SEARCH

Tuesday 9 September 2014

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు ?

ఇదేమి ప్రశ్న ? అనుకుంటున్నారా ?

జవాబు నాకే కాదు ఆ రాష్ట్ర  ప్రభుత్వం  కూడా సమాధానం కోసం సతమతమవుతోంది


రాష్ట్రావతరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ చిక్కుముడి వచ్చి పడింది. ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరపాలో తెలియక ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్రం కావడంతో జూన్ రెండో తేదీని లెక్కలోకి తీసుకోవాలా? లేక నవంబర్ ఒకటిన ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన దినాన్నే రాష్ట్రావతరణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలా? లేక తొలుత మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావం జరిగింది కాబట్టి దానిని ఉత్సవ తేదీగా నిర్ణయించాలా? అని ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. వీటిపై చర్చోపచర్చలు జరిపిన తర్వాత ఏ నిర్ణయానికి రాలేక ఉన్నతాధికారులు ఈ ఫైల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపించారు.
 చంద్రబాబు ఈ విషయంపై పండితులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు అంటున్నాయి.



4 comments:

  1. మధ్యలో వచ్చి చేరిన హైదరాబాదు రాష్ట్రం ఇప్పుడు తెలంగాణం పేరుతో వేరు కుంపటి పెట్టుకుంది. మిగిలింది ఆంధ్రరాష్ట్రమే. అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావం జరిగింది కాబట్టి దానిని ఉత్సవ తేదీగా నిర్ణయించాలి. మధ్యంతరంగా వచ్చిన కూడిక తీసివేతల తాలూకూ దినాలు పెట్టవలసిన అగత్యం లేదు. స్వస్తిరస్తు.

    ReplyDelete
  2. Yes, Syamaleeyam gaaru cheppindi Correct. October 1 ne jarapaali.

    ReplyDelete
  3. అక్టోబర్ ఒకటిన చెయ్యటమే సరైనది....హైదరాబాదు ఇవ్వాళ విడిపోయిందని...రేపు యానాం కలిసిందని మార్చుకూడదు. ఈ విషయమై నా బ్లాగులో వ్రాయటం జరిగింది....లింక్: http://ideechadavamdi.blogspot.in/2014/06/blog-post.html

    ReplyDelete
  4. కలిసి, ముక్కలయిన రాష్ట్రానికి అసలు ఈ అవతరణదినోత్సవం అవసరమంటారా?

    ReplyDelete