపకాలు

నా ఇల్లు, నా భర్త అంటూ తానంటే ఇష్టం లేని భర్తను భరిస్తూనే వుంటుంది ఒక ఇల్లాలు తనకంటూ ఒక రోజు రాకపోతుందా అని. 
నా కొడుకు , నా కోడలు అంటూ వుంటారు కన్న తల్లి తండ్రులు  పిల్లలుకోసం  సర్వస్వం త్యాగం చేస్తే  ఆ పిల్లలు వీళ్ళను గాలికి వదిలేస్తారు, అయినా  వీళ్ళు ఎదురు చూస్తోనే వుంటారు తమకంటూ ఒక రోజు రాకపోతుందా అని. 

ఒక అమ్మాయిని   లేదా  అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళు వీళ్ళని వదిలేసి వేరే దగ్గరకు వెళ్లి పోతారు కాని వీళ్ళు మాత్రం వాళ్ళ జ్ఞాపకాలతో  జీవిస్తూ  వుంటారు ఒక రోజు రాకపోతుందా అని.

కాని నిజానికి ఆ రోజు రాదు, జీవితంలో అందరూ  ముందుకు పోతువుంటే  వీళ్ళు  అక్కడే ఆగిపోతారు .
నిజానికి వాళ్ళు చేయవలసింది నిజాన్నీ గుర్తించి ముందుకు సాగటం  నేర్చుకోవాలి. మొదట్లో  చాల కష్టంగా వుంటుంది , కాని ముందుకు సాగాలంటే  పాత జ్ఞాపకాలు ఆగాలి.  తప్పదు !


Monday, 30 March 2015

జ్ఞానం శాశ్వతం

మనకు నచ్చింది ఇతరులకు నచ్చాలని లేదు, మనం కోరుకున్నవన్నీ మంచివి అవ్వాలనీ లేదు
కాని కొన్ని మనకు దొరికేవి మనకు తెలియకుండానే మనల్ని మంచి వైపు నడిపిస్తే, కొన్ని ఫలితం అనుభవించాక మన కర్మని  ఖర్మగా మారుస్తాయి.
మనకోసం బ్రతకాలంటే పక్కవారిపై ఆధారపడాలి, ఇంకొకరికి వెలుగావ్వాలంటే  మనం జ్యోతిగా మారాలి నిలువునా జ్ఞానంలో మునగాలి .
శిఖరం చేరిన ప్రతివాడు తప్పక దిగి వస్తాడు.  జాగ్రత్తగా దిగకపోతే సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది.
నేడు నాదే గెలుపని విర్రవీగితే , రేపటికి  అపజయం ఎదురుగా వచ్చి తలుపు తడుతుంది.
అందుకే మార్పు తప్ప ఏది శాస్వతం కాదని గుర్తు పెట్టుకుని   సాగాలి ముందుకు మనం .



Saturday, 21 March 2015

మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో

మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో
ఉగాది ప్రత్యేక  సంచిక
 ఈ  సంచికలో
1. పండుగల విశేషణం
2. ఉగాది పండుగ విశేషాలు
3. వేమన పద్యం
4. ఆర్దిక సూత్రం
5. నిందకు చలించకు
6. పనికి సహాయం




Sunday, 15 March 2015

ఉగాది 6వ సంచిక మీకోసం



6th Issue
ఈ సంచికలో 
1. చిత్రం నేర్పిన కధ : శిశిర వృక్షం 
2. ఆలయ దర్శనం 
3. సుమతీ పద్యం 
4. చేయకూడనివి, చెప్పకూడనివి
5. పిల్లలకోసం : భయం వద్దు 
6. వివాహం సంగతులు 
7. మనలో మాట : జీవహింస


Vugaadi Audio Magazine Edition 6UJP2Lb4

Sunday, 1 March 2015

ఉగాది 5వ సంచిక మీ కోసం

మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆశిస్తూ 

ఉగాది 5వ సంచిక  మీ కోసం 

ఈ  సంచికలో  

1.  కార్పోరేట్ కధ : ఇప్పుడే! 

2. పరీక్షా సమయం  

3. వేమన పద్యం 

4. వివాహం సంగతులు 

5. జలం  వ్యర్ధం  కావద్దు 

6. పిల్లలకోసం  : అంతా మన మంచికే  

7. వెటకారపు కధ : బద్దకానికి బలి 

https://www.youtube.com/watch?v=YUgLwzQv4cI

Friday, 27 February 2015

Tuesday, 24 February 2015

తెలంగాణా వచ్చుడు ఆంధ్రాకు ఎంత మంచిదో !

ఫ్లాష్ న్యూస్ చూస్తే  ఒక గొప్ప సంగతి ఇప్పుడే తెలిసింది.

తెలంగానం మొదలయినందుకు  మన కచరా గారు దేవుళ్ళకు మ్రొక్కిన మొక్కులకు డబ్బులు. ప్రభుత్వ ఖజానానించి విడుదల చేయిస్తున్నారట!
G.O  కూడా విడుదల చేసినట్లు సమాచారం. తొలి దఫా నిధులు కోసం. 
తిరుమల బాలాజీకి ఆభరణాలకు 5 కోట్లు
భద్రకాళి తల్లికి 2 కిలోల బంగారంతో  ఆభరణాలు
పద్మావతి మాతకు 15 గ్రాముల బంగారంతో ముక్కుపుడక
వీరభద్రునికి  15 గ్రాముల బంగారంతో  మీసాలు
దుర్గామ్మకు 15 గ్రాముల బంగారంతో ముక్కుపుడక
అజ్మీర దర్గాకు 5 కోట్లు ఇస్తారంట !

అదుర్స్ కదూ !

GHMC  ఎన్నికలకోసం, ఆంధ్రావోల్లను  మాత్రమె కాదు దేవుళ్ళని మంచి చెసుకొనుడు  వొధుల్తలెదు మన సారూ !

Saturday, 21 February 2015

మనం బ్రతికి వున్నట్లు గుర్తు ఏమిటో తెలుసా !

మనం బ్రతికి వున్నట్లు గుర్తు ఏమిటో తెలుసా !

శ్వాస ! ఊపిరి తీసుకుంటూ వుంటే బ్రతికి వున్నట్లు ,
సరే ఎలా స్వాసించాలి ?  పిచ్చి ప్రశ్న !  పుట్టినదగ్గరనుంచి మనం తెలియకుండా  చేసే ఒకే ఒక్క పని ఊపిరి తీయడమే .
నిజమా ? సరే మన వూపిరి గొంతు వరకే వెళ్తోందా ? నాభి  వరకూ వెళితేనే  సరిగా శ్వాస తీసుకుంటున్నట్లు. అది తెలుసా !
సరే శ్వాస కోసం గాలి లోపలి తీసుకున్న మనం మొత్తం గాలి బయటకు వదులుతున్నామా ?  లేదు, అది కూడా  సగమే వదులుతున్నాం.  అలా లోపల వుండిపోతున్న మిగతా సగం గాలే మనలో రోగాలకు కారణం.
ఇప్పుడు చెప్పండి  మనకు ఊపిరి తీసుకోవడం వచ్చా ?

అంటే గాలిని  నాసిక ద్వారా నాభి వరకూ  తీసుకుని తరువాత చెడు గాలిని పూర్తిగా బయటకు వదలాలి !

నాకు గాలి ఎలా పీల్చాలో తెలిసిందోచ్.

మనకు బలవంతంగా అంటకడుతున్న రోగం స్వైన్ ఫ్లూ




మందుల వ్యాపారానికి , విస్తరనకే  మనకు బలవంతంగా అంటకడుతున్న రోగం  స్వైన్ ఫ్లూ

వివరాలు  మీకోసం

https://www.youtube.com/watch?v=f5imzZ7B6Uo

Saturday, 14 February 2015

ప్రపంచ పుస్తక వితరణ దినం కానుక : - ఉగాది శ్రావ్య పత్రిక 4 వ సంచిక

ఉగాది శ్రావ్య పత్రిక - 4 వ సంచిక 

ప్రపంచ పుస్తక వితరణ దినం కానుక 

ఈ  సంచికలో
1. గిఫ్ట్ కావాలా!
2. వివాహం సంగతులు
3. పిల్లలకోసం  : ఏడు  చేపల కధ
4. వేమన పద్యం
5. స్వైన్ ఫ్లూ గురించి నిజాలు
6. మంత్రాలు, పూజలు అవసరమా 


https://www.youtube.com/watch?v=f5imzZ7B6Uo

Friday, 13 February 2015

ఒక సిపాయి అంతరంగం


ఇది ఒక సిపాయి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ రాసుకున్న కథ..
“మంచు  దట్టంగ కురుస్తొంది!! సిపాయి ద్రుఢంగ నిల్చొని పహారా కాస్తున్నాడు !! ఆధి అర్ధరాత్రి అయినా  అతను అలాగే చలికి తట్టుకుంటు  మన భూ భాగానికి రక్షణ ఇవ్వలి.
ఆతని ఆలొచనలు కొన్ని నిమిషాలు అతని ఇంటికి మళ్ళాయి ...
ఇలా అతని అంతరంగం ఆలొచిస్తోంది
“అబ్బ  ఇంత  చలి ఉంటే  నేనసలు ఇంట్లో  నించి బయటకు రాను.  మా ఇంటి  మీద ఉండే ఫొగమంచును చూస్తూనే ఉంటే  ఎంత  బాగుంటుందొ.. అలా తెల్లరాక బయటకి వెళ్లి  మంచు పడుతూ  పొదున్నె మా ఊరు  చాల అందంగా  ఉంటుంది .మా స్నెహితులు  నేను కలిసి ఊరంత  పొద్దున్నే  తిరిగేస్తాం . ఆలా తిరిగి ఇంటికి వచ్చాక మా అమ్మ అద్భుతమయిన వంటని కడుపారా తిని ఇంటి  పనులు చెస్కుంటూ  ఇంటి  పెరట్లో  నేను వెసిన మొక్కలకి నీళ్ళు  పడుతూ .. ఆ పూచె పువ్వులని అమ్మ పూజ కి ఇస్థూ.. కాచె కాయల్ని అనందంగ చూస్తూ ఉంటే  ఎంత  ఆనందం...
ఎంత  ప్రసాంతంగా  ఉంటుందొ మా ఊరు... ఆ పొలాలు.. ఆ సినెమ హాల్ల్లు.. ఆ స్నెహితులు.. ఆ మనుషులు.. ఎల అందరు ఏ  తారతమ్యం లెకుండ  ఉంటారు . ఇలాగే  అన్ని దేశాలూ  కూడా  స్నెహ భావంతో  ఉంటే  నిజంగ ఈ విశ్వం లో  భూమి నె జీవించడానికి మొదటి   ప్రదేశం అవుతుంది.
ఇంతలో ఏదో  సవ్వడి ...
ఆ అలికిడి  వచ్చిన చోటును నిసితంగా  పరిసీలించాడు .. శత్రువులు  ఆ నిసి రాత్రి  మంచులొ కూడా  మన మీద దాడి  చెయ్యడానికి చూస్తున్నారు..

