SEARCH

Wednesday, 31 December 2014

ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?


అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు. 

ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.


గురువుగారికి కృతజ్ఞతలతో 

Monday, 29 December 2014

ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?..

ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు కాని పటాలు కానీ ఏ దేవాలయం చెట్టు క్రిందో ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటారు. 

కానీ ఇలా చేయడంకన్నా ఉత్తమమైన మార్గం ఏంటంటే అటువంటి పటాలను అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది. 

అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం ఎంత మాత్రం అవసరం లేదు. అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు.

 కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు.
ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విసర్జించండి. ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా నీరు కలుషితం కాదు. 

అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి మనస్పూర్తిగా నమస్కరించి '' గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర '' అని వదిలేయండి.

ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ సమాచారం ఇవ్వండి. ధర్మ ఆచరణ చేయండి.ధర్మాన్ని కాపాడండి.

Saturday, 27 December 2014

చేబదులు ఇస్తేనే బాబో ! ఇంకా అప్పు ఇస్తే ?


డబ్బులు అప్పుగా ఇస్తాం కాని  వసూలు చేసుకోవడానికి పడే పాట్లు అన్ని ఇన్ని కావు 
సొంతవాడే అని ఇచ్చినా తిరిగి అడగడానికి మనం మొహమాటం పడి  అడగలేక అడిగితే,  నేనే చెపుదామనుకున్టున్నాను, త్వరలోనే ఇచ్చేస్తా అంటాడు.  
ఆ త్వరగా ఎప్పుడు వస్తుందో తెలియదు . 
మళ్ళి అడిగితే  పారిపోతాన అంటాడు.  

అదుగో అలాంటప్పుడు గుర్తుకొచ్చిన  వేమన పద్యం !  

కానివాని చేతగాసు వీసంబిచ్చి 
వెంట దిరుగువాడె వెఱ్రివాడు 
పిల్లితిన్న కోడి పిలిచినా పలుకునా 
విశ్వదాభిరామ వినుర వేమా ! " 

అర్ధం  ఏమిటంటే  : - 
" హీనునకు వడ్డీ కొఱకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రి వాడు.
పిల్లిచే తినబడిన కోడి పిలిస్తే వస్తుందా ? వేమా....రాదని  భావము . " 


ఇలాగ భోజనము చేయండి !



ఆకులమీద, ఇనుపపీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు. డబ్బును ఆశించేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకులో మాత్రమె భోజనం చేయాలి. భోజనానికి ముందూ తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసేముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి. 

ఎన్ని సార్లు భోజనము  చేయాలి ?
ప్రతిరోజూ రెండుసార్లు భోజనము చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది.


భోజనము ఏవైపు తిరిగి చేయాలి?
 భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. అలాగే దక్షిణదిశగా తిరిగి భోజనము చేస్తే కీర్తి, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున భోజనం చేయకూడదని పురాణాలలో ఉంది. కనుక తూర్పువైపు తిరిగి భోజనం చేయటం అనేది చాలా ఉత్తమమైన పధ్ధతి.

గురువుగారికి నమస్కారములుతో 

Saturday, 20 December 2014

మన పనుల ఫలితం - ముళ్ళు ?!

మనకు దగ్గరైన వారందరు మనవారు కాదు !
మనసుకు దగ్గరైన వారందరూ మంచివారూ కాదు ?!

ఎప్పుడైతే బుద్ధికి తోచినట్లు కాక మనసుకు తోచినట్లు చేస్తామో అది తప్పైనా మనం బాధపడం పైగా గర్వపడతాం. 
కాని ఒక రోజు తప్పకవస్తుంది.  మనం చేసిన తప్పు,  మనల్ని గునపంలా కాకపోయినా ముల్లుగా నైనా  గుచ్చుతుంది. 
ఆరోజు  మనం ఎంత వగచినా, చేసిన తప్పును సరి దిద్దుకొలేం, మరచిపొనూలేం!
అందుకే మంచి లేదా చెడు చేసేప్పుడు ఆలోచించాలి.

ఆలేస్యం అయిన తప్పు కాదు అసలు పని చేయక పోవడమే తప్పు !

Wednesday, 17 December 2014

పులుపు మంచిదే !

చూస్తే  నోరూరుతుంది తింటే పులుపు తిననె తినలేం,  అంటూ   నారింజ పళ్ళ గురించి చిన్నతనంలో  చదివిన ఒక పద్యం గుర్తుకు వచ్చింది.  

పుల్లగా ఉండే ఫలాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిమ్మ, ఉసిరి, జామ, ఆపిల్ వంటి ఫలాల్లో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రక్తం వృద్ధి చెందడానికి విటమిన్ సి ఎంతో దోహదం చేస్తుంది. 
చాలా మంది పులుపును తక్కువగా ఇష్టపడతారు. అది సరికాదంటున్నారు నిపుణులు. 

రక్తం తక్కువైన సందర్భాల్లో డాక్టర్లు ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలని సూచించడం తెలిసిందే. 

అయితే, మనం తీసుకున్న ఐరన్ రక్తవృద్ధికి తోడ్పడాలంటే విటమిన్ సి సాయం తప్పనిసరి. విటమిన్ సి లేకపోతే మనం స్వీకరించే ఐరన్ తగిన మోతాదులో శరీరానికి అందదు. దాంతో, రక్తవృద్ధి సాధ్యం కాదంటున్నారు నిపుణులు. విటమిన్ సి లోపిస్తే రక్తం గడ్డడం చాలా ఆలస్యమవుతుంది. అంతేగాకుండా, రక్తహీనత కలిగి నీరసం వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. భారత్ లో 70 శాతం మంది విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారట.
పులుపు  మంచిదే ! మరి తినడం మొదలు పెడదాం.   పుల్ల చింతపండు కాదండోయ్ ! 
విరోచనకారి !

Monday, 15 December 2014

దేవుడు నీకు కనపడకపోతే లేనట్లేనా ?



ఓసారి ఓకాయన జుట్టు పెరిగితే, ఓ బార్బరు షాపు వెళ్ళి కూర్చున్నాడు.
ఆ కార్మికుడు ఈయన జుట్టు కత్తిరిస్తూ, "ఏమిటో సార్! జీవితం దుర్భరమవుతోంది. "దేవుడు" లేడు అనే నిశ్చయానికి వచ్చేశాను. లేకపోతే ఇన్ని అక్రమాలు, అరాచకాలు ఎందుకు జరుగుతాయి? ఆయన ఉంటే, ఇంత గోలలు ఎందుకు జరుగుతాయి? దేవుడు లేడు" అని నిరాశవాదంతో వచ్చినాయన పని ముగించాడు.
ఈయన బయటకు వెళ్ళి ఓ సారి తొంగి చూచి " ఇదిగో చూడు "బార్బర్లు కూడా లేరు" అన్నాడు.
" అదేమిటి? నేను ఇప్పుడేగా మీ పని చేసిపెట్టాను. బార్బర్లం ఉన్నాం" అన్నాడు.
"ఉంటే అడుగో ఆయనను చూడు. గడ్డం, మీసం, జుట్టు పెరిగి ఎలా ఉన్నాడో! బార్బర్లు ఉంటే ఆయన అలా ఎందుకు వుంటాడు." అన్నాడు.
"అదేమిటి! ఆయన నాదగ్గరకు రాలేదు! వస్తే, మీలాగే ఆయనకు అలాగే పని చేసి పెట్టేవాణ్నే." అన్నాడు,
" అవును! దేవుడు అంతే! నీకు దేవుడు సహాయం కావలసివస్తే, ఆయన దగ్గరకు వెళ్ళకపోతే ఎలా?
ఆయన దగ్గరకి వెళ్ళి ప్రార్ధించు. నీకు కావలసిన సహాయం ఆయన నీకు చేస్తాడు. " అని ఆయన బయటకు నడిచాడు.

దేవుడు నీకు  కనపడకపోతే లేనట్లేనా ? దేవుడు వున్నాడు.

గురువుగారికి కృతజ్ఞతలతో 

Saturday, 13 December 2014

నల్లధనం చెలామణికి అడ్డుకట్ట - పాన్, ఆధార్ కార్డులకు అనుసంధానం

రూ.1 లక్షకు పైగా విలువైన కొనుగోళ్లు జరపాలంటే,ఆధార్, పాన్ కార్డులను వెంట తీసుకెళ్లండి ఈ రెండింటిలో దేనినో, ఒకదానిని షాపింగ్లో  చూపించాల్సి ఉంటుంది. నల్లధనం వెలికితీతకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతిపాదించిన ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

త్వరలోనే ఈ నిబంధనను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాక ఆయా వ్యక్తులు వివిధ సందర్భాల్లో తమ గుర్తింపు కోసం చూపుతున్న డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు తదితరాలను కూడా పాన్, ఆధార్ కార్డులకు అనుసంధానించాలని కేంద్రం యోచిస్తోంది. 

