తిరిగి తమ ప్రయాణం మొదలు పెట్టిన ఇద్దరు స్నేహితులు ఎడారి చివరికి వచ్చాక పిరమిడ్లు దగ్గరకు వెళ్లే ముందు విడిపోతారు.
ఆల్కెమిస్ట్ తన దగ్గర ఉన్న బంగారం లో సగం ఆ కుర్రవాడికి ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి వెను తిరిగి వెళ్ళిపోతాడు.
దాంతో ఆ కుర్రవాడు కొంచెం బరువైన హృదయంతో తన ప్రయాణం కొనసాగిస్తాడు.
తన కలలో కనపడే పిరమిడ్లు కనపడగానే ముందు ఆశ్చర్య పోయినా , కలలో తనకు దొరికిన బంగారం అక్కడే వుంది అని భావించి ఒక చోటులో నిర్దిష్టంగా గుర్తులతో త్రవ్వడం మొదలు పెడతాడు.
అంతలో అక్కడికి ఒక ఎడారి దొంగల గుంపు వస్తుంది.
ఇతనిని బయటకు లాగి అతని వద్ద వున్నా బంగారం తమ స్వాధీనం చేసుకుని అక్కడ తవ్వకం చేస్తున్నందుకు అతనిని కొడతారు.
ఆ కుర్రవాడు తనకు వచ్చిన కల గురించి చెప్పి అక్కడ బంగారం దొరుకుతుంది అని చెపుతాడు.
ఆ దొంగల నాయకుడు పెద్దగా నవ్వి వీడెవడో పిచ్చివాడు, వదిలేయండి అంటాడు.
వాళ్ళు వెను తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ దొంగల నాయకుడు, కుర్రవాడికి హితబోధ చేస్తాడు. కలలో వచ్చేవి అన్నీ నిజం కాదు, నాకు దూరంగా వుండే దేశంలో ఒక పాడు పడిన చర్చిలో పలానా చోట తవ్వితే బంగారం, రత్నాలు దొరుకుతాయి అని వస్తుంది, కానీ నేను నీలా పిచ్చివాడిని కాదు కాబట్టి నా దేశాన్ని వదిలి పోను అని చెపుతాడు.
తనకు తగిలిన దెబ్బలతో సోష వచ్చి పడిపోయిన ఆ కుర్రవాడుకొంత సేపటికి తెప్పరిల్లి ఆనంద పడతాడు!
ఎందుకు ? తను వెతుకుతున్న నిధి ఎక్కడ ఉందొ అతనికి తెలిసిపోయింది.
***
వెనుకకు తన దేశం వచ్చి మన కధలో మొదటగా ఆ కుర్రవాడు పరిచయం అయిన ఆ పాడుపడిన చర్చిలో ఆ దొంగల నాయకుడు చెప్పిన చోట తవ్వడం మొదలు పెడతాడు. ఆ ప్రయత్నంలో అతని శ్రమ ఫలించి నిధి దొరుకుతుంది.
స్థూలంగా ఇది కధ!
సరే ఇందిలో ప్రజలు అంతగా మారిపోయేలా చేసినది ఏమిటి ?
ఈ కధ చదివిన వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏమిటి అంటే
ఆశపోతు రైతు కథ జ్ఞాపకం వచ్చింది .
అది ఏమిటి అంటే ?!