SEARCH

Thursday 8 June 2017

ది అల్కెమిస్ట్ ! - పరశువేది

పావులో కోహిలో (Paulo Coelho)అనగానే గుర్తుకు వచ్చే ఒక మాట, "ది అల్కెమిస్ట్ !" 1988 లో వెలువడిన ఈ పుస్తకం ఇప్పటికీ ఎంతోమందితో చదివింప చేసేదే,
ఈ రచయిత ఒక  బ్రెజిల్ దేశస్థుడు.  పోర్చుగల్ భాషలో ఇతను వ్రాసే ప్రతీ కధ ప్రపంచం లోని ఎక్కువ భాషలలోకి అనువాదం చేయబడుతున్నాయి.
  దీని తెలుగు అనువాదం పరశువేది పేరుతొ వెలువడింది. 
ఈ పుస్తకం చదివిన చాలామంది తమ సంపాదనా మార్గాలలో ఎదో ఒక మార్పు చేసాం అని చెప్పారు.
నిజంగా అంత మార్పు తెచ్చే విషయాలు ఏమిటి  అంటే....


ఒక కుర్రవాడు గొర్రెల మందను మేపుతూ  జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒక పెద్ద మందను తయారుచేసి ఒక మంచి జీవనం సాగించే స్థితికి దగ్గరలోనే ఉంటాడు.
రాత్రుళ్లు  ఒక పాత చర్చిలో నిద్రిస్తూ ఉంటాడు.
ఆ రాత్రి అతనికి,  ఎక్కడో దూరంలో ఎడారులలో పిరమిడ్ల వద్ద బంగారం దొరికినట్లు కల వస్తుంది.
ఆ కల రావడం అనేది  అదే మొదటిసారి కాదు, అంతకుముందు కూడా అనేకమార్లు అదే కల అతనికి వచ్చింది అని చెపుతాడు రచయిత.
పదే పదే, అదే కల !
ఇక ఆ కల సంగతి ఏమిటో తెలుసుకోవాలని ఆతను  బయలుదేరుతాడు.
తన గొర్రెల మంద అమ్మేసి వచ్చిన డబ్బుతో ఒక కొత్త పట్టణము చేరతాడు.
అక్కడినుంచి ఎడారిలోకి తన ప్రయాణం మొదలు పెట్టాలని అతని ఆలోచన.
అయితే అక్కడ పరిచయం అయిన ఒక వ్యక్తి చేతిలో మోసపోతాడు. తన వద్ద వున్న మొత్తం సొమ్ము పోగొట్టుకుంటాడు.
అక్కడ భాష రాదు, అక్కడ ఎవరూ తనకు తెలియదు, ఒక కొత్త ప్రదేశం చేతిలో చిల్లిగవ్వ లేదు!
తనకు వచ్చిన కలకోసం ముందుకు సాగడం దేవుడెరుగు, తిందామంటే తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టు బట్టలతో మిగిలాడు. . . .
అప్పుడు ఏమి చేయాలి ?  
ఇది అతని ముందు వున్న పెద్ద ప్రశ్న ?!
                                                                      ***
ఇతని పుస్తకంలో ఉండే కొటేషన్లు నిజమే అనిపిస్తాయి, జేవితంపైన సానుకూల దృక్పధం ఏర్పడేలా చేస్తాయి.
మచ్చుకి ఒకటి
"When you want something, all the universe conspires in helping you to achieve it."

నీ కోరిక నిజం అవ్వాలని విశ్వము కూడా కోరుకుని నీవు చేసే ప్రయత్నాలలో తన సహాయం అందిస్తుంది.
     

  

1 comment:

  1. నాకు గుర్తున్నంత వరకు ఇదే మూలం మీద కథ వ్రాయబడింది. "When you want something dearly, all the universe conspires in helping you to achieve it."

    ReplyDelete