Tuesday, 9 December 2014

స్వచ్ఛభారతు - బుద్ధిమాన్ భారత్


అంతట నిండివున్న నన్ను ఎలా కాదనగలవు ?
అజ్ఞానం, మూర్ఖత గురించి నేను తలచుకున్నపుడు ఉదాహరణలు  కోకొల్లలు
పిల్లలను బడి వద్ద వదిలి వస్తున్నపుడు నా ముందు ఆగిన వాహనం నడిపే వ్యక్తి  సరిగా సంభాలించలేక వెనుకనున్న నా వాహనాన్ని డ్హీ  కొట్టాడు . పిల్లలు తూలీ పడబోయారు ,  నేను ఇంకా ఏమి అనకుండానే  దారికడ్డంగా ఎలా ఆపుతావు చూడు  నీవల్ల వెనుకాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని మొదలు పెట్టాడు.
ఆహా ! క్షమాపణలు ఇలా చెపుతారా అని ఆశ్చర్యపోక ఇంక చేసేదేమివుంది ?
స్వచ్ఛభారతుకాక  బుద్ధిమాన్ భారత్ మొదలు పెట్టమని కోరుతున్నా
 ఎందుకంటే చదువు కున్న వాళ్ళే వాదినలో గెలవాలని చూస్తున్నారు కాని, తగవులు కూడదని  తెలుసుకోవటలేదు.
ఇక్కడే ఇంకొక విషయం,  విడాకులు  కోరుతున్న వారిలో ఎక్కువ  విద్యాధికులేనట !
సరే ముందుకు బయలు దేరితే ఆటో వాడు అడ్డు వచ్చాడని గొడవ పడుతున్నాడు ఇంకో  వాహన దారుడు
భాగ్యనగర వారసులు వాళ్ళేనని  ఇంకా తెలిసినట్లు లేదు !

జ్యోతితో ఇంకొక జ్యోతిని వెలిగించవచ్చు
నీటితో వెలుగు  కుదరదు
జ్ఞానినుంచే జ్ఞానసముపార్జన చేయవచ్చు
అంధుడు ఇంకొక అందునకు దారిచూపలేడు  కదా !
అ ప్రదేశంలోనే చాల కాలంగా వున్నా సరే

Monday, 8 December 2014

శ్రీ దత్త శరణం మమ



శ్రీ దత్త చరణం శరణం మమ 

దత్తత్రేయులవారిని తలచుకుంటే మూడు  ముఖముల మూర్తి కనిపిస్తారు. కాని వారిని ధ్యానిన్చినపుడు మన సాధన లో పరిపక్వత వచ్చినపుడు ఏక ముఖము తో మనకు దర్శనం ఒసగుతారని విన్నాను. 





త్రిముఖ దత్తాత్రేయుల వారు 





ఏక ముఖ దత్తాత్రేయుల వారి రూపం.

సర్వులకూ  శుభములు చెకూర్చమని ప్రార్ధనలతో
ఇతి సమ్ !


Friday, 5 December 2014

నీకై వేచివున్న నీ నేను !

నువ్వు వస్తావని నేను చూసే ఎదురుచూపుల్లో నీ కరకు చూపుల చురకత్తులు  గుచ్చుతావు
నీ ఓదార్పు ఆస్వాసనకై వేచి ఉన్న నాకు నీ కఠిన శల్య సదృశ ఘాతలే విసురుతావు
 నువ్వు చిందించే చిరునవ్వుల్లో నన్ను చూసుకుని మురిసిపోదామంటే నవ్వే తెలియని గ్రీష్మానివవుతావు
నా చిన్నచిన్న కోరికలు తీర్చే సమయం లేని నీవు నా జీవిత శరత్తుగా ఎప్పుడు మారతావు ?!

Thursday, 4 December 2014

పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .
”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ” అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .


గురువుగారికి నమస్కారములతో 

Monday, 1 December 2014

విండ్ ట్రీలు - పవన విద్యుత్తు

 ఫ్రాన్స్ లోని బ్రిటన్ కు చెందిన ఓ ఇంజినీర్ల బృందం మూడేళ్లపాటు రకరకాల ప్రయోగాలు చేసి విండ్ ట్రీను తయారు చేసింది. 'విండ్ ట్రీ' పేరుతో వచ్చే ఏడాది ఈ చెట్లు మార్కెట్లోకి రానున్నాయి. 26 అడుగుల ఎత్తుండే ఒక్కో చెట్టు ధర రూ. 20 లక్షలకు పైగానే ఉంటుంది. ఒక్కసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు... జీవితాంతం కరెంటును పొందవచ్చని దీన్ని తయారు చేస్తున్న కంపెనీ ప్రకటిస్తోంది.
విండ్ ట్రీలు నిజంగా చెట్లు కావు. ఇవి చెట్ల ఆకారంలో ఉన్న గాలి మరలు. ఆకుల స్థానంలో దీర్ఘవృత్తాకారంలో ఉన్న టర్బైన్లు ఉంటాయి. గాలి వీచినప్పుడల్లా ఇవి తిరుగుతాయి. అప్పుడు టర్బైన్లలో ఉండే పలుచటి బ్లేడ్లలో కదలికలు ఏర్పడి కరెంటు ఉత్పత్తి అవుతుంది. గాలి ఏ దిశలో వీచినా బ్లేడ్లు కదలడం ఈ చెట్ల గొప్పదనం. సాధారణంగా 8 మైళ్ల వేగంతో గాలులు వీస్తే తప్ప పవన విద్యుత్తును ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. కానీ, విండ్ ట్రీతో కరెంటును ఉత్పత్తి చేయాలంటే, కేవలం 4.5 మైళ్ల వేగంతో గాలి వీస్తే చాలు. విశాలమైన, ఎత్తైన ప్రదేశాల్లోనే కాకుండా... ఇంటి దగ్గర, రోడ్ల కూడళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.

Sunday, 30 November 2014

గౌతమీ గ్రంధాలయం - వివేకానందుల వారు - ఎన్సైక్లోపీడియా

గోదావరి బ్లాగ్ లో గౌతమీ గ్రంధాలయం గురించి చదివినపుడు నాకున్న అనుబంధం  గుర్తుకు వచ్చింది,
 అందరూ  వార్తా పత్రికలు  చదవడానికి వెళితే, నేను కధల పుస్తకాలు  చదవడానికి వెళ్ళే వాడిని.
పుస్తకాలు ఇంటికి తీసుకుని వెళ్లి చదివే సమయం వచ్చేప్పటికి, రోజుకు  రెండు పుస్తకాలు  చదివేవాడిని.
ఒకరోజు పొద్దునే వెళ్లి రెండు పుస్తకాలు తీసుకుని వెళ్లి, సాయంత్రం వెళ్లి పొద్దున్న చదివిన పుస్తకాలని ఇచ్చి , ఇంకో రెండు పుస్తకాలు తీసుకుందామని అనుకుంటే  లైబ్రరియన్ , బాబు ! రోజుకు రెండు పుస్తకాలే ఇస్తారు, అన్నారు.
చేసేది లేక వేనుతిరిగాం.  ఆ సంగతి మా స్నేహితుడు ఇప్పుడు కూడ  గుర్తు చేస్తూ  భలే  భయపెట్టావు  కదరా ! అంటూ ఉంటాడు.
వాళ్ళు వార్తలు చదివే సమయంలో నేనో నవల చదివేసేవాడిని !

సరే! వివేకానందుల వారు  ఎన్సైక్లోపీడియా  ఆఫ్ బ్రిటానిక ఒక్క రాత్రిలో ఎలా చదివేసారో మీకు తెలుసా !
కొంతమంది అక్షరం, అక్షరం లేదా వాక్యం తరువాత వాక్యం , వరుస తరువాత వరుస ఇంకొంతమంది పేరా నుంచి పేరా .  కాని  ఈయన మాత్రం  పేజీ  నుంచి పేజీ చదివేవారట
అంటే పేజీలో మొదటి వరుస చివరి వరుస చదివి మొత్తం పేజిలో వున్నసంగతి అర్థం చేసుకునేవారన్నమాట
మొదటి సారి ఈ విషయం తెలిసినపుడు అదేం  గొప్ప విషయం నేను అంతే  బాగోని కధలు చదివేప్పుడు అలాగే చదివేస్తా అనుకున్నాను.
కాని ఆయనతో  మనకు పోలికేమిటి !
ధన్యవాదాలు  విశ్వనాదుగారు గౌతమీ   గ్రంధాలయం గురించి నాకు గుర్తు చేసినందుకు.  

Friday, 28 November 2014

Doctor ? Doctor !


సింహం - గ్రామ సింహం

నిన్న మాటల మధ్యలో మర్క ట  కిశోర న్యాయం , మార్జాల  కిశోర న్యాయం  గురించి  వచ్చి ఇలా  తెలుగులో  ఇంకా పదాలు ఏమి వున్నాయి అంటే  గ్రామ సింహం  అన్నాను.
మావాడు నన్ను గ్రామ సింహం  అంటే తెలిసే వాడుతున్నావా ? అని అడిగాడు .
అడవిలో  సింహం  గ్రామం లో గ్రామ సింహం అన్నాను. పెద్ద తెలిసినట్లు
అప్పుడు మావాడు ఒక విషయం  చెప్పాడు.
సీమ సింహం,సింహం   ఇలాగ ఒకటే సింహం సినిమాలు ఇప్పుడు వచ్చినట్లే,  ముందు కుడా సింహబలుడు  మొదలగు సింహం సినిమాలు వచ్చినపుడు  ఒక నిర్మాత  నటసేఖరునితో   గ్రామ సింహం  సినిమా తీస్తానంటే
పక్కనే  వున్న రచయితతో గ్రామ సింహం అంటే ఏమిటో అర్ధం అయ్యేలా చెప్పించారట.  ఆ నిర్మాత మళ్లీ  కనపడలేదట.

సరే నాకు  గ్రామ సింహంగురించి  చెప్పు అని  గట్టిగా అంటే
వూర కుక్కరా  నాయనా ! అన్నాడు
ఇంకేం మాట్లాడతాం ?!

Thursday, 27 November 2014

One real time moving show


15 వసంతాల పైబడిన వాహనాలు జాగ్రత్త !

కాలుష్య నివారణ చర్యలలో భాగంగా  డిల్లీ  రోడ్లపై ఇక 15 వసంతాల పైబడిన వాహనాలు తిరగకుండా  చూస్తారట
వాయు కాలుష్యం బాగా పెరిగిపోయిన సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ఈ ఆదేశాలు జారీచేసింది
కాబట్టి  15 వసంతాల పైబడిన వాహనాలు జాగ్రత్త
త్వరలోనే ఇలాంటిదేదో  మనకు వస్తే  చాల బాగుంటుంది కదా !

సరే మీకో విషయం తెలుసా గుడ్డు ముందా పిల్ల ముందా అని ఆడిగితే  ఇంక తెల్ల మొహం వేయక్కర్లేదు
పిల్లే ముందు  ఎందుకంటే శాస్త్రవేత్తలు  కనిపెట్టిన విషయం అది
ఎలా అంటే  గుడ్డు తయ్యారు కావాలంటే కావలసిన విషయాలు కోడి కడుపులోనే ఉన్నాయిట .

Wednesday, 26 November 2014

INDIA or BHARAT

BHARAT , HINDUSTAN , JAMBU DWEEP Etc ., are the names of our beloved Country once in past as well.

Do you Know how India is named

INDIA - INDEPENDENT NATION DECLARED IN AUGUST

It is the name given by Britishers  and short form of our country INDIA

So, now tell me after knowing this do we have to fight for change of our nation name as BHARAT or
not


టీవీ సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ ద్వారా వై-ఫై నెట్ వర్క్




జర్మన్ శాస్త్రవేత్తలు టీవీ సిగ్నళ్లతో ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ సిగ్నళ్ల ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ స్థాయిలో ఉండే టీవీ ఫ్రీక్వెన్సీ సిగ్నళ్లు గోడల్లాంటి అడ్డంకులను కూడా అధిగమించి దూసుకుపోతాయని, దీంతో మొబైల్ లాంటి వాటికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. 

ఈ పరిశోధనలు ఫలిస్తే ఇంటర్నెట్ వినియోగించేవారి ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు కూడా వైర్ లెస్ ల్యాన్ అందే వెసులుబాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తే అందరికీ నెట్ అందుబాటులో ఉంటుందని వారు వివరించారు.

Two sizzling toons !!




The following two pics which I got on whatsup thought to share the same with you all




Tuesday, 25 November 2014

పొగ రాయుళ్ళ ను కాపాడతారా !



విడిగా  సిగరెట్ల విక్రయాలను ఆపేస్తారట , పొగ త్రాగే వారి అర్హత వయస్సు పెంచుతారట !
మన ప్రభుత్వానికి  ఇచ్చిన సలహాలను  పాటించి  పొగాకు ఉత్పత్తులను వాడటం  తగ్గిస్తారుట .

 అదికూడా  నిదానంగా  చేస్తారుట

ఆహా ! ఎంత మంచి నిర్ణయం. 

పొగాకు ఉత్పత్తులఫై హెచ్హరికలు  తరువాత

నిషిద్ధ ప్రాంతాలు ,జరిమానాలు

సినిమా ప్రదర్శనకు ముందు భయంకర  ప్రకటనలు , పొగ త్రాగే సన్నివేశాలలో  హెచ్హరికలు

ఇంకా ఎంత సమయం కావాలో ! పూర్తి నిషేధానికి

Monday, 24 November 2014

సారీ! చెపితే తప్పా ?!


క్షమాగుణం దైవీలక్షణం అని పెద్దలు అంటారు 

తప్పు చేసి క్షమించమనడం మనకు అలవాటే,  కాని ఒక్కో సారి   సారీ ! అనల్సివస్తుంది 
సారీ! చెపితే నువ్వు తప్పు చేసినట్లు కాదు అలాగని ఎదుటివాడు ఒప్పు కాదు 
క్షమించమని అడిగితె నువ్వు అనుబంధానికి విలువ ఇచినట్టు  
అలాంటప్పుడే మనలోని మనీషి   బయటకు వచ్చి  ఇంకా మనం చేయవలసినవి వున్నాయి  అని గుర్తు  చేస్తుంటాడు  అక్కడే ఆగిపోక  సాగాలి ముందుకు . 

ఎదుటి వ్యక్తీ   నిన్ను వదులుకోడు !
మంచిని  వదిలిపెడితే  జీవితం అదుపు తప్పుతుంది కదా !?

Friday, 21 November 2014

మూడో భాషగా సంస్కృతం !?

కేంద్రీయ విద్యాలయాల నుంచి మూడో భాషగా కొనసాగుతున్న జర్మనీని తొలగించే విషయంలో విజయం సాధించిన ఆరెస్సెస్ అనుబంధ విభాగం సంస్కృత భారతి, తాజాగా కేంద్రం ముందు మరో ప్రతిపాదనను పెట్టింది. దేశంలోని సీబీఎస్ఈ సిలబస్ తో కొనసాగుతున్న అన్ని విద్యాలయాల్లో ఇకపై సంస్కృతాన్ని మూడో భాషగా తప్పనిసరి చేయాలని ఆ సంస్థ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరింది.

Monday, 17 November 2014

కుటుంబ సభ్యులు శ్రద్ధ - పెంపకం ఎదుగుదలలో ఉదాహరణలు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రతిభ ఉన్నా పరిస్థితుల కారణంగా మసకబారిన వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. కష్టాన్నే నమ్ముకుని సచిన్ అంచెలంచెలుగా పైకెదిగాడు. రికార్డుల రారాజు అయ్యాడు. కానీ, కాంబ్లీ ఒక్కసారిగా వచ్చిపడ్డ పేరుప్రతిష్ఠలతో దారి తప్పాడు. ఫలితం, కెరీర్ పతనం దిశగా సాగింది. ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక సచిన్ ను కాంబ్లీ గురించి వ్యాఖ్యానించమని కోరింది. దీనికి మాస్టర్ బదులిస్తూ, పరస్పరం విభిన్నమైన వ్యక్తులమని పేర్కొన్నాడు. వివిధ రకాల పరిస్థితుల పట్ల వేర్వేరు రీతుల్లో తాము స్పందిస్తామన్నాడు. అయితే, ప్రతిభ గురించి మాట్లాడబోనని, అది తనకు సంబంధించిన విషయం కాదని అన్నాడు. ముఖ్యంగా, కుటుంబ సభ్యులు తనపై ఎప్పుడూ శ్రద్ధ వహించేవారని, తాను నేల విడిచి సాము చేయకుండా వారే నియంత్రించేవారని సచిన్ చెప్పుకొచ్చాడు. పెంపకం తన ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషించిందన్న కోణంలో అభిప్రాయాలు వెలిబుచ్చాడు సచిన్. అయితే, ఈ విషయంలో కాంబ్లీ గురించి మాట్లాడలేనని తెలిపాడు.

విజయవాడలో రాత్రినగర సంచారం - గుర్తింపు కార్డులు ఉంటేనే!?

విజయవాడ నగరంలో ఇకపై రాత్రి సంచరించాలంటే గుర్తింపు కార్డులుండాల్సిందే. ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరిట బెజవాడ పోలీసులు ఆదివారం రాత్రి ప్రారంభించిన సరికొత్త భద్రతా చర్యలు నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆదివారం రాత్రి దాదాపు 200 మందికి పైగా నగరవాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల అదుపులోని వారిలో దినసరి కూలీలే అధికంగా ఉన్నారని సమాచారం.

కేవలం గుర్తింపు కార్డులు లేని కారణంగానే వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయితే దినసరి కూలీలుగా కాలం వెళ్లదీస్తున్న తాము గుర్తింపు కార్డులను ఎలా వెంటబెట్టుకుని వెళతామంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తాజా ఆపరేషన్ నేపథ్యంలో రాత్రి 11 గంటలు దాటితే బయటకు వచ్చేందుకు నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే నగరంలో నేరాలను కట్టడి చేసేందుకే నైట్ డామినేషన్ ఆపరేషన్ కు తెర తీసినట్లు నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సెలవలు వాడుకుంటున్నారా ? పని చేస్తున్నారా ?

సెలవులొస్తే ఏం చేస్తాం? సరదాగా కుటుంబంతో గడపడమో, లేకపోతే దూరాన ఉన్న తల్లిదండ్రులను పలకరించడమో చేస్తాం. అయితే ఇటీవల కాలంలో సెలవులను హైదరాబాదీలు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు, బంధుమిత్రులను కలిసేందుకే వినియోగిస్తున్నారట. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ఎక్స్ పెడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.

పెళ్లిళ్లకు వెళ్లేందుకు హైదరాబాదీలు పక్కా ప్రణాళికలు రచించుకుంటారని కూడా ఈ సర్వే తేల్చింది. ఇక సెలవులను వాడుకోని వారు హైదరాబాద్ లో 52 శాతం ఉన్నారు. సెలవుల కన్నా, వేతనం పెరిగితే బాగుంటుందని 67 శాతం మంది హైదరాబాదీలు భావిస్తున్నారు. ముంబై వాసులు మాత్రం సెలవులను వాడుకునేందుకు బదులు పనిచేసేందుకే ప్రాధాన్యమిస్తారని తేలింది. బెంగళూరు వాసులు కూడా ముంబైకర్ల బాటలోనే నడుస్తున్నారు. వీరికి భిన్నంగా సెలవులను సరదాగా గడిపేందుకే ఢిల్లీ వాసులు ప్రాధాన్యమిస్తున్నారు.


Saturday, 15 November 2014

రంగారెడ్డి జిల్లా రియల్ బూం మళ్లీ !

ఉమ్మడి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బూంలో రంగారెడ్డి జిల్లాదే అగ్రస్థానం. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచే ఉమ్మడి రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఆదాయంలో సగాన సగం వచ్చేది. అయితే రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో రియల్ బూం పడకేసింది. సగం కాదు కదా నాలుగో వంతు ఆదాయం కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నది అదికారులు వాదన. ఇప్పటికే దాదాపు 50 శాతం మేర (49.55) ఆదాయం పడిపోయింది. తొలి ఆరు నెలల్లోనే ఈ మేర ఆదాయం పడిపోవడంపై అటు అధికార వర్గాలతో పాటుే తెలంగాణ సర్కారు కూడా ఆందోళనలో కూరుకుపోయింది.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి రూ.2,361.69 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం తొలి ఆరు నెలల్లో రూ.1,346.16 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.690.84 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. ఈ ఆదాయం సర్కారు లక్ష్యంలో 51.75 శాతం మాత్రమే. ఈ తగ్గుదల విభజన ప్రభావం వల్లే నమోదైందన్న వాదన వినిపిస్తుండగా, త్వరలో రంగారెడ్డి జిల్లా రియల్ బూం మళ్లీ పుంజుకోవడం ఖాయమని కొందరు ఆశావహులు వాదిస్తున్నారు.

Friday, 14 November 2014

అంబాసిడర్,మారుతి 800 తరవాత హ్యుందాయ్

1990 దశకంలో భారత్ లోకి ప్రవేశించిన శాంత్రో కార్లు మారుతి 800కి ప్రధాన పోటీగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఈ మోడల్ కార్లకు వీడ్కోలు పలకాలని హ్యుందాయ్ నిర్ణయించింది.
కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కి ఇండియాలో ఘనమైన గుర్తింపును తెచ్చిన శాంత్రో కార్లు మార్కెట్ నుంచి కనుమరుగు కానున్నాయి. 
 ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇప్పటికే 13.6 లక్షల యూనిట్లను ఇండియాలో, 5.3 లక్షల యూనిట్లను విదేశాల్లో విక్రయించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నెలకు కేవలం 3 వేల శాంత్రో యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. నిల్వ ఉన్న శాంత్రో స్టాక్స్ అయిపోయే వరకు అమ్మకాలు సాగిస్తామని తెలిపారు. కాగా మారుతి సుజుకి సంస్థ సైతం తమ బ్రాండ్ 'మారుతి 800'కు వీడ్కోలు పలుకగా,
ఆల్టో ని ప్రారంభ శ్రేణి వాహనంగా  చేసింది . 
హిందూస్తాన్ మోటార్స్ 'అంబాసిడర్' తయారీని ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే.  



Tuesday, 4 November 2014

రికార్డ్ బద్దలు కొట్టిన సెన్సెక్స్

ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 28 వేల మార్క్ ను టచ్ చేసింది. ఇండియన్ ఎకానమీ బలపడుతోందన్న అంచనాలతో మార్కెట్లలోకి నిధుల ప్రవాహం భారీగా ఉండటంలో సెన్సెక్స్, నిఫ్టీలు ఉరకలేస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 28,006 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 8,363కి చేరుకుంది

ఇంతకీ దీనివల్ల ఎవరికి లాభం !?

Monday, 3 November 2014

శిరోజాల సంరక్షణ - హెన్నా (గోరింటాకు)


శిరోజాల సంరక్షణకు ప్రాముఖ్యతనిచ్చేవారికి హెన్నా (గోరింటాకు) గురించి పరిచయం చేయనక్కర్లేదు. తెల్లవెంట్రుకలున్న వారు దీనిని అత్యధికంగా వినియోగిస్తారు. ఇది కురులను ఆరోగ్యకరంగా ఉంచడంతోపాటు, కుదుళ్ల నుంచి బలంగా ఉండేట్టు చేస్తుంది. అంతేగాదు, జుట్టుకు మెరుపునిస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. నెలలో రోజుకు రెండుసార్లు తలకు ప్యాక్ వేయాలి. తద్వారా, దెబ్బతిన్న కురులు మరలా ఆరోగ్యకరంగా తయారవుతాయి. ఉసిరికాయల పొడి కలిపిన నీటిలో హెన్నాను రంగరించి మాడుకు పట్టిస్తే మంచి ఫలితాలు వస్తాయి. హెన్నా మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడడం ద్వారా జుట్టు చిక్కబడుతుంది. శిరోజాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది హెన్నా. 
తెల్ల వెంట్రుకలు నిరోధానికి :ఇక, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయని బాధపడేవారికి ఇది మంచి నేస్తం. నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి వేసి మరిగించాలి. దాంట్లో ఒక టీ స్పూన్ బ్లాక్ టీ, రెండు లవంగాలు వేసి బాగా కలియదిప్పాలి. అప్పుడు హెన్నా కలిపి చిక్కటి పేస్టులా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు కానీ, లేక, రాత్రంతా కానీ దాన్ని అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలకు అప్లై చేయాలి. దీన్ని పూయడం ద్వారా తెల్లవెంట్రుకలు కాసింత రంగు పులుముకుంటాయి.
చుండ్రు నిరోధానికి :
అన్నిటికంటే ముఖ్యంగా, హెన్నా చుండ్రుతో సమర్థంగా పోరాడుతుంది. రెండు టీ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బాలి. ఆవాల నూనెను మరిగించి గోరింట ఆకులను దాంట్లో వేయాలి. చల్లారిన తర్వాత మెంతుల చూర్ణాన్ని దానికి కలిపి మాడుకు పట్టించాలి. ఈ మిశ్రమం చుండ్రుపై బాగా పనిచేస్తుంది.

Thursday, 30 October 2014

పోస్ట్ చేసిన రోజే డెలివరీ?!

ఇంటర్నెట్ సేవల రంగ ప్రవేశంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తపాలా శాఖ బుధవారం సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ‘సేమ్ డే డెలివరీ’ పేరిట పోస్ట్ చేసిన రోజే ఉత్తరాలను బట్వాడా చేసే పథకాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. చిక్కడపల్లి పీఎన్ టీ కాలనీలోని తపాలా కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సేవల కోసం ఉద్దేశించిన మూడు వ్యాన్ లను తపాలా శాఖాధికారులు జెండా ఊపి ప్రారంభించారు.

ప్రస్తుతం జంట నగరాలకే పరిమితం కానున్న ఈ తరహా సేవలను రానున్న రోజుల్లో ఏపీ సర్కిల్ లోని అన్ని పట్టణాలకు విస్తరించనున్నట్లు ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. స్పీడ్ పోస్ట్ ఉత్తరాలను కూడా ఇకపై పోస్ట్ చేసిన రోజే బట్వాడా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

Wednesday, 29 October 2014

లైఫ్ లో సమతూకం

నేటికాలంలో వ్యక్తులు ఎన్నో ఒత్తిళ్ళ కారణంగా సతమతమవుతుంటారు. దీర్ఘకాలంలో ఈ ఒత్తిళ్ళ కారణంగా జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది. అయితే, లైఫ్ బ్యాలెన్స్ తప్పకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యం మనిషి ఎదుగదలకు కీలకం. మీ వ్యక్తిగత స్థితిగతులు కుటుంబంపైనా ప్రభావం చూపిస్తాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. 

లైఫ్ లో సమతూకం మిమ్మల్ని సంతోషం దిశగా నడిపిస్తుంది. మెరుగైన భవిష్యత్ దిశగా తీసుకెళుతుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలనన్న నమ్మకం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ లాభిస్తుంది. ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలి, పెద్ద ఇల్లు, లగ్జరీ కారు వంటి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో మీ మానసిక స్థయిర్యం కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాలెన్స్ డ్ గా ఉండేందుకు పక్కా ప్లానింగ్ అవసరం. కెరీర్లో కానివ్వండి, వ్యక్తిగత సంబంధాల విషయంలో కానివ్వండి... ప్రణాళికా బద్ధంగా నడుచుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వండి.

Tuesday, 28 October 2014

మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే అండాశయ క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువ

మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే అండాశయ క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువని ఈస్ట్ యాంగ్లియా విశ్వవిద్యాలయం తెలిపింది. మహిళల్లో క్యాన్సర్ కారకాలపై పరిశోధన చేసిన ఆ యూనివర్సిటీ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ పరిశోధనల కోసం 25-55 ఏళ్ల మధ్య ఉన్న 1,71,940 మంది మహిళలను పరిశీలించారు. సుమారు 30 ఏళ్ల నుంచి రోజూ రెండు కప్పుల టీ తాగుతున్న వారిపై ఈ పరిశోధన నిర్వహించారు. రెండు కప్పుల టీతో పాటు, తాజా పళ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని నిర్థారించారు.

Monday, 27 October 2014

అబ్బా! మళ్లీ ఆధార్


ఆధార్ సంఖ్యకు మొబైల్ సిమ్ ను కేంద్రం అనుసంధానించబోతున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఆర్ఎస్ శర్మ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, "యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కు మొబైల్ సిమ్ ను అనుసంధానించమని ప్రధానమంత్రి మాకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం దానిపైనే పని చేస్తున్నాము. కచ్చితంగా మేమీ సమస్యను పరిష్కరించుకోగల సామర్థ్యం ఉంది" అని సదరు సీనియర్ అధికారి వివరించారు. 

ఇలా చేయడం వలన లావాదేవీల సమాచారమంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. అదే గనుక జరిగితే భారతదేశ ప్రజల సాధికారత సాధనకు ఇది ఓ పరికరంగా ఉంటుందని ఢిల్లీలో జరిగిన ఎఫ్ఐసీసీఐ కార్యక్రమం అనంతరం మీడియాకు ఆ అధికారి వెల్లడించారు.

జీవిత భాగస్వాముల మధ్య డబ్బు వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు

డబ్బు మహా చెడ్డదని వేదాంతులు ఎప్పటినుంచో చెబుతున్న మాట. స్నేహితులను విడదీస్తుంది, భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతుంది. డబ్బు వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తలెత్తే పరిణామాలివి. మిత్రులు, జీవిత భాగస్వాముల మధ్య అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు. 

ఎందరో దంపతుల మధ్య డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒకరు దాచుకుందాం అంటే, మరొకరు ఖర్చు పెడదాం అంటారు. అలాంటప్పుడే తగవు మొదలవుతుంది. అలా కాకుండా, ఇద్దరూ కూర్చుని ఓ బడ్జెట్ రూపొందించుకోవాలి. ఎంత దాచుకోవాలి? ఎంత ఖర్చు చేయాలి? అన్న విషయమై ఓ అవగాహనకు రావాలి. 

భవిష్యత్తుకు సంబంధించి కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎవరికివారు లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా, ఉమ్మడి లక్ష్యం కోసం పాటుపడాలి. అంతేగాకుండా, ఓ ఇల్లు కొంటున్నా, ఓ కారు కొంటున్నా గానీ... భాగస్వామి సలహా ముఖ్యమన్న విషయం విస్మరించకూడదు. ఇలాంటి సమష్టి నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి. 

జీతం రాగానే బడ్జెట్ రూపొందించుకోవడం ఉత్తమం. ఎవరి జీతం దేనికి ఖర్చు చేయాలి? ఎవరి జీతంలో ఎంత దాయాలి? అన్న విషయాల్లో స్పష్టత ఉంటే భవిష్యత్తు ఇక ఆనందదాయకమే!

Thursday, 23 October 2014

ఊబకాయులవడానికి ఇదికూడా ఒక మార్గం

రెగ్యులర్ గా తగవులు, ఆర్గ్యుమెంట్లు పెట్టుకునే ఆలుమగలు తొందరగా ఊబకాయులవుతారని అమెరికన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. భార్య లేదా భర్తతో గొడవ పెట్టుకున్న తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు వ్యక్తులు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. అలా, స్ట్రెస్ లో ఆహారం తీసుకున్నప్పుడు, శరీరంలో కేలరీస్ బాగా తక్కువగా ఖర్చవుతాయని... రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ బాగా పెరిగి మెజార్టీ ఆహారపదార్థాలు కొవ్వుగా మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా, ఒత్తిడితో ఆహారం తీసుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంటే ఊబకాయులవడం చాలా తేలికని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Wednesday, 22 October 2014

ధ్వని రహిత దీపావళి

రంగుదీపాల హరివిల్లు
మతాబుల చిరునవ్వులు
నింగిని ముద్దాడే తారాజువ్వలు
ముత్యాలు వెదజల్లే చిచ్చుబుడ్లు

రాత్రి అమావాస్య తెస్తుంది  దీపాల పౌర్ణమి మోదం
ఇతర  జీవులకు ప్రమాదం
ఎందుకు కావాలి మన  ప్రమోదం
జరుపుకుందాం ధ్వని రహిత సంబరం 

మీ ఇంట సిరిలు కురవాలనే సుభకామనలు
అందరికి దీపావళి  శుభాకాంక్షలు


ప్రకృతిలో వచ్చే మార్పులు. ఋతు  సంభన్ద  వ్యాధుల నివారణకు పుట్టిన మతాబులు, చిచ్చుబుడ్లు  కాల్చాలనే ఆరోగ్యకరమైన  ఆచారం  హైడ్రోజన్ బాంబుల ధ్వని కాలుష్యంలో అనాచారంగా  మారిపోయింది.
ఈ  బాంబుల ధ్వని వల్ల పాపం పక్షులు, ఇతర జంతువులూ  ఏమి జరుగుతోందో  తెలియక తల్లడిల్లి, ప్రాణాలమీదకు తెచ్చుకున్టాయి  అందుకే  ధ్వని రహిత దీపావళి జరుపుకుందాం 

Tuesday, 21 October 2014

మదుపరులకు ఆర్థిక రంగ నిపుణుల సలహాలు - దీపావళి బొనాంజా

మదుపరులకు ఆర్థిక రంగ నిపుణులు దీపావళి బొనాంజా సలహాలు జారీ చేశారు. దేశ వ్యాపార రంగంలో శరవేగంగా వృద్ధి సాధించడమే కాక స్థిరంగా రాబడులను అందిస్తున్న పది కంపెనీల షేర్లను ఈ దీపావళికి కొనుగోలు చేస్తే, వచ్చే దీపావళి నాటికి వాటి ధర దాదాపు 98 శాతం దాకా పెరుగుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ షేర్ల పేర్లు చెప్పండి అంటారా?... ఈ జాబితాలో తొలి స్థానంలో డీసీబీ ఉండగా, రెండో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.

ఆసియానా హౌసింగ్, కేపిటల్ ఫస్ట్, మేఘమణి ఆర్గానిక్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత సట్లెజ్ టెక్స్ టైల్స్, అపోలో టైర్స్, మంగళం సిమెంట్స్, సియారామ్ సిల్క్ మిల్స్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. వీటిలో మేఘమణి ఆర్గానిక్స్ అత్యధికంగా 98 శాతం లాభాలను అందిస్తుందట.

*సూచనగానే గమనించ ప్రార్ధన 
*Investments are subject to  market risk, the above info be used at your own discretion.

Monday, 20 October 2014

పచ్చి బొప్పాయి - పండిన బొప్పాయి

పండిన బొప్పాయిలను తినడానికే చాలా మంది ఇష్టపడతారు. అయితే, పోషక పదార్ధాల రీత్యా పచ్చి బొప్పాయి ఎంతో మేలంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు, ఎంజైములు జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చుతాయి. ముఖంపై మొటిమలు, మచ్చలు, పలు రకాల చర్మ వ్యాధులను నయం చేసే శక్తి పచ్చి బొప్పాయికి ఉంది. చర్మానికి చెందిన మృత కణాలను తొలగించి, కొత్త కాంతినిస్తుంది. పచ్చి బొప్పాయితో అమీబియాసిస్, నులిపురుగుల బెడద తప్పుతుంది. తద్వారా, అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలు నెమ్మదిస్తాయి. 

రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్టు చూడడం ద్వారా రక్తపోటు స్థాయిని సరైన స్థితిలో ఉంచుతుందీ పచ్చి బొప్పాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో 39 కెలోరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తినడం ద్వారా కొవ్వు చేరే అవకాశమే లేదు. దీన్ని సలాడ్ల రూపంలోనూ, జ్యూస్ గానూ తీసుకోవచ్చు. 

గాఢ నిద్ర మీకూ కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి !

ప్రస్తుత కాలంలో వ్యక్తులు విశ్రాంతి తీసుకునే సమయం తగ్గిపోతోంది. బిజీ లైఫ్, ఒత్తిళ్ళు ఇలా ఎన్నో అంశాలు వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోయేందుకు తగిన సమయం దొరక్క ఇబ్బంది పడుతుంటారు కొందరు. మరికొందరు పడుకున్నా నిద్ర రాక, అటూ ఇటూ దొర్లుతుంటారు. కంటినిండా నిద్రతోనే అందమైనా, ఆరోగ్యమైనా! శిశువులను చూడండి, వారు ఎంతో హాయిగా నిద్రపోతారు. అలాంటి గాఢ నిద్ర మీకూ కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. 

నిద్ర పోయేందుకు ఫిక్స్ డ్ టైం పెట్టుకోవాలి. దీనర్ధం, ప్రతి రోజూ ఒకే సమయంలో పడకపైకి చేరాలని కాదు. నిద్రవేళకు పడుకోవాలంతే. 

తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం సరికాదు. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల విరామం ఉండేట్టు చూసుకోవాలి. పడుకునే ముందు స్నానం చేస్తే మరీ మంచిది. 

నిద్ర లేవడం కూడా ఫిక్స్ డ్ టైం పద్ధతిలోనే అలవాటు చేసుకోవాలి. చక్కగా నిద్ర పోగలిగితే ఇక ప్రతి రోజూ అలారంతో పని లేకుండా అదే సమయంలో మెలకువ వచ్చేస్తుంది. 

సాయంత్రం వేళల్లో కాసింత ఒళ్ళు వంచగలిగితే శరీరం అలసినట్టవుతుంది. వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ మెరుగవుతుంది. నిద్ర చక్కగా వస్తుంది. 

నిద్రకు ముందు పుస్తకాలు చదవడం చాలా మందికి హాబీ. తద్వారా, నిద్ర ఆలస్యం అవుతుంది. వారు పుస్తకాలు చదవాలనుకుంటే ఏ చైర్లోనో కూర్చుని పూర్తి చేసేయాలి. పడక మీదికి పుస్తకం తేకూడదు. 

రాత్రివేళల్లో లైటు ఉంటేనే కొందరు నిద్రపోతారు. అలాంటి వారు రూల్సు బ్రేక్ చేయాలి. లైట్లు ఆర్పేసి పడుకోవడం అలవాటు చేసుకోగలితే సుఖ నిద్ర సొంతం చేసుకుంటారు. 

బెడ్ పై స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్లు వంటి వాటికి స్థానం కల్పించకూడదు. నిద్రవేళ సంగీతం వినడం కూడా మంచి అలవాటు కాదు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. 

బెడ్ పై ఉండాల్సింది దుప్పట్లు, దిండ్లే. ఇతర వస్తువులకు పడక మీద చోటివ్వకూడదు. 

కాఫీకి దూరంగా ఉండాలి. అందులో ఉండే కెఫీన్ నిద్ర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. 

Saturday, 18 October 2014

జలుబు, దగ్గు ? ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ !

వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. అన్ని వయసుల వారూ వీటి బారిన పడక తప్పదు. ముఖ్యంగా వీటి కారణంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి మందులు వాడినా ఉపశమనం లభించదు. అలాంటి సమయాల్లో ఇంట్లో లభించే వస్తువులతోనే వీటికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఆ ఆవిరిని చిన్నారికి పట్టిస్తే దగ్గు చాలావరకు తగ్గిపోతుంది. అంతేగాకుండా, ఛాతీ పట్టేసినట్టుగా అనిపిస్తే ఇది ఎంతో ఉపయోగకరం.

పసుపుకు యాంటీసెప్టిక్ గుణం ఉన్న సంగతి తెలిసిందే. వైరల్ ఇన్ ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు తాగిస్తే ఎంతో రిలీఫ్ గా ఫీలవుతారు. 

జలుబు చేసినప్పుడు గొంతులో నస సాధారణం. అందుకూ ఓ మార్గం ఉంది. గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత పుక్కిట పట్టాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే సరి. 

వేడి నీటి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది. 10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. 

పిల్లలకు తేనె అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. రోజులో రెండు మూడు సార్లు తేనెను వారితో కొద్దికొద్దిగా నాకిస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. ఐదేళ్ళ వయసు పైబడిన పిల్లలకు తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తినిపిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి. 

శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది. 

Thursday, 16 October 2014

పిల్లల తగవులు


కొందరు పిల్లలు ప్రతి దానికి మారాం చేస్తుంటారు. అది కావాలి, ఇది కావాలి అంటూ తోబుట్టువులతో గొడవలు పెట్టుకుంటారు. పిల్లల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. అలా కాకుండా, పిల్లల్లో ఆరోగ్యకరమైన అనుబంధం పెంపొందించేందుకు 6 మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

1. రెండో సంతానం గర్భంలో ఉండగానే, తొలి సంతానాన్ని ఈ విషయమై సన్నద్ధం చేయాలి. కుటుంబంలో కొత్తగా రాబోయే వ్యక్తితో మున్ముందు ఎలా మెలగాలో విడమర్చాలి. 

2. ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు? అన్న విషయాన్ని పిల్లలకు స్పష్టంగా తెలియజెప్పాలి. గొడవపడుతున్న పిల్లలను కూర్చోబెట్టి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. బాహాబాహీ తలపడడం, ఒకరి వస్తువులను మరొకరు దొంగిలించడం వంటి పనులను ఉపేక్షించరాదు. 

3. పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చకూడదు. పెద్దబ్బాయి అన్నం తింటూ చొక్కాపై పడేసుకున్నాడనుకోండి, అప్పుడు, నీ చెల్లెలు నీకంటే నయం అంటూ పోలిక పెడితే, అది వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 

4. స్పర్థ ఒక్కోసారి అసూయగా పరిణమిస్తుంది. చిన్నవారిని బాగా చూస్తున్నారని, తమను బాగా చూడడంలేదని కొన్నేసి సార్లు పెద్ద పిల్లలు భావిస్తుంటారు. అలాంటి భావనలు పిల్లల్లో కలగనీయకుండా వారిని సమానంగా చూడాలి. 

5. ఒక్కోసారి టీవీ కోసమో, సైకిల్ తొక్కడం కోసమో పిల్లలు పోటీ పడుతుంటారు. అలాంటప్పుడు వారి వారి గదుల్లోకి వెళ్ళమని సూచించాలి. ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో నిర్దేశించి, ఆ సమయంలో వారా పని చేసేట్టు చూడాలి. చిన్ననాటి నుంచే ఒకరితో ఒకరు వస్తువులను షేర్ చేసుకోవడాన్ని ప్రోత్సహించాలి. 

6. పిల్లలు గొడవ పడుతున్నారు కదా అని ప్రతిసారి జోక్యం చేసుకోవడం సరికాదు. పరిస్థితి చేయి దాటి పోతుందనుకున్న స్థితిలోనే మనం జోక్యం చేసుకోవాలి. 

Wednesday, 15 October 2014

ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందట

మిలమిల మెరిసే చర్మ సౌందర్యాన్ని కోరుకోని వారెవరుంటారు? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ రోజుల్లో తాజాగా కనిపించాలని భావిస్తున్నారు. అలా కనిపించాలంటే చర్మానికి తగిన పోషణ అందించాలి. 
ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందట. ఈ విషయంలో క్యారట్, ఆపిల్, ఆరెంజ్, టమేటా, బొప్పాయి జ్యూసులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

*క్యారట్లలో ఉండే విటమిన్ ఏ మొటిమలు, మచ్చలు, మంగు తదితర చర్మ రుగ్మతలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పరిపుష్ఠమైన ఆపిల్ పండ్లు తీసుకుంటే చర్మం ముడతలు పడదు. చర్మ కణజాలం దెబ్బతినదు. 

* ఆరెంజ్ తో చర్మం కొత్త సౌందర్యంతో మెరిసిపోతుందట. బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైము చర్మవ్యాధులను నయం చేయడంలో తోడ్పడుతుంది. 
*అలోవీరా జ్యూస్ కూడా చర్మానికి మేలు చేసేదే.రుచిగా లేకపోయినా  అందులో ఉండే ఖనిజలవణాలు, విటమిన్లు చర్మం యొక్క సాగే గుణాన్ని సరైన స్థితిలో ఉంచుతాయి. 
*టమేటా జ్యూస్ లో ఉండే లైకోపేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మం రంగును మెరుగుపర్చడమే కాకుండా, ముడతలను కూడా మాయం చేస్తుంది.
*బొప్పాయి గురించి అందరికి తెలిసిందే !

జుట్టు రాలటం తగ్గించుకోవడానికి సూచనలు

అపూర్వ షా సూచనలు : జుట్టు రాలటం తగ్గించుకోవడానికి 

జుట్టుకు రంగేయడం, హెయిర్ స్టైలింగ్ జెల్ పూయడం వంటి చర్యలకు స్వస్తి చెప్పాలని, వాటిలోని రసాయనాలు వెంట్రుకల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని అపూర్వ షా చెప్పారు.

జీవనశైలిలో ఎదురయ్యే ఒత్తిళ్ళను అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలని, తద్వారా జుట్టు రాలడానికి కారణమయ్యే అదనపు టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి అడ్డుకట్టవేయవచ్చని తెలిపారు. 

పాలకూర, విరిగిన పాలతో తయారు చేసే జున్ను, ఆక్రోట్లు, అవిసెలను ఆహారంలో తప్పక చేర్చాలని సూచించారు. వీటిలో ఉండే పోషక పదార్థాలు జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తాయని వివరించారు.
 

Monday, 13 October 2014

ధ్యానోదయం

ధ్యానం అనగానే అది హిందువులు, సన్యాసులు, వృద్ధులు చేసే పని అంటూ ఎన్నో అపోహలు పేరుకుపోయాయి. ప్రధానంగా పది అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఈ అపోహల వల్ల చాలా మంది సాధన చేయడంలేదు. ఆ అపోహలేంటంటే. మెడిటేషన్ అంటే ఏకాగ్రత అనే అపోహ చాలామందిలో ఉంది. వాస్తవానికి ధ్యానం వల్ల ఏకాగ్రత కుదురుతుందే తప్ప మెడిటేషన్ అంటే ఏకాగ్రతే కాదు. మెడిటేషన్ అంటే మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రశాంతతనివ్వడం. ఇది ఓ క్రమపద్ధతిలో చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. అంతే తప్ప మెడిటేషన్ అంటే ఏకాగ్రతే కాదు. 

అలాగే ధ్యానం హిందూ మతంలో ఓ భాగం అనే అపోహ చాలా మందిలో పేరుకుపోయింది. దీంతో కేవలం హిందూ మత సంబంధీకులే ధ్యానం చేసేవారు. తాజాగా ధ్యానం విలువ తెలుసుకున్న పాశ్చాత్యులు సైతం ధ్యానంపై మక్కువ పెంచుకుని ఆచరిస్తున్నారు. మన దేశంలో మాత్రం ధ్యానం అనేది కేవలం హిందూ సిద్ధాంతం అనే ఆలోచన నుంచి చాలా మంది బయటపడలేకపోతున్నారు. 

ధ్యానం ఓ మతానికి సంబంధించినది కాదని, ప్రజలను, మతాలను, ప్రాంతాలను, దేశాలను ఏకం చేసే ప్రక్రియ అని ధ్యానాన్ని ఆచరించేవారు చెబుతున్నారు. అలాగే ధ్యానం కేవలం వృద్ధులు ఆచరించే కార్యక్రమమని యువతలో ఓ అపోహ బలంగా నాటుకుపోయింది. ధ్యానం ఎనిమిదేళ్ల వయసునుంచే ఆచరించగలిగే ప్రక్రియ. ధ్యానం ఆచరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఆలోచనలు స్వాధీనంలో ఉంటాయని, శరీరంపై అదుపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ధ్యానం చేయడం అంటే హిప్నాటిజం చేసుకోవడమనే అపోహ చాలా మందిలో ఉంది. ధ్యానం ఆచరించగలిగే వారు హిప్నాటిజానికి గురికారని నిపుణులు చెబుతున్నారు. హిప్నాటిజం చేసిన వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదని, యోగాలో ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుస్తుందని, శరీరం, మనసుపై పట్టు వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ధ్యానం అంటే ఆలోచనే అనే భావం చాలమందిలో ఉంది. అది సరికాదని ధ్యానం చేసేవారికి ఆలోచనపై అదుపు వస్తుందని, కేవలం యుక్తాయుక్త విచక్షణ తెలుస్తుందని, దాని వల్ల తాను చేసేది మంచో చెడో తెలుసుకునే స్థాయి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ధ్యానం సమస్యల నుంచి పారిపోవడానికి మంచి ప్రక్రియ అనే భావం చాలా మందిలో కనిపిస్తుందని అది సరికాదని పెద్దలు చెబుతున్నారు. ధ్యానం సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినిస్తుందని, సమస్యకు సరైన స్పందనను తెలియజేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ధ్యానాన్ని గంటల తరబడి చేయాలనే అపోహ బలంగా నాటుకుపోయింది. ధ్యానం సరైన పద్దతిలో చేస్తే, ఏకాగ్రతతో చేయగలిగితే కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని స్పష్టం చేస్తున్నారు. 

ధ్యానం చేస్తే సాధువులు, సన్యాసినులుగా మారుతారనే అపోహ కారణంగా ధ్యానాన్ని చాలా మంది ఆచరించడం లేదు. అయితే ధ్యానం చేసేవారంతా సాధువులు కారని, మంచి జీవనం సాగించడానికి ధ్యానం ఎంతో ఉపకరిస్తుందని వారు తెలిపారు. 

ధ్యానం చేయడానికి ఓ సమయం, సరైన ప్రదేశం ఉండాలనే అపోహ చాలా మందిలో ఉంది.  అయితే ధ్యానం చేయడానికి సరైన ప్రదేశం కంటే సరైన ఏకాగ్రత అవసరం, కాని ప్రతిరోజూ ఒకే నియమిత సమయానికి ధ్యానం చేస్తే సులువుగా ఏకాగ్రత వస్తుంది . అలాగే దిక్కులు కూడా అవసరం లేదు. కావాల్సిందల్లా ఖాళీ కడుపు. అయతే సూర్యోదయాన, సూర్యాస్తమయాన ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తారు తప్ప అది రూల్ కాదు.

రూపాయితో ఏం కొనగలం అనుకుంటున్నారా?

రూపాయితో ఏం కొనగలం అనుకుంటున్నారా? లేక, భారత్ లో రూపాయికి ఏం వస్తాయనుకుంటున్నారా? అయితే, రూపాయితో మనం ఏమేం చేయగలమో ఆ వివరాలు ఇవిగో..! 

రూపాయికి సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి రావచ్చు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో మన బరువు తెలుసుకోవచ్చు. తమిళనాడు వెళితే 'అమ్మ' క్యాంటీన్లో ఇడ్లీ తినొచ్చు. ఓ జిరాక్స్ కాపీని రూపాయితోనే సొంతం చేసుకోవచ్చు. తిన్నది అరిగించుకోవడానికో, కడుపులో మంట తగ్గించుకోవడానికో ఓ జెలూసిల్ టాబ్లెట్, దేన్నైనా అగ్నికి ఆహుతి చేయగల అగ్గిపెట్టె, తలకు పట్టిన మురికిని వదిలించే షాంపూ సాషే, పిల్లలు తినే బిస్కెట్, చాక్లెట్ .  

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అందించే నిరోధ్ బ్రాండ్ 5 డీలక్స్ కండోమ్ ల ప్యాక్ వెల రూ.3. దానర్థం, సింగిల్ కండోమ్ ధర రూపాయి కన్నా తక్కువే. ఇక, పార్లమెంటుకు వెళితే రూపాయితో టీ తాగొచ్చు, రూపాయితో చపాతీ తినొచ్చు. అయితే, రైస్ మాత్రం అక్కడ 2 రూపాయలట.
మన మాజీ ముఖ్యమంత్రి  కిలో బియ్యాన్ని రూపాయికి అందిచే పధకాన్ని ప్రవేశపెట్టేరు కదా !

రెడీమేడ్ ఆహారం - క్యాన్సర్ ముప్పు

ప్రస్తుతం స్పీడ్ యుగం నడుస్తోంది. ప్రజల లైఫ్ స్టయిల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. భారత్ వంటి దేశాల్లోనూ పాశ్చాత్య దేశాల తరహాలో ఇంట్లో వంట చేసుకోవడం క్రమేణా తగ్గుతోంది. రెడీమేడ్ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ఇలాంటి ఆహార అలవాట్లు క్యాన్సర్ కు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల్లో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారుచేసిన ఫ్లేవర్లు, కృత్రిమ చక్కెర కలుపుతారని, వాటి ద్వారా జీర్ణకోశ క్యాన్సర్ తలెత్తే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ తరహా ఆహార పదార్ధాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయని, తద్వారా వాటిలో ఏర్పడే రసాయనిక మార్పులు క్యాన్సర్ కు దారితీస్తాయన్నది నిపుణుల మాట.
ప్రోసేస్సుడ్  ఫుడ్    
రెడ్ మీట్ (బీఫ్, మటన్) తినేవారిలో జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పు అధికమట. ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ లో ఉండే సోడియం నైట్రేట్ రూపాంతరం చెంది క్యాన్సర్ కారకంగా మారడమే అందుకు కారణం. ఈ మేరకు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించగా స్పష్టమైంది. ఈ క్రమంలో రోడ్డు మీద కాల్చే మాంసాహార పదార్ధాలు కూడా ప్రమాదకరమే. ఇక చక్కెర కారణంగా క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయట. చక్కెరతో తయారైన పదార్థాలను అధికంగా తీసుకుంటే బరువు పెరిగి, ఫలితంగా రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశముంది.
ఫ్రైడ్ స్నాక్స్ 
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్ ఐటమ్స్ లో ఉండే అక్రిలమైడ్ అనే పదార్థం క్యాన్సర్ ను కలిగించే గుణం కలిగి ఉంటుంది. ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు ఈ అక్రిలమైడ్ తయారవుతుంది. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో అక్రిలమైడ్ కారణంగా కణుతులు ఏర్పడినట్టు తెలుసుకున్నారు. ముఖ్యంగా, మద్యపానం కారణంగా నోరు, గొంతు, కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

Friday, 10 October 2014

సంకల్పం చేసుకోండి.

సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. ఆ కధ ఏమంటే - అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు. 
ఒక గబ్బిలం వుండేది. పై కప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలక్రిందులుగా వేలాడబడి వుంటుంది. ఎక్కువగా చీకట్లో, గుహల్లో వున్నట్లుగా వర్ణన వుంటుంది. 
ది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇఖ వారు ఎవరి మాట వినలేదు. 
ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం!
ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.
"ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే -
భగవంతుడంటాడు - "ఓ బుద్దిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు! పదండి ముందుకు!!

గురువుగారికి కృతజ్ఞతలతో !

Thursday, 9 October 2014

ఈర్ష్య - ద్వేషభావం


ఈర్ష్య... వ్యక్తుల నడతకు సంబంధించిన లోపాల్లో ముఖ్యమైనది, ప్రమాదకరమైనది కూడా! స్నేహితులు విడిపోతారు, ప్రేమికుల మధ్య అంతరం పెరుగుతుంది, వైవాహిక బంధం విడాకులకు దారితీస్తుంది. కారణం... ఈర్ష్యే. దీన్నే ఆంగ్లంలో జెలసీ అంటారు. జెలసీ అంటే ఆత్మన్యూనత భావం తప్ప మరోటి కాదు. ఎదుటివారి కంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం, తద్వారా, ఎదుటివారిపై ద్వేషభావం పెంచుకోవడం... ఇదే ఈర్ష్య అంటే! ఈ దుర్గుణం వ్యక్తి ఎదుగుదలను నాశనం చేస్తుంది. దీర్ఘకాలంలో పతనం అంచులకు చేర్చుతుంది. ఈ వ్యక్తిత్వ లోపాన్ని అధిగమించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ ముఖర్జీ కొన్ని విలువైన సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.


ఇది కూడదు 
కొందరు తమను ప్రతి ఒక్కరితో పోల్చుకుంటూ ఉంటారు. దానర్థం, వారిని వారు తక్కువ చేసుకోవడమే. మీ భాగస్వామి మీ చెంత ఉందంటే ఆమె/అతడు మీ సొంతమనే. అలాగని అన్ని వేళలా భాగస్వామి మదిలో మీరే ఉండాలనుకోవడం సరికాదు. ఇతరుల గురించి చర్చించే అవకాశం భాగస్వామికి ఇవ్వాలి. మీ విషయాలు కాకుండా, మరెవ్వరి విషయాలను చర్చిస్తున్నా సావధానంగా వినడం అలవర్చుకోవాలి.


ఇలా చేయవచ్చు 
ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచించడం మానుకోవాలి. మీరు ఫోన్ చేసిన సమయంలో మీ భాగస్వామి వారి ఆఫీసు బాస్ తోనో, మరెవరైనా మిత్రులతోనో మాట్లాడుతూ ఉండవచ్చు. ఆమె/అతడు ఎవరితో మాట్లాడుతున్నారన్న విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అలాంటి విషయాలు తెలుసుకోవడం ప్రాక్టికల్ గా కొన్నిసార్లు సాధ్యం కాదు కూడా. వీటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కంటే, కాసేపాగి ట్రై చేయడం మంచిది. ఇలాంటి సమయాల్లో మనసును ఇతర పనులపై లగ్నం చేయడం ఉత్తమం.


ముందుకు సాగాలి 
జీవితమన్నాక ఒంటరితనం కొన్నిసార్లు అనుభవంలోకి రాకతప్పదు. అయితే, ఆ ఒంటరితనాన్ని అధిగమించడమూ ముఖ్యమే. భాగస్వామితో గొడవలు మామూలు విషయం. వాదన ఆధారంగా మీ భాగస్వామిని అంచనా వేయడం పొరపాటు. ఆవేశంలో ఏవో మాట్లాడతారు. వాటిని పట్టించుకోనవసరంలేదు. ఇలాంటి సమయాల్లో ఒంటరిగా కొంచెం దూరం వాకింగ్ కు వెళ్ళడం ఆత్మపరిశీలనకు ఉపకరిస్తుంది. అలాగని ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకోనవసరంలేదు.

భాగస్వాముల మధ్య కొంచెం ఎడబాటు కూడా అవసరం. అనుబంధంలో కాసింత విరామాన్ని కూడా లాభదాయకంగా మలుచుకోవచ్చు. మీరు మీ స్నేహితులను కలుసుకోవచ్చు, మీ భాగస్వామిని కూడా తన శ్రేయోభిలాషులను కలుసుకునేలా ప్రోత్సహించవచ్చు. మీ భాగస్వామి విశ్వసనీయతపై అనుమానం వస్తే, సాధ్యమైనంత సామరస్యపూర్వకంగా నివృత్తి చేసుకునేందుకు యత్నించండి. ఆ సందేహం మీ భ్రాంతి కావచ్చేమో!

అర్థంలేని ఆలోచనలు మనిషిని డిప్రెషన్ లోకి నెడతాయి. జీవితం సాధారణమైనది అనుకుంటే, దాన్ని అనారోగ్యకర ఆలోచనలతో సంక్లిష్టం చేసుకోకండి. మీ పట్ల మీరు నమ్మకం కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు దేవుడి అద్భుత సృష్టి అని భావించుకోండి. తద్వారా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే నైతిక స్థయిర్యం మీ సొంతమవుతుంది.