ఆ సిపాయికి ఇప్పుడు  అతని  అమ్మ, నాన్న, ఇల్లు, మొక్కలు, స్నెహితులు  గుర్తురావడం లేదు ,
తన మాత్రుదేస రక్షణలో ముందుకు దూకాడు
మనం మనవారితో  కలిసి ఇంట స్వేచ్చా  జీవనాన్ని  ఏందరొ సిఫాయిల  త్యాగ ఫలం  మనం అనుభవిస్థున్నాం ..
మనంం  ఇప్పుదు కో రుకొవలసింధి దేస రక్షన చే సె ప్రతి  సిఫాయి క్షే మంగ ఇల్లు చెరి వారి ఊహల్లొ వారు ఊహించుకున్న విషయలన్ని నిజంగ అనుభవించాలని కొరుకుందాం.
ఆంధరికి ఒక ఛిన్న మనవి దేస రక్షణ  సిఫాయిల పనే  కాదు మన పని కూడా  . డెశ  రక్షణ  కోసం మనం కనీసం సమగ్రతని, ఐకమత్యాన్ని రక్షించుకుందాం...
ఫ్రతి  సిపాయికి అంకితం  ఇస్తూ చాలా చిన్న ప్రయత్నం .
జై  హింద్!!

వినండి ఇక్కడ

https://www.youtube.com/watch?v=6ZnjHjO0_Zw

Sunday, 1 February 2015

ఉగాది 3 వ సంచిక మీ కోసం


ఈ సంచికలో
ఒక సిపాయి అంతరంగం
చీమలు పెట్టిన పుట్టలు - వేమన పద్యం
ఎందుకు ఏమిటి ఎలా  - బల్బు సంగతులు
పిల్లల కోసం  - పేరు మరచిన ఈగ కధ
మనలో మాట - పొగడటం, మనిషిలో దేవుడు  వివరణ
వినండి ఇక్కడ
https://www.youtube.com/watch?v=6ZnjHjO0_Zw



Saturday, 31 January 2015

పింక్ స్లిప్

ఒకానొక రైతు  పెట్టిన కంపెనీ లో  అదేనండి   ఇంట్లో  ఒక  HR  అంటే కోడి , చెప్పినదానికి తలాడించే ఒక చెంచా అదేనండి గొర్రె , పైవాడు చెప్పిందానికి  కష్టపడటమే మార్గం అనుకునే ఒక ఎద్దుగారు పని చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా ఒక ఆఫీసు బాయ్  ఒక ఎలుక కూడా వుంది.
సరే  రైతు ఎలుకను  పింక్ స్లిప్ ఇచ్చి  అంటే బోను తెచ్చి బయటకు పంపెద్దామని తయారు అయిపోతాడు.
ఇంట్లోకి బోను, ఎలుక వంట్లోకి భయం వచ్చి చేరతాయి.
మనకు కష్టం వస్తే మన బాస్  దగ్గరకు  వెళ్తాం కదా ! అలాగే  ఎలుక, ఎద్దు దగ్గరకు వెళ్లి తన కష్టం చెప్పుకుంటే
తను సహాయం చేయలేను అని అంటుంది  ఎద్దు.
గొర్రె దగ్గరకు వెళ్తే మునుపెన్నడు నాకు ఇటువంటి కష్టం రాలేదు, కాబట్టి ఏమి చేయాలో నాకు తెలీదు అంటుంది.
కోడి నీకష్టం నీ ఇష్టం అంటుంది.
ఎవ్వరు సహాయం చేయతలేదని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఎలుక.
 ఆ రాత్రి బోనులో ఏదో చిక్కినట్లు శబ్దం వస్తే, చూడటానికి వెళ్తుంది రైతు భార్య .
బోనులో చిక్కిన తన తోకను తీసుకోవడానికి అవస్త  పడుతున్న  పాము, రైతు భార్యను  కాటు వేస్తుంది !
 ఆమెకు వచ్చిన విష జ్వరాన్ని తగ్గించడానికి, రైతు కోడి పులుసు తాగిస్తాడు , కాని తగ్గదు జ్వరం.
సరే ఆమెను పరామర్శకోసం  వస్తున్న వారికోసం గొర్రెగారు  ఖర్సు ! అవుతారు .
కొన్నిరోజులకు రైతు భార్య మరణిస్తుంది.  ఆ రోజులకు ఎద్దు బలి !
ఇలాగ  అన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయినా  ఒక్కరు మాత్రం ఉండిపోతారు !?
ఎవరంటే  ఎలుకగారు !

అందుకే  మన  జట్టులో   ఎవరికైనా  కష్టం  వస్తే,  ఆదుకోకపోతే    ఆ  కష్టం మనకు నష్టం  తేవచ్చు !

ఇదే కధ  ఇక్కడ  వినవచ్చు
https://www.youtube.com/watch?v=3R49Lu56piU

Friday, 30 January 2015

ఆంధ్రులారా చేవ చచ్చినవారా ? ఆంధ్రోల్లు అంటే అంత చులకనా !

విడగొట్టడం  ఇంత  వీజీయా  అన్నట్టుగా  విడదీసేసారు
ప్రత్యేకం అని అడిగిన వారికి రాజధాని, మిగులు  మూల ధనం  ఇచ్చి
విడిపోవద్దు  అన్న వారికి  రాజధాని లేదు,  మిగులు మాట దేముడు ఎరుగు మింగ మెతుకు లేదు .

మేము అన్యాయం  చెయ్యం. అంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  రాజ్య సభలో  ప్రత్యేక హోదా గురించి మేమే అడిగాం అని జబ్బలు చెరచిన  కమల వీరులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలు  ఒప్పుకోవాలి అంటున్నారు.

ఆంధ్రోల్లు అంటే అంత  చులకనా !
   ఇంకా ఎంత కాలం మీకు ఈ  దురదృష్టం ?
ఇంకా ఎంత కాలం ఇలా   మోసపోతారు ?
 ఆంధ్రులారా చేవ చచ్చినవారా  ?
చేతకాని వారా ?
కళ్ళు తెరిచి,  కాళ్ళు పట్టడం మాని పీక పట్టండి !


