SEARCH

Saturday 27 September 2014

JJ = Jail for Jayalalita

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తులు కూడబెట్టారని ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషేనని స్పష్టం చేసింది. కేవలం ఒక రూపాయి మాత్రమే వేతనంగా స్వీకరిస్తూ జయలలిత అంత పెద్ద స్థాయిలో ఆస్తులు ఎలా కూడబెట్టారని న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 1996లో ఆమె అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. 



ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతోపాటు, రూ. 100 కోట్ల జరిమానా విధించింది. 
జయతో పాటు ఈ కేసులో నిందితులైన శశికళ, ఇలవరసి, సుధాకరన్ లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 కోట్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  

బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు శిక్షను ఖరారు చేయగానే... తీరతారొ పోలీసులు ఆమెను బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న ఆసుపత్రిలో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు.  

 ఇలాగ  జరగడానికి కారణం  అక్రమాస్తులు కూడబెట్టడం ఒక్కటేనా ?
కాదు ! అధికార దుర్వినియోగం , ఆశ్రిత  పక్షపాతం , గురుధిక్కారం ( కంచి  స్వామి జైలు)  కాదంటారా ?
మనం నవ్వుతూ  చేసే  పాపలకు  శిక్ష ఏడుస్తూ అనుభవించాల్సిందే !
ఇంకా ఎంతమంది ఇలా బారులు తీరతారో ?!
 

No comments:

Post a Comment