SEARCH

Monday 27 October 2014

జీవిత భాగస్వాముల మధ్య డబ్బు వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు

డబ్బు మహా చెడ్డదని వేదాంతులు ఎప్పటినుంచో చెబుతున్న మాట. స్నేహితులను విడదీస్తుంది, భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతుంది. డబ్బు వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తలెత్తే పరిణామాలివి. మిత్రులు, జీవిత భాగస్వాముల మధ్య అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు. 

ఎందరో దంపతుల మధ్య డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒకరు దాచుకుందాం అంటే, మరొకరు ఖర్చు పెడదాం అంటారు. అలాంటప్పుడే తగవు మొదలవుతుంది. అలా కాకుండా, ఇద్దరూ కూర్చుని ఓ బడ్జెట్ రూపొందించుకోవాలి. ఎంత దాచుకోవాలి? ఎంత ఖర్చు చేయాలి? అన్న విషయమై ఓ అవగాహనకు రావాలి. 

భవిష్యత్తుకు సంబంధించి కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎవరికివారు లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా, ఉమ్మడి లక్ష్యం కోసం పాటుపడాలి. అంతేగాకుండా, ఓ ఇల్లు కొంటున్నా, ఓ కారు కొంటున్నా గానీ... భాగస్వామి సలహా ముఖ్యమన్న విషయం విస్మరించకూడదు. ఇలాంటి సమష్టి నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి. 

జీతం రాగానే బడ్జెట్ రూపొందించుకోవడం ఉత్తమం. ఎవరి జీతం దేనికి ఖర్చు చేయాలి? ఎవరి జీతంలో ఎంత దాయాలి? అన్న విషయాల్లో స్పష్టత ఉంటే భవిష్యత్తు ఇక ఆనందదాయకమే!

No comments:

Post a Comment