SEARCH

Saturday 20 September 2014

లీటర్ పెట్రోల్ కి 100 కిలోమీటర్ల మైలేజినిచ్చే కారు ?

కొత్తగా తయారైన 'ఇయోల్యాబ్' అనే కారు లీటరు పెట్రోలుకు వంద కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని దాని యజమాని రెనో కంపెనీ చెబుతోంది. దీనిని ఇప్పటికే పరీక్షించారని, దీనిని ప్యారిస్ మోటారు షోలో కూడా ప్రదర్శించారని ఆ సంస్థ వెల్లడించింది. సరికొత్త టెక్నాలజీతో ఇంధనాన్ని అత్యంత తక్కువ వినియోగించుకునే కారును రూపొందించాలన్న లక్ష్యంతో దీనిని తయారుచేసినట్టు రెనో కంపెనీ చెబుతోంది.

బి-సెగ్మెంటు కారుగా చెబుతున్న దీని కోసం అత్యాధునిక 100 టెక్నాలజీలు ఉపయోగించారు. ఈ కారు కోసం ఏరోడైనమిక్స్ ను కొత్తగా రూపొందించారు. కారు బరువు తక్కువ ఉండేలా చూశారు. కారులో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాడారు. దీని వల్ల ఈ కారు పెట్రోలు, కరెంటుతో కూడా నడుస్తుంది. ఇకపై కారును షోరూంలో చూసి, పక్కన నిలబడి ఫొటోలు తీసుకుని ఆనందించే రోజులు పోయాయని, అందరూ సొంత కారు కలను నిజం చేసుకునే రోజులు వస్తున్నాయని రెనో కంపెనీ స్పష్టం చేసింది.

No comments:

Post a Comment