SEARCH

Wednesday, 14 June 2017

ది అల్కెమిస్ట్ ! - పరశువేది - 3

Be brave. Take risks. Nothing can substitute experience.

"ధైర్యంగా ముందుకు అడుగువేయి , సాహసం చేయి, అనుభవం మించిన గురువు లేడు"

                                                                 ***
ఆ  ఒయాసిస్ వద్ద అతనికి ప్రేమను పంచే ఒక అమ్మాయి కలుస్తుంది. ఆమె ఇతని కధ అంతా విని అతని లక్ష్యం చేరుకోడానికి అతనిని ప్రోత్సహిస్తుంది.
అలాగే అతని ప్రయాణములో తోడు కోసం ఇంకో వ్యక్తి తారసపడతాడు. అతనే ఆల్కెమిస్ట్.
సరే అక్కడ కొద్ది రోజులు గడిపి ఆల్కెమిస్ట్ సహాయంతో ఎడారి దాటడానికి బయలుదేరతాడు మన హీరో!
అలా ఎడారి దాటుతూ వుండగా  దారి దోపిడీ దొంగలుగా భావించి ఒక బిడారు  నాయకుడు, వీరిని బంధిస్తాడు.
దొంగలు అంటే వారిని  చంపి పాడేయటమే ఇంక వేరే ఆలోచన ఉండదు ఆ నాయకుడికి.
అటువంటి వారి చేతులలోంచి బయట పడటానికి ఆల్కెమిస్ట్ ఏమి చేస్తాడంటే, ఈ కుర్రవాడికి అద్భుతమైన శక్తులు
వున్నాయి అని చెపుతాడు.
ఆ నాయకుడు ఏమిటి అని అడిగితె. ఈ కుర్రవాడు గాలిలో కలిసిపోగలడు అని చెపుతాడు.
ఈ కుర్రవాడు బిత్తరపోతాడు.
ఆ నాయకుడు సరే నీకు రెండురోజులు గడువు ఇస్తాను. గాలిలాగా మారి చూపించు, లేకపోతె తల తెగిపోతుంది  అని హెచ్చరిస్తాడు.
 ఆల్కెమిస్ట్ సహాయం చేయను ఇది నీ సమస్య  అని వదిలేస్తాడు       
మన హీరోకి ఏమి చేయాలో తెలియదు.
ఎప్పుడు ఏమి చేయాలో అప్పుడు జీవితం లోని పేజీ కదిలి మనకు తెలుస్తుంది అని మాత్రం చెపుతాడు.
ఆ కుర్రవాడు రెండురోజుల తరువాత గాలిలో కలవడానికి  ఆ బిడారు నాయకుడి ముందుకు తీసుకు రాబడతాడు.
ఆ కుర్రవాడు అక్కడ పాతిన ఒక పొడవైన కర్రపైన పాకుతూ ఎక్కి గాలిలో కలవడానికి తన ప్రయత్నం మొదలు పెడతాడు. ఇక్కడ ఈ సంఘటనను బాగా వివరిస్తాడు రచయిత!.
ఆ కుర్రవాడి పయత్నంలో ఎవరు ఎలా ప్రవర్తించారో ఆ నాయకుడు గుర్తు పెట్టుకుంటాడు.
ఆ కుర్రవాడు తన ప్రయత్నంలో సఫలుడు అవుతాడు.
దాంతో స్నేహితులు ఇద్దరికీ  అక్కడ ప్రశంసలతో పాటు, విముక్తి లభిస్తుంది.......
     



     

No comments:

Post a Comment