Wednesday, 28 January 2015

నాలుగో దోస

దుడ్డుగాడికి చాలబాధగా వుంది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాక ఆయన తిట్టిన తిట్లు గుర్తోచ్చి బాధ పడిపోతూ అప్పుడే వాళ్ళ అమ్మ ఊరు వెళుతూ వేసిచ్చిన డజన్ దోశలని దుఖంతో తిని లీటర్ పాలు దుఖంతో తాగాడు.
అప్పుడే వచ్చిన బడ్డుగాడిని చూసి వాడంటే ఉన్న ఇష్టంతో వాడికి కూడా దోశలు పెట్టాలని అనుకున్నాడు.
లోపలి కి వెళ్లి కిచన్లో చూస్తె వాళ్ళమ్మ వేసిన దోశలు ఐపోయాయ్ మరే డజన్ దోశలు వాడే తినేశాడుకదా
మరేం చెయ్యాలి అని ఆలోచించి వాడిని ఖాళి కడుపుతో పంపడం ఇష్టంలేక వాడే దోశలు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. అసలు దోశలు తినడం వచ్చుకాని దోశలు వెయ్యడం రాదు వాడికి. మరి ఏమిచెయ్యాలి అని ఇంకోసారి బాగా చించి అదే ! ఆలోచనలని  బాగా చించి, వాడి చిన్నపుడు చిరగ్గా వేసిన మాడిపోయిన ఒకే ఒక్క దోశ ఎలా వేసాడో
 గుర్తు తెచుకుంటూ పొయ్యమీద పెనం పెట్టి  దోశలు  వెయ్యడం  మొదలు పెట్టాడు
మొదటి దోశ : అసలు దానిని దోశ  అని అనుకోలేదు, పిల్లులు  పీకిపడేసిన ఒక రబ్బరు ముక్కలాగా వచ్చింది.
                 దానిని బడ్డుగాడికి పెట్టి వాడిని బాధపెట్టలేడు
రెండో దోశ : ఇది దారుణంగా ఒక చింపి పడేసిన కాగితంలా వచ్చింది, బడ్డుగాడికి సరిపోదు
మూడో దోశ: ఇది దోశ ఆకారంలో వచ్చింది కాని ఒక చార్ట్ మీద బొగ్గుతో గీసినట్టుగా నల్లగా మాడిపోయింది
నాలుగో దోశ : దుడ్డు గాడు జాగ్రత్తగా సుతారంగా దోస వేసాడు. అద్బుతం ఇది దోసలాగే వచ్చింది. దోరగా కాలింది. వాతావరణాన్నిఅద్భుతమైన దోస సువాసనతో నింపేసింది
అంతే ఒక్కసారిగా దుడ్డు గాడు రెచ్చిపోయి  ఆ నాలుగో దోసనుంచి డజను దోశలు  వేసేసాడు. వాటిని బడ్డుగాడికి
తినిపించి వాడి ఆకలి తీర్చాడు. అంత అద్భుతమైన రుచికరమైన దోశలు తిన్నాక బడ్డుగాడికి  ఆనందభాష్పాలు రాలాయి. వాడికి దుడ్డుకి ఏదైనా సహయం చెయ్యాలని వూరు అందరికి దుడ్డు గాడి దోసల రుచి చెప్పి, వాడిచేత
ఒక దోస హోటల్ పెట్టించాడు
దుడ్డు గాడు జాగ్రత్తగా సుతారంగా దోశలు  వెయ్యడం  మొదలు పెట్టాడు. వాడి దోశలు చాల ప్రఖ్యాతమైపోయి
కొన్నాళ్ళ తరువాత దుడ్డు గాడు ప్రపంచంలో కెల్లా రుచికరమైన దోశలు వేసేఒక బ్రహ్మాండమైన చెఫ్ గాపేరు గడించాడు.
ఇప్పుడు వాళ్ళ నాన్న వాడిని తిట్టటం లేదు, వాళ్ళ అమ్మకి వీడే దోశలు వేసి పెడుతున్నాడు.
ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆ రోజు వాడు వేసిన నాలుగో దోస కంటే ముందు వేసిన మూడు దోశలు కధ. అది ఒక్క దుడ్డుగాడికి  మనకి తప్ప ఎవ్వరికీ తెలీదు. చివరికి బడ్డుగాడికి కూడా.

మనం ఎలాగు చెప్పం దుడ్డుగాడు అసలే చెప్పడు

కధ: చైతు ,
రచన:  సత్య

Wednesday, 21 January 2015

షి టీమ్స్ ఏ కాబ్ లో మహిళలు వున్నారో ఎలా గుర్తిస్తారు?

కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలకు ఒక విజ్ఞప్తి
షి టీమ్స్  ఏర్పాటుచేసి మహిళలకు రక్షణ కల్పించాలనే ఆలోచన మంచిదే, కొన్ని రాష్ట్రాలలో అప్పుడే అమలుకూడా  చేసారు.  అయితే  ఏ  కాబ్ లో మహిళలు వున్నారో ఎలా గుర్తిస్తారు.?

బేబి ఆన్ బోర్డ్  అని కారుల్లో స్టికర్ పెడుతున్నట్లు,   షి ఆన్ బోర్డ్ అని కాబ్లవెనుక అద్దానికి సూచనలు పెట్టేలా చూస్తే కొంత మంచిదేమో ఆలోచించండి.  

కౌగిలింతల రోజు



కొన్ని మనకు ఆనందం కలిగించే రోజులు ఉంటాయి మనకు ఇష్టమైన వారికి కొన్ని ఇవ్వాలి అనిపిస్తుంది
కాని , కొన్ని   వారికి కూడా ఇష్టమైతేనే తీసుకుంటారు అలాంటివాటిలో కౌగిలింత ఒకటి

 ప్రేమికుల రోజు లాగ  ఇవాళ కౌగిలింతల రోజుట
ఇదికూడా అమెరికా  నించి  వచ్చిన రోజు .
ఇవాళ అక్కడ సెలవు కూడా.
శాస్త్ర వేత్తల  ప్రకారం కౌగిలింతల వలన మనలో ఒత్తిడి  తగ్గుతుందిట
మరింకేమి కౌగిలించు కోండి ఇష్టమైన వారిని

Monday, 19 January 2015

కొన్ని సూచనలు పాటిస్తే స్వైన్ ఫ్లూ నించి తప్పించుకోవచ్చు

వణికిస్తున్న  స్వైన్ ఫ్లూ 
రక్తపోటు, మధుమేహం , గుండె జబ్బులకన్న  తగు జాగ్రత్తలు  పాటించకపోతే  స్వైన్ ఫ్లూ ప్రమాదకారే  !
కొన్ని సూచనలు  పాటిస్తే స్వైన్ ఫ్లూ  నించి తప్పించుకోవచ్చు. 

రోజు కొంచం సేపు ఉదయం ఎండలో వుండటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది 
శుభ్రమైన ఆహార అలవాటులు పాటించండి 
చలి నుంచి రక్షణ పొందండి 
వీలైనప్పుడల్లా చేతులు  శుభ్రం  చేసుకోండి 
జలుబు, వళ్ళు  నొప్పులూ , కడుపు నొప్పి , జ్వరం , దగ్గు  వుంటే  త్వరగా వైద్యుడిని కలవండి 
జన సమ్మర్ధానికి దూరంగా వుండండి  
ఒక టి  స్పూను తులసి రసం , తేనే  కలిపి  రోజు సేవించండి. 

అందరికి వివరాలు అందిచడం వలన త్వరగా ఈ  మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు !

 

Saturday, 17 January 2015

తెలంగాణాకి ఇంత ప్రత్యేకమా


నేటి విశేషాలు చూస్తుంటే ఒక గొప్ప విషయం దేశం లో మనం ప్రత్యేకం అని మళ్లీ  నిరూపిన్చుకున్నాం
దేశం  అంత పెట్రోలు ధర తగ్గుతుంటే మనకి మాత్రం ఆ ధర తగ్గుదల అందుబాటులోకి రాలేదు . ఎందుకో తెలుసా
వాట్ టాక్స్ పెంచి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటోంది .
హరి హరి !

Thursday, 15 January 2015

గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు




గోత్రమంటే 
 నిజానికి    గోత్రమంటే ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.
ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ మనకు తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ  వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...
సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.
ప్రవర
కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.

వివాహ నిబంధనలు
గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే 
గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,
ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,
|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు
---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ
.........................శర్మన్ అహం భో అభివాదయే ||
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక ' సగోత్రము ' అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.
మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. తర్వాత ,
* ఎవరికైతే ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్య తో వివాహము తగదు.
* ఎవరికైతే ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఐదుగురు ఋషులు ఉంటారో , ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
ఇదీ , సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు... అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..
మాతృ గోత్రాన్ని వర్జించాలి. అంటే , తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి , ఆ ప్రకారముగా సగోత్రమైతే వివాహమాడరాదు.
ఏఎ గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది
ఇక నిబంధనల సడలింపులు
ఈ విషయములో సడలింపులు అంటు ఏవీ లేవు.
గోత్రము తెలియనిచో , తనని తాను ఎవరికో ఒకరికి ఇచ్చుకొని , వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో , ఈ పద్దతి తగదు.
తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే , ప్రాయశ్చిత్తం చేసుకొని , ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.
తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు.
తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా , ఒక నెలలోని శుక్ల పక్షం లో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు , మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షం లో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్య కు పూర్తి ఉపవాసం ఉండాలి... ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం తాను శుధ్ధుడవటానికి మాత్రమే... ఇది ఒక వెసులుబాటు కాదు.
Courtesy : Vibhata Mitra Garu

 గురువుగారికి కృతజ్ఞతలతో