SEARCH

Wednesday 24 September 2014

విశ్వంవినువీధులలో రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం. ఈ రోజు మనం సాధించిన విజయం. మామ్! (అంగారక అన్వేషణ ఉపగ్రహం)

విశ్వంవినువీధులలో రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం. ఈ రోజు మనం సాధించిన విజయం. మామ్! (అంగారక అన్వేషణ ఉపగ్రహం). చేసిన మొదటి ప్రయత్నంలో విజయం సాదించటంద్వారా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దేశంగా, ప్రపంచలోనే నాల్గవ దేశంగా నిలిచి, అంతరిక్ష చరిత్రలో మనకంటూ ఒక సువర్ణ అధ్యాయానికి లిఖించుకున్నాము. నిజంగా ఇది మన అంతరిక్ష ప్రయాణంలో మరో కలికితురాయే అన్ని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, వాళ్లందరూ సెప్టెంబర్ 24 కి బదులుగా మామ్ విజయంసాధించిన రోజుగా చెప్పుకోవచ్చు. శ్రీ మోడీ గారి మాటల్లో చెప్పినట్టు, ఒక హాలీవుడ్ మూవీ నిర్మాణంకంటే అతి తక్కువ ఖర్చుతో మన భారతదేశం ఈ విజయం సాధించటం అబినందనీయం. ఈ విజయానికి ప్రధాన కారణాలు.
1.     వలసపోని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం / శాస్త్రవేత్తల కృషి.
2.     ప్రభుత్వాలకతీతంగా ఇస్రో సంస్థకు అందించిన సహకారం.
3.     అంతర్జాతీయ సమాజం మనమీద విధించిన ఆంక్షలు.
4.     సాధించగలమనే సానుకూల ధృక్పదం.
ఇది నా కుటుంబ విజయం, నా సమాజ విజయం, అంతిమంగా మన భారతదేశ విజయం. 

1 comment: