Tell your heart that the fear of suffering is worse than the suffering itself. And no heart has ever suffered when it goes in search of its dream.
"నువ్వు కోరుకునే విజయం, వెతికే పనిలో ఎదురయ్యే కష్టాలు, నీకు కష్టాలుగానే అనిపించవు. భయం వల్లే వచ్చే కష్టాలు, నిజమైన కష్టాలు కన్నా అధికం."
***
అలా మొత్తం కోల్పోయిన మన హీరో ఒక గాజు సామాగ్రి అమ్మే షాపులో సహాయకునిగా చేరతాడు.
ఆ షాపు ఒక కొండ గుట్టపైన ఉంటుంది. ఆ షాపులో జరిగే వ్యాపారం ఆ ప్రదేశానికి వచ్చే పర్యాటకులపైన ఆధారపడి ఉంటుంది. మరి ఎక్కువమంది జనం వస్తే ఎక్కువ సంపాదన కాబట్టి ఆ కుర్రవాడు ఇచ్చిన సలహాతో షాపు యజమాని గుట్టపైకి మార్గం సూచిస్తూ గుర్తులు పెట్టి ఇంకా ఇతర విధాలుగా ప్రయత్నిస్తాడు.
దానితో అతని ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
ఆ కుర్రవాడు గొర్రెలు మేపేవాడు కాబట్టి , ఆ అనుభవంతోనే అతను తాను చేసే కొత్త పనులు కానీ, కొత్త పరిచయాలు కానీ బేరీజు వేసి జీవనం సాగిస్తూ ఉంటాడు.
సరే, షాపు యజమాని ఇతనిని బాగా చూసుకుంటూ ఉంటాడు, కొంత ధనం సమకూరాక, ఈ కుర్రవాడు తాను అక్కడి నుంచి వెళ్లే సమయం వచ్చింది అని చెప్పి వెళ్ళిపోడానికి సిద్ధం అవుతాడు.
షాపు యజమాని చాలా బ్రతిమాలుతాడు. కానీ అతని మాటలు వినడు. ఇతని లక్ష్యం వేరు కదా !?
***
అక్కడి నుంచి బయలుదేరి ఒక ఎడారి చేరుకొని దానిలో నీటి లభ్యత కల ప్రదేశానికి చేరుకుంటాడు.
అంటే ఒక ఒయాసిస్ వద్దకు చేరుతాడు. ఎడారుల్లో రకరకాల మనుషులు తిరుగుతూ వుంటారు. దొంగలు, వ్యాపారాలు, రాజులూ, ప్రయాణికులు ఇలా...
ఎడారిలో అందరికీ వుండే ఒక ఒప్పందం ఏమిటి అంటే ఒయాసిస్సుల వద్ద మాత్రం యుద్ధాలు చేయకూడదు.
అలంటి చోట ఈ కుర్రవాడు కొన్ని రోజులు ఉండవలసి వస్తుంది.
ఇతని జీవితంలో మార్పులు తీసుకుని వచ్చే ఇద్దరు వ్యాక్తులు తారసపడతారు అతనికి , అక్కడ !

No comments:
Post a